అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
విశాఖపట్నం: అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముఠాలోని నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్ష నగదు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.