బంగారు నగలు, గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని అనంతపురం నాల్గవ పట్టణ ఎస్‌ఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు.
అనంతపురం సెంట్రల్ : బంగారు నగలు, గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని అనంతపురం నాల్గవ పట్టణ ఎస్‌ఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి 9 తులాల బంగారు నగలు, 15 గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు జీటీనాయుడు, శ్రీరామ్‌లు వెల్లడించారు. కంబదూరు మండల కేంద్రానికి చెందిన ఎరికల ముత్యాలు అలియాస్ జొల్లోడు, సోమశేఖర్‌ల నుంచి 7 తులాల బంగారు, కదిరి మండలం దేవరపల్లికి చెందిన నరసింహ నుంచి 2 తులాల బంగారు, కంబదూరు మండలానికి చెందిన వన్నూరప్ప నుంచి 15 గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు.
వీరంతా వేర్వేరుగా దొంగతనాలకు పాల్పడేవారు. ఇటీవల నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలు చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి, ఒంటిరిగా వెళుతున్న మహిళల మెడల్లోని బంగారు నగలను ఎత్తుకెళ్లేవారు. ఇటీవల చోరీలపై నిఘాపెట్టిన నాల్గవ పట్టణ పోలీసులు రాత్రి సమాయాల్లో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 9 తొమ్మిదితులాలు బంగారు నగలను స్వాదీనం చేసుకున్నారు. పలుచోట్ల దొంగతనం చేసిన గొర్రెల వివరాలను కూడా విచారణలో వెల్లడించారు. వీరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్‌ఐలు వివరించారు. కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ నరసింహులు, కానిస్టేబుళ్లు పవన్‌కుమార్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.