captured
-
బహ్రయిచ్‌లో పట్టుబడిన ఐదో తోడేలు
బహ్రయిచ్: యూపీలోని బహ్రయిచ్‌లో తోడేళ్ల భీభత్సం కాస్త అదుపులోకి వచ్చింది. తాజాగా అటవీశాఖ అధికారులు ఐదో తోడేలును కూడా పట్టుకున్నారు. ఆ తోడేలును రెస్క్యూ షెల్టర్‌కు తరలిస్తున్నారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకూ మొత్తం ఐదు నరమాంసభక్షక తోడేళ్లను పట్టుకోగా, ఒక తోడేలు ఇంకా స్వేచ్చగా తిరుగుతోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పుడు పట్టుకున్న తోడేలు బహ్రయిచ్‌లోని హర్బక్ష్ సింగ్ పూర్వా గ్రామంలో అటవీశాఖ అధికారుల కంటబడింది. అటవీశాఖ అధికారులు గాలిస్తున్న తోడేళ్లలో ఇదొకటని తెలుస్తోంది.గత కొంతకాలంగా బహ్రయిచ్,సీతాపూర్‌లలో తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఐదేళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సీతాపూర్‌లో కూడా తోడేలు దాడులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఆరుగురిపై తోడేలు దాడి చేసింది. తోడేలు బారిన పడిన ఒక వృద్ధురాలు మృతి చెందింది. బహ్రయిచ్‌లో తోడేళ్ల దాడిలో ఏడుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి. 35కి పైగా గ్రామాల్లో తోడేళ్ల భయంతో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. గ్రామంలో దాదాపు డజను తోడేళ్లు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే వీటి సంఖ్య చాలా తక్కువేనని అటవీశాఖ అధికారులు అంటున్నారు. #WATCH | Bahraich, Uttar Pradesh: The Forest Department captured the fifth wolf and is now taking it to a rescue shelter of the Forest Department.So far 5 wolves have been caught. One more wolf remains to be caught. pic.twitter.com/euCm2tKaAr— ANI (@ANI) September 10, 2024 -
7 అడుగుల నాగు..17 ఏళ్ల వయసు
వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని చందాపూర్ రోడ్డు పీర్లగుట్ట సమీపంలోని ఓ ఇంట్లోకి అతి పెద్ద నాగుపాము వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఇంటి యజమాని రాంబాబు బాత్రూంలోకి వెళుతుండగా.. బుసలు కొడుతున్న శబ్దం విని ఆగిపోయాడు. ఆ తర్వాత చూడగా పెద్ద నాగుపాము కనిపించింది. దీంతో భయపడిన రాంబాబు సాగర్ స్నేక్ సొసైటీ నిర్వాహకుడు చీర్ల కృష్ణసాగర్‌కు ఫోన్ చేశాడు.వెంటనే ఆయన తన బృందంతో అక్కడకు చేరుకొని పామును పట్టుకున్నా డు. పాము పొడవు ఏడు అడుగులు ఉండగా, వయసు 16 నుంచి 17 ఏళ్లకు పైబడి ఉంటుందని కృష్ణసాగర్ చెప్పాడు. తాను ఇప్పటి వరకు 7,013 పాములు పట్టుకున్నానని, కానీ ఇంతపెద్ద నాగుపామును చూడటం ఇదే మొదటిసారి అని కృష్ణసాగర్ తెలిపాడు. ఈ విషయంపై వెటర్నరీ ఏడీ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ పాము వయసు ఎక్కువే ఉండొచ్చని.. దాన్ని సమీపంలోని అడవిలో వదిలిపెట్టినట్టు తెలిపారు. -
‘ఒంటెలను ఇవ్వండి’.. పోలీసులకు జడ్జి ఆదేశం!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ వింత ఉదంతం చోటుచేసుకుంది. హైకోర్టును ఆశ్రయించిన ఓ వ్యక్తి తమ 22 ఒంటెలను పోలీసుల నుంచి తిరిగి ఇప్పించాలని అభ్యర్థించాడు. దీనిపై స్పందించిన కోర్టు.. లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నుండి సమాధానం కోరింది. ఈ కేసు రాబోయే మార్చి లో విచారణకు రానుంది. ఈ కేసు 2019 నుంచి నడుస్తోంది. ఆ ఏడాది ఆగస్టు లో ఈద్ సందర్భంగా ఒంటెలను బలి ఇవ్వడాన్ని పోలీసు యంత్రాంగం నిషేధించింది. ఈ నేపధ్యంలో మీరట్‌లోని మహ్మద్ అనాస్‌కు చెందిన 22 ఒంటెలను లిసాడి గేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంతకాలమైనా ఆ ఒంటెలను పోలీసులు తిరిగి ఇవ్వకపోవడంతో అనాస్ 2022లో హైకోర్టును ఆశ్రయించాడు. తన ఒంటెలను తిరిగి ఇప్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 2023, జనవరి 12న ఒంటెలను అతనికి తిరిగి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందని, అయితే పోలీసులు కోర్టు ఆదేశాలను పాటించలేదని అనాస్ తరపు న్యాయవాది షామ్స్-ఉ-జమాన్ మీడియాకు తెలిపాడు. ఇప్పుడు ఈ ఉదంతంపై తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు మార్చి 18న కోర్టులో విచారణకు రానుంది. ఈ విషయమై సిటీ మేజిస్ట్రేట్ మాట్లాడుతూ అనాస్‌కు చెందిన 22 ఒంటెలను పోలీసులు తిరిగి అతని ఇవ్వని విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అందుకే లిసాడి గేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ నుంచి దీనికి తక్షణం సమాధానం కోరామన్నారు. -
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని చంద్రుని ఉపరితలం..
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. రోవర్ ప్రగ్యాన్ ఇప్పటికే బయటకు వచ్చింది. ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉందని ఇస్రో తెలిపింది. అన్ని ప్రక్రియలు అనుకున్న ప్రకారమే షెడ్యూల్లో పూర్తి అయ్యాయని స్పష్టం చేసింది. రోవర్ కదలికలు ప్రారంభమయ్యాయని తెలిపింది. అయితే.. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగేప్పుడు చివరి క్షణంలో తీసిన జాబిల్లి వీడియోను షేర్ చేసింది. Chandrayaan-3 Mission: All activities are on schedule. All systems are normal. 🔸Lander Module payloads ILSA, RAMBHA and ChaSTE are turned ON today. 🔸Rover mobility operations have commenced. 🔸SHAPE payload on the Propulsion Module was turned ON on Sunday. — ISRO (@isro) August 24, 2023 దక్షిణ ధృవంపైనే ఎందుకు..? చంద్రయాన్ 3 దిగ్విజయంగా జాబిల్లిపై కాలు మోపింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. అయితే.. దక్షిణ ధృవాన్ని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నపై ఇస్రో చీఫ్ సోమనాథ్ సమాధానమిచ్చారు. 'చంద్రుని దక్షిణ ధృవంపై సూర్మరశ్మి పడే అవకాశాలు లేవు. నీరు, ఖనిజాలకు సంబంధించిన వివరాలు లభించే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా చంద్రుని నివాసానికి సంబంధించిన వివరాలు కూడా దక్షిణ ధృవం వద్ద లభిస్తాయి. అందుకే ఈ ధృవం వైపే అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడానికి పలు దేశాలు ప్రయత్నించాయి' అని తెలిపారు. 'చంద్రయాన్ 2 ప్రయత్నంలో విఫలమైన తర్వాత మరో ప్రయోగానికి సిద్ధమయ్యాం. ఓ ఏడాది చంద్రయాన్ 2లో జరిగిన తప్పిదాలపైనే అధ్యయనం చేశాం. మరో ఏడాది ఆ తప్పులను సరిచేయడంపైనే పనిచేశాం. మరో ఏడాది వాటిని పరీక్షించి చూసుకున్నాం. చివరగా నాలుగేళ్లకు చంద్రయాన్ 3ని ప్రయోగించాం.' అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై ల్యాండ్ అయింది. ఇప్పటికే ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది. మరో 14 రోజులపాటు చంద్రునిపై పనిచేయనుంది. ఇదీ చదవండి: జాబిల్లిపై మూడు సింహాల అడుగులు.. రోవర్‌కు సారనాథ్ అశోక చిహ్నం.. -
కామారెడ్డి: ఫారెస్ట్ ఆఫీసర్లను బంధించిన తండా వాసులు
సాక్షి, కామారెడ్డి: మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేట పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. అటవీ అధికారుల్ని తండా వాసులు బంధించారు. అటవీ భూమిని చదును చేస్తుండగా అధికారులు అక్కడికి వెళ్లారు. తండావాసుల్ని అడ్డుకోగా.. వాళ్లు ఉల్టా అధికారుల్ని బంధించారు. పోలీసుల కథనం ప్రకారం.. అక్కాపూర్ -మైసమ్మ చెరువు దుర్గమ్మ గుడి తండా సమీపంలోని అటవీ భూమిని అక్కడి ప్రజలు చదును చేస్తున్నారు. ఆ సమయంలో అటవీ అధికారులు అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహించిన తండా వాసులు.. అధికారుల్ని బంధించారు. ఈ ఘటనపై స్థానిక మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ అధికారి రమేష్. దీంతో.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: నెహ్రూ ఓఆర్ఆర్ ప్రవేట్ చేతుల్లోకి.. -
ఉగ్రవాదం పై ఉక్కుపాదం
-
పంజ్‌షీర్‌పై పట్టు సాధించాం!
కాబూల్: దశాబ్దాలుగా తమకు కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్ ప్రావిన్సును ఎట్టకేలకు హస్తగతం చేసుకున్నామని తాలిబన్లు సోమవారం ప్రకటించారు. ఇప్పటివరకు తాలిబన్ల పాలనకు లొంగకుండా ఉన్నవారికి పంజ్‌షీర్ కేంద్రస్థానంగా నిలిచింది. కానీ తాజాగా పంజ్‌షీర్‌లోని 8 జిల్లాల్లో తాలిబన్లు వేలాదిగా ప్రవేశించి మొత్తం ప్రావిన్సును ఆక్రమించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ ఫైటర్ల చేతికి పంజ్‌షీర్ చిక్కిందని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు. ప్రతిఘటన బృందాలను జయించామని, మిగిలినవారు పారిపోయారని చెప్పారు. అణచివేతకు గురైన పంజ్‌షీర్ ప్రజలకు విముక్తి లభించిందన్నారు. పంజ్‌షీర్ ప్రజలకు సంపూర్ణ రక్షణ ఇస్తామని, వారిపై ఎలాంటి వివక్ష చూపమని జబీహుల్లా చెప్పారు. కానీ తాలిబన్ల రాకతో భయపడిన వేలాదిమంది పర్వతాల్లోకి పారిపోయారు. తాలిబన్ బృందాలు గవర్నర్ ఆఫీసు వద్ద జెండా ఎగరవేస్తున్న దృశ్యాలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. మరోవైపు తాలిబన్ల ప్రకటనను పంజ్‌షీర్ పోరాట నేతలు తోసిపుచ్చారు. అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లాసలేహ్, పంజ్‌షీర్ నేత అహ్మద్ మసూద్ నేతృత్వంలో ఇంతవరకు పంజ్‌షీర్‌లో దళాలు తాలిబన్లను ప్రతిఘటిస్తూ వచ్చాయి. తాలిబన్లు మారణ హోమాన్ని నిలిపివేస్తే చర్చలకు తాము సిద్ధమని ఇటీవలే అహ్మద్ ప్రకటించారు. కానీ తాలిబన్లు పోరాటానికే నిశ్చయించుకొని పంజ్‌షీర్ లోయపై దాడి చేశారు. ఫహీమ్‌ని చంపేశారు పంజ్‌షీర్ పోరాట దళాల ప్రతినిధిగా బయటప్రపంచానికి ఎప్పటికప్పుడు విశేషాలు తెలియజేస్తూ వచి్చన ఫహీమ్ దష్తి గొంతు మూగబోయింది. ఈ మేరకు అఫ్గాన్ రెసిస్టెంట్ ఫ్రంట్ ఫేస్బుక్ పేజీలో ప్రకటించింది. ఫాసిస్టు గ్రూపుతో పోరాటంలో ఫహీమ్ అమరుడయ్యాడని నివాళి అరి్పంచింది. పాకిస్తాన్ జరిపిన దాడిలో ఫహీమ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించారని పంజ్ïÙర్ నేత మసూద్ ఒక ప్రకటనలో చెప్పారు. చర్చలకు సిద్ధమన్నా వినకుండా తాలిబన్లు తమపై పోరుకు వస్తున్నారని మసూద్ సోమవారం విమర్శించారు. అమ్రుల్లా సలేహ్, మసూద్ ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. సలేహ్ నివసించే ఇంటిపై ఆదివారం హెలికాప్టర్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ దాడి నుంచి సలేహ్ సురక్షితంగా తప్పించుకొని గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లిపోయారు. తాలిబన్లకు వ్యతిరేకంగా పంజ్‌షీర్ చాలా రోజులు పోరాటం చేస్తుందని నిపుణులు భావించారు. కానీ అంతర్జాతీయంగా ఎలాంటి సాయం అందకపోవడంతో చివరకు ఈ ప్రాంతం కూడా తాలిబన్లకు తలవంచాల్సి వచి్చంది. పాక్ అండతోనే: మసూద్ పంజ్‌షీర్‌పై తాలిబన్లు పట్టుసాధించడంలో పాకిస్తాన్ సాయం చేసిందని పంజ్ïÙర్ నేత అహ్మద్ మసూద్ నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ఆడియో మెసేజ్ విడుదల చేశారు. పాక్– తాలిబన్ బంధం గురించి ప్రతి దేశానికి తెలుసని, కానీ ఎవరూ నోరువిప్పడం లేదని వాపోయారు. కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి వారికి పాక్ సాయం చేస్తోందని దుయ్యబట్టారు. పాక్ సాయంతోనే తాలిబన్లు పంజ్‌షీర్‌పై దాడికి దిగారన్నారు. తాలిబన్లు మారలేదని, మరింత క్రూరంగా తయారయ్యారని విమర్శించారు. పంజ్ïÙర్ను ఆక్రమించుకున్నామన్న తాలిబన్ ప్రకటనను ఆయన సోమవారం కొట్టిపారేశారు. చివరి రక్తపు బొట్టు వరకు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. పాక్‌కు చెందిన ఒక జెట్‌ను తమ యోధులు కూలి్చవేశారని ఆయన ఒక ట్వీట్లో తెలిపారు. పాక్ పంపిన డ్రోన్లను పంజ్‌షేర్ దళాలపై దాడి చేయడానికి తాలిబన్లు వినియోగించారని, కమాండోలను పాక్ ఎయిర్‌డ్రాప్ చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాక్ సహా ఇతర దేశాల జోక్యాన్ని సహించం ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి పాకిస్తాన్‌తో సహా ఏ దేశాన్నీ అనుమతించబోమని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పష్టంచేశారు. సోమవారం జబీహుల్లా ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధినేత లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్.. తాలిబన్ అగ్రనేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌తో కాబూల్‌లో సమావేశమయ్యారనే విషయాన్ని ఈ సందర్భంగా జబీహుల్లా ధ్రువీకరించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా సాగే ఎలాంటి కార్యకలాపాలకైనా అఫ్గాన్ భూభాగాన్ని వాడుకోనివ్వబోమంటూ బరాదర్ ఈ భేటీ సందర్భంగా హామీద్‌కు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పాత్రపై మీడియా ప్రశ్నించగా.. అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్‌తో సహా ఏ ఇతర దేశమూ జోక్యం చేసుకోవడానికి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ దేశ వ్యవహారాల్లో ఇతరులు వేలు పెట్టొద్దని సూచించారు. తాలిబన్ ‘తెర’గతులు అఫ్గాన్‌లో యూనివర్సిటీ తరగతులు ప్రారంభమయ్యాయి. పలు ప్రైవేట్ కాలేజీలు తెరుచుకున్నాయి. అన్నిట్లో స్త్రీ, పురుష విద్యార్ధులను వేరు చేస్తూ అడ్డంగా కర్టెన్లు, తెరలను ఏర్పాటయ్యాయి. షరియా చట్టం ప్రకారం మహిళలకు చదువుకునే హక్కు ఉందని, అయితే మగ పిల్లలతో పాటు కలిసి చదివే వీల్లేదని తాలిబన్లు స్పష్టం చేశారు. దీంతో కాలేజీలన్నింటిలో తరగతి గదుల మధ్యలో తెరలు ప్రత్యక్షమయ్యాయి. అలాగే మహిళా విద్యార్థులకు కేవలం మహిళలు లేదా వృద్ధులైన మగవారు మాత్రమే బోధన చేయాలని తాలిబన్లు హుకుం జారీ చేశారు. అలాగే మహిళా విద్యార్ధులు తప్పనిసరిగా అబయా, నికాబ్(శరీరాన్ని పూర్తిగా కవర్ చేసే బురఖా) ధరించాలని, ఆడపిల్లలను క్లాసు అయిపోవడానికి ఐదు నిమిషాల ముందే బయటకు పంపాలని, అప్పుడే మగవిద్యార్ధులతో వారు కలవకుండా ఉంటారని తాలిబన్లు ఆర్డరేశారు. తరగతి గదుల్లో తెరలు వేలాడదీసిన ఫొటోలను అమాజ్ న్యూస్ ట్విట్టర్లో పోస్టు చేసింది. కాలేజీలో విద్యార్థినీ విద్యార్థుల సీట్ల మధ్య తెర ఏర్పాటుచేసిన దృశ్యం -
తాలిబన్ల ఆధీనంలోకి కాందహార్
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ఇటీవల అఫ్గాన్ భూభాగాలను మెరుపువేగంతో తన అధీనంలోకి తెచ్చుకుంటున్న తాలిబన్ సేనలు తాజాగా రెండో అతిపెద్ద నగరమైన కందహార్‌ను స్వాధీనం చేసుకున్నట్టు శుక్రవారం ప్రకటించాయి. ముజాహిదీన్ నగరంలోని అమరవీరుల స్క్వేర్‌కు చేరుకున్నామని తాలిబాన్ ప్రతినిధి ట్వీట్ చేసారు. అలాగే గవర్నర్ కార్యాలయం, ఇతర భవనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. దీంతో దక్షిణ నగరం వెలుపల సైనిక కేంద్రంనుంచి ప్రభుత్వ బలగాలను మూకుమ్మడిగా ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హింసను పక్కనబెడితే తాలిబన్లతో అధికారం పంచుకునేందుకు సిద్ధమని అఫ్గాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రతిపాదనపై తాలిబన్ల ప్రతిస్పందన కోసం వేచిచూస్తోంది. కాగా దీనిపై తాలిబన్లు అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అఫ్ఘానిస్థాన్ భూభాగాల నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయిన నాటి నుంచి తాలిబన్లు ఇప్పటికే కీలక భూభాగాలను ఆక్రమించారు. కాబూల్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడో అదిపెద్ద నగరమైన గజ్నీ పట్టణాన్ని గురువారం హస్తగతం చేసుకున్న తాలిబన్లు తాజాగా కందహార్ పట్టణాన్ని సైతం పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. గత వారంలో అప్గాన్‌లోని 34ప్రావిన్షియల్ రాజధానుల్లో సుమారు11 ప్రాంతాలు తాలిబన్లు వశం చేసుకున్నారు. ఇపుడిక ఈ జాబితాలో తాలిబన్ల బలమైన స్థావరం కాందహార్ 12 వ స్థానంలో నిలిచింది. #BreakingNews Ghazni Governor Mohammad Daud Laghmani was safely evacuated by Taliban & sent to Syedabad District, Wardak Province. Governor had agreed with Taliban that if they surrendered the city, they would be allowed to go to Kabul with the police chief. #Talibans #Afghan pic.twitter.com/pskQDaJWzY — PNews360.com (@pnews360) August 12, 2021 Taliban in the palace of the Nimroz governor & See Mal_E_Ganimat.#Taliban#Talibans#Afghanistan #Afganistan #NamakHaram Tribute to Mujahideen pic.twitter.com/o8f1GvBssy — چاچا افلاطون (@chflato) August 12, 2021 -
శ్రీలంక సేన వీరంగం.. 40 మంది జాలర్లు బందీ
సాక్షి, చెన్నై: కొన్ని నెలల అనంతరం శ్రీలంక సేన మళ్లీ సాగరంలో వీరంగం సృష్టించింది. రామేశ్వరంకారైక్కాల్, పుదుకోట్టైలకు చెందిన 40 మంది జాలర్లను బందీగా పట్టుకెళ్లారు. ఈ సమాచారం జాలర్ల గ్రామాల్లో ఆక్రోశాన్ని రగిల్చింది. తమిళ జాలర్లపై శ్రీలంక సేనలు సాగించే వీరంగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా కాలంలో ఈ దాడులు తగ్గాయి. శ్రీలంక చెరలో ఉన్న జాలర్లు మళ్లీ రాష్ట్రానికి చేరారు. అనేక పడవలు సైతం తిరిగి ఇక్కడకు చేరాయి. ఈ పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో శ్రీలంక సేనలు దాడులు చేసి నట్టు, ఓ పడవ మునగడంతో నలుగురు మరణించడం వెలుగు చూసింది. ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన నలుగురు జాలర్లు మరణించారు. అయితే శ్రీలంక సేనలు తుపాకీలు గురిపెట్టినట్టు, దాడులతో హతమార్చినట్టుగా ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణసాగుతోంది. బందీగా పట్టుకెళ్లారు.. అసెంబ్లీ ఎన్నికల వేళ సముద్ర తీరాల్లోని జాలర్ల గ్రామాలు అనేక సురుక్కు ముడి వల(అల్లికల)తో వేటకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎన్నికల బహిష్కరణ నినాదాన్ని అందుకున్నాయి. వీరిని బుజ్జగించేందుకు తీవ్రంగానే ఎన్నికల యంత్రాంగం ప్రయత్నాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంక సేన జాలర్లపై విరుచుకుపడ్డ సమాచారం. యావత్ తమిళ జాలర్లల్లో ఆగ్రహాన్ని రేపింది. బుధవారం అర్ధరాత్రి రామేశ్వరం నుంచి వెళ్లి కచ్చదీవుల్లో చేపల వేటలో ఉన్న జాలర్లపై రెండు బోట్లలో వచ్చిన శ్రీలంక నౌకాదళం వీరగం సృష్టించారు. జాలర్లు ఒడ్డుకు తిరుగు పయనం కాగా, రెండు పడవల్ని మాత్రం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ రెండు పడవల్లో ఉన్న 20 మందిని బందీలుగా శ్రీలంకకు పట్టుకు వెళ్లారు. అలాగే, కారైక్కాల్ నుంచి చేపల వేటకు వెళ్లిన మరో ఐదు పడవల్ని సరిహద్దులు దాటేశారన్న నెపంతో పట్టుకెళ్లారు. ఈ పడవల్లో మరో 20 మంది జాలర్లు ఉన్నారు. 40 మంది జాలర్లను ఒకే రోజు శ్రీలంక సేన పట్టుకెళ్లడంతో జాలర్ల సంఘాల్లో ఆగ్రహం రేగింది. ఎన్నికల వేళ జాలర్లపై శ్రీలంక సేన దాడి చేయడంతో అధికార అన్నాడీఎంకే, బీజేపీ అభ్యర్థులకు కలవరం తప్పడం లేదు. సముద్ర తీర నియోజకవర్గాల్లో పోటీలో ఈ పార్టీల అభ్యర్థులకు వ్యతిరేకంగా జాలర్ల గళం విప్పే పనిలో పడడం గమనార్హం. చదవండి: పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళ -
సెప్టిక్ ట్యాంక్ స్థలాన్నీ వదల్లే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో పలు లే అవుట్లలో పార్కులు, క్రీడా స్థలాలు తదితరాల కోసం వదిలిన ఖాళీస్థలాల్లో వాటిని ఏర్పాటు చేయకుండా యథేచ్ఛగా భవన నిర్మాణాలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో ఖాళీ స్థలాలంటూ లేకుండా నగరంలో లంగ్‌స్పేస్ కరువవుతోంది. జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం రెండు నెలల క్రితం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన అసెట్స్ ప్రొటెక్షన్ సెల్ (ఏపీసీ)కు అందుతున్న ఫిర్యాదులతో ఇలాంటి ఆక్రమణలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు పార్కుల కోసం వదిలిన స్థలాలు కబ్జాల పాలైన ఘటనలు వెలుగు చూడగా.. సెప్టిక్ ట్యాంక్ కోసం వదిలిన స్థలాన్ని కూడా ఆక్రమించి రెండు ఇళ్లు నిర్మించిన ఘటన బయటపడింది. ఏపీసికి అందిన ఫిర్యాదుతో సంబంధిత అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి క్షేత్రస్థాయి తనిఖీలు చేశారు. కూకట్పల్లి ఆల్విన్ కాలనీలోని హుడా లే అవుట్‌లోని సర్వే నంబర్ 336లో సెప్టిక్ ట్యాంక్ కోసం వదిలిన స్థలంలో రెండు ఇళ్లు నిర్మించినట్లు గుర్తించారు. 924 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన వీటికి సంబంధించి యాజమాన్య హక్కులు, ఇళ్ల నిర్మాణానికి పొందిన అనుమతి పత్రాలు చూపాల్సిందిగా కోరగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో సెప్టిక్ ట్యాంకుకు వదిలిన స్థలంలోని ఇళ్లను ఈ నెల 10న కూల్చివేసినట్లు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు సంబంధించి ఎవరైనా టోల్‌ఫ్రీ నంబర్ 1800–599–0099కు ఫోన్ చేయవచ్చని సూచించారు. -
వ్యవస్థలను ఆరెస్సెస్ చేజిక్కించుకుంటోంది
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి వ్యవస్థలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఓ పద్ధతి ప్రకారం చేజిక్కించుకుంటోందనీ, ఏకపక్ష విధానాలతో దేశాన్ని నడపలేరని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. విద్యావేత్తలతో రాహుల్ మాట్లాడుతూ ఒకేరకమైన సిద్ధాంతాన్ని తమపై రుద్దుతున్నారనే భావన ప్రజల్లో ఉందని అభిప్రాయపడ్డారు. ‘దేశాన్ని వ్యవస్థీకరిస్తామని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ తన గత ప్రసంగాల్లో పేర్కొన్నారు. వ్యవస్థీకరించడానికి ఆయనెవరు? దేశం తానంతట తానే వ్యవస్థీకృతమవుతుంది. ఇంకో 2 నెలల్లో వారి భ్రమలు తొలగిపోతాయి’ అని రాహుల్ అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యావేత్తలతో ఢిల్లీలో రాహుల్ మాట్లాడారు. -
వివరాలన్నీ ఒడిసిపట్టే సరికొత్త ట్రాకర్
గుండె కొట్టుకునే వేగం, వేసిన అడుగులు, ఖర్చయిన కేలరీల వివరాలు ఎప్పటికప్పుడు చూపగలిగే హెల్త్ ట్రాకర్స్ గురించి మీరు వినే ఉంటారు. ఫొటోలో కనిపిస్తోందే.. ఇదీ అలాంటిదే. కాకపోతే మన శరీరానికి సంబంధించిన కొన్ని వివరాలు మాత్రమే ఇవ్వడంతో ఆగిపోదు ఇది. రక్త కణాల సంఖ్యను కూడా లెక్కకట్టి చెప్పగల సూపర్ హెల్త్ ట్రాకర్ ఇది. తయారు చేసింది.. రట్గర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. బయో సెన్సర్ సాయంతో ఇది రక్త కణాల, బ్యాక్టీరియా సంఖ్యను లెక్కగట్టగలదని, అలాగే గాల్లోని కాలుష్య కణాలకూ లెక్కచెప్పగలదని అంటున్నారు మెహదీ జావాన్మర్ద్. ఇందుకు తగ్గట్టుగా ఈ గాడ్జెట్‌లో సూక్ష్మస్థాయి ద్రవాలను విశ్లేషించగల మైక్రోఫ్లుయిడిక్ సెన్సర్ ఒకటి ఉంటుందని, దీంతోపాటే ఉండే బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా మొత్తం వివరాలను స్మార్ట్‌ఫోన్ యాప్‌కు పంపవచ్చునని వివరించారు. భవిష్యత్తులో ఈ గాడ్జెట్‌ను మరింత అభివద్ధి పరచడం ద్వారా అన్ని రకాల వివరాలను ఎప్పటికప్పుడు పొందేలా చేస్తామని చెప్పారు. లుకేమియా వ్యాధిగ్రస్తుల్లో తెల్ల రక్త కణాల మోతాదును ఎప్పటికప్పుడు లెక్కించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. -
వామ్మ! హైద్రాబాద్!!
నానిగాడు ఫస్ట్‌టైమ్ హైద్రాబాద్ చూశాడు పోయిన్నెల. అమ్మ ఏదోవిధంగా రాకుండా చేస్తా అని మాటిచ్చింది. అయినా నా దగ్గర అంతకుముందు రోజు తీసుకున్న మాట ఉందిగా, తప్పలేదు. తీసుకొచ్చా. పదప్పుడు బయల్దేరాం ఇంటి నుంచి. నాకు భయంగానే ఉంది, వీడెక్కడ సతాయిస్తాడో అని. బస్ ఎక్కేముందు ‘ఓహో! ఇక్కడ టికెట్ తీస్కోవాల్నా?’ అన్నప్పుడు చాలా హుషారుగా సమాధానమిచ్చా. ఆ తర్వాత, ‘ఇదెంత మావయ్యా?’ అని వాటర్ బాటిల్ కొనేప్పుడు అడిగాడు. ఉత్సాహంగానే సమాధానం ఇచ్చా. ‘ఊరు దాటంగానే రోడ్డు పెద్దగయ్యింది. అదెట్ల?’ అన్నాడు. చెప్పా. ‘ఆహా.. ఇదేనేమో నువ్ చదివిన కాలేజ్ అయితే!’ అన్నప్పుడు అవునన్నా. ‘ఈడ్నే గదా చెర్వుగట్టు?’ అన్నప్పుడు, ‘అవును నీకెట్ల తెలుసురా?’ అనడిగా. ‘నాకన్ని తెల్సు’ అన్నాడు. కాస్త పొగరుగా ఎవ్వరేం మాట్లాడినా నాకు నచ్చదు. నేనందుకే సైలెంట్‌గా ఉండిపోయా. ‘ఇదేంటిదీ మావయ్యా?’ మళ్లీ వాడే కదిలించాడు. ‘అటు లోపలికి పోతే ఊరు. పైనించే పోతే హైద్రాబాద్’ అని చెప్పా. వాడికి అప్పటికి ఫ్లై ఓవర్ అనే పదాన్ని పరిచయం చేయలేదు నేను. ‘హిహి! మనమిప్పుడు హైద్రాబాద్‌కి పోతున్నం కాబట్టి పైనించే పోతం అంతెగా!?‘ కళ్లెగరేశాడు.‘అంతే అంతే!’బస్సలా వేగంగా పోతూనే ఉంది. వాడు ఏదోక ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు. నేను నాకు తెలిసినంతవరకూ సమాధానాలు చెబుతూనే ఉన్నా. నిజానికి మనకిన్ని విషయాలు తెలుసన్న విషయాన్ని పిల్లలే తెలియజెప్పాలి. టోల్ గేట్ వస్తే, ‘ఇదేంటిది మావయ్యా?’ అనడిగాడు. చెప్పా. ‘ఫ్రీగ రోడ్డు ఎయించుకుర్రుగా మావయ్యా!’ అని వాడు నవ్వుతూ ఉంటే నాకూ నవ్వొచ్చింది. రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చింది. ఎప్పుడైనా తీస్కపోతా అని చెప్పా. కాసేపు దాని గురించి ఆలోచించాడు. ఇంకేదో అనుకునే లోపే ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ‘వామ్మ.. ఇట్ల ఉందేంది మావయ్యా ఇదీ!’ ఆ కొద్దిసేపు బస్సంతా అన్ని దిక్కులా చూస్తూ, ఔటర్ రింగ్ రోడ్‌ను అన్నివిధాలా క్యాప్చర్ చేసుకున్నాడు. ఆ దారంతా వినాయకుడి బొమ్మలు కనిపిస్తే, ‘ఇక్కణ్ణించే వస్తయా గణేశ్ బొమ్మలన్నీ?’ అడిగాడు. అవునన్నా. ‘మన చౌరస్తల బొమ్మలు గూడ?’ ‘అవును’‘మరి మనం గుడ ఈనించే కొన్కపోవచ్చుగ!?’‘ఈసారదే చేద్దాం!’‘హ్మ్..’ ఆలోచిస్తూన్నాడు ఏదో.ఎల్బీనగర్ వచ్చింది. మెట్రో పిల్లర్లను, ఫ్లై ఓవర్ వేను చాలాసేపు అలా కళ్లప్పగించి చూస్తూ కూర్చున్నాడు. ‘అదేంది మావయ్యా?’ అనడిగాడు. ‘మెట్రో రైల్రా! దాని మీనించే రైలు పోతది!’ ‘అవునా! తీస్కపోవచ్చుగ నన్ను!!’‘మనం పోయే దిక్కు పోవవి’‘ఉత్తగనే పోతం కద కొంచం దూరం’‘ఈ దార్ల ఇంక రెడీ కాలె! అయినంక పోదాం’‘ఏమొద్దులే!’ అలిగాడు. ‘సరే! వచ్చేటప్పుడు టైముంటే పోదం!’ముద్దిచ్చాడు. కాసేపింక ఏం మాట్లాడకుండా పెద్ద పెద్ద బిల్డింగ్లు, మెట్రో రైల్ పిల్లర్లు చూస్తూన్నాడు.సడెన్‌గా నావైపు తిరిగి, ‘నేను ఇన్నిన్ని కొత్త కొత్త ప్రపంచాలు చూస్తానుకోలే! ఇదేంది మావయ్యా ఇట్లుంది హైద్రాబాద్!! వామ్మ!!!’ అన్నాడు.నవ్వొచ్చింది. కొత్త కొత్త ప్రపంచాలు అనే మాట వాడు ఎక్కడ అందుకున్నాడో అడగాలనిపించింది. వాణ్ణి డిస్టర్బ్ చేయాలనిపించలేదు అలాగే! ఫ్లై ఓవర్ అనే పదం తెల్సుకున్నాడు నేను చెప్తే. దాని మీంచి బస్సులు పోవని నాతో వాదించాడు. ఒక బస్సు ఫ్లై ఓవర్ ఎక్కుతుంటే చూసి, ఓడిపోయినట్టు నవ్వాడు. ట్రాఫిక్ జామ్ అంటే అర్థమైంది. సిగ్నల్స్ తెల్సుకున్నాడు. బస్సు టైప్స్, రేట్లు అడిగాడు. నిమ్మకాయ్ శర్బత్ ఒకటి తాగాం. పాత ఆఫీస్‌కి వచ్చి అక్కడి ఫ్రెండ్స్‌తో మాట్లాడాడు. పనయ్యాక పంజాగుట్ట మెరిడీయన్లో బిర్యాని తిన్నాం. ‘మస్త్ తిరిగినం మావయ్యా! ఇంటికి పోదాం’ అన్నాడు. ‘హహహ! ఇంక చాలా పన్లున్నయిరా’ అన్నా. ‘అంత సీన్ లేదు. నాకు తెల్సులే! ఇంక పోదం మావయ్యా!’ ‘సరే! పోదాం!!’ నవ్వి కౌగిలించుకున్నాడు. మళ్లీ దిల్సుఖ్నగర్ బయల్దేరాం. సాయంత్రం నాలుగైంది. వాడికి అలసటొచ్చి పడుకున్నాడు. దిగేప్పుడు లేపితే మళ్లీ లేచి, ‘పండుకున్ననా?’ అన్నాడు. ఊరికి పోయే బస్సెక్కే ముందు వాటర్ బాటిల్, కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అవీ తీసుకొని ఎక్కాం. ‘ఇప్పుడు పండుకో ఇగ! ఎట్లుంది హైద్రాబాద్?’ అడిగా.‘అబ్బ! మస్తుంది మావయ్య!’ అన్నాడు. ‘నిద్రొస్తలేదులే!’ పడుకో అని మరోసారంటే ఈ మాటన్నాడు. వచ్చేప్పుడు వాడికి అనుభవంలోకి వచ్చిన ప్రతిదీ చెప్పుకొచ్చాడు. బస్‌లో మా పక్కన కూర్చున్న అమ్మాయి (చాలా అందంగా ఉంది!) వీడి మాటలన్నీ వింటూ నవ్వింది. వీడింక ఏం మాట్లాడలేదు ఓ గంట పాటు. ఇంటికి చేరేసరికి పడుకున్నాడు. నిద్ర లేపి అన్నం తినిపించింది అమ్మ. ‘మమ్మీ అసలు ఏం హైద్రాబాదే మమ్మీ!!’ అంటూ అమ్మకు కథలు చెప్పడం మొదలుపెట్టాడు. పాపం వాడికి ఒక ఆర్డర్ తెలీదుగా, ఒకటి చెప్పి, అర్రె ఇది చెప్పలేదు అని ఇంకోటి చెప్పి, అదిగాదు మమ్మీ ఇది అని వేరొకటి చెప్పి అది ఇదీ అని ఏది గుర్తొస్తే అది చెప్పి గోల చేశాడు.‘మమ్మీ నీకొకటి తెల్సా! అక్కడ గూడ మనుషులు సిగరెట్లు తాగుతరే!!‘ అని నవ్వుతూ చెప్పాడు. ‘అక్కడ గుడ సిగరెట్లు తాగుతర మావయ్యా! అడగడం మర్చిపోయిన!’ మేము సమాధానం చెప్పకపోయేసరికి వాడే మళ్లీ అడిగాడు. ‘మనుషులు ఎక్కడ్నైనా ఒక్కటే!’ చెప్పా. అమ్మ నవ్వింది. వాడు నవ్వాడు. నేనూ నవ్వాను. వాడడిగిన ప్రశ్నకి ఈసారి కూడా నవ్వుంటే వేరే ప్రశ్నడిగేవాడేమో! నేనప్పుడు ఈ అబద్ధం చెప్పే అవసరం రాకుండేదేమో! – అజు, హైదరాబాద్ -
కొండచిలువ పట్టివేత
కోయిల్‌కొండ (నారాయణపేట): మండలం లోని కోత్లాబాద్ గ్రామ సమీపంలోని కొయ్యగుండుగుట్టలో రైతులు అడివి జంతువుల కోసం వేసిన వలలో కొండచిలువ చిక్కింది. శుక్రవారం విషయం తెలుసుకున్న రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు సంజీవరావు, రాములునాయక్, శ్రీనివాస్ కొండచిలువను వల నుంచి వేరు చేసి పట్టుకున్నారు. కొండచిలువు సుమారు 8 అడుగుల పొడవు 10 కిలోల బరువు ఉందని అధికారులు తెలిపారు. కొండ చిలువును మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రికి తరలించి చికిత్స నిర్వహిస్తామన్నారు. రైతులు అడవి జంతువుల బారినుంచి తమ పంటలను కాపాడుకొనేందుకు వలలు వేస్తుంటారన్నారు. ఈ నేపథ్యంలోనే వేసిన వలకు కొండచిలువ చిక్కిందన్నారు. -
200 సబ్సిడీ గొర్రెల పట్టివేత
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని అమనగల్ గ్రామం మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న 200 సబ్సిడీ గొర్రెలను పట్టుకుని రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించామని రూరల్ ఎస్సై పత్తిపాక జితేందర్ బుధవారం రాత్రి తెలిపారు. సబ్సిడీ గొర్రెలను కొనుగోలు చేసిన పలువురు అక్రమంగా పలు పట్టణాలకు తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీ సులు తనిఖీలు చేశారు. కాగా 200 గొర్రెలను పట్టుకున్నామని నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్సై వివరించారు. గొర్రెల చెవులకు ఉన్న ట్యాగులను తొలగించి తరలిస్తున్నారని, చెవుల నుంచి రక్తం కారడం కనిపించిందని తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామ ని ఎస్సై జితేందర్ అన్నారు. -
‘జువెలరీ’ దొంగలు అరెస్ట్
ద్విచక్ర వాహనాలు, బంగారు, వెండి నగలు స్వాధీనం దొడ్డబళ్లాపురం : 11 ప్రత్యేక కేసులకు సంబంధించి నెలమంగల పట్టణ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.29 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతోపాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి బెంగళూరు గ్రామీణ ఎస్పీ అమిత్ సింగ్, నెలమంగల డీవైఎస్పీ రాజేంద్రకుమార్ సోమవారం పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జువెలరీ షాపుకు కన్నం వేసిన కేసులో సుశాంత్, సిద్ధరాజు, జగదీష్, అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మూడు నెలల క్రితం కేఆర్ పురం పోలీస్‌స్టేషన్ పరిధిలో శ్రీ బాలాజీ జువెలర్స్ అండ్ బ్యాంకర్స్ దుకాణానికి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ద్వారా 14 మీటర్ల దూరం వరకూ సొరంగం తవ్వి 200 గ్రాముల బంగారు నగలు, 14 కేజీల వెండి ఆభరణాలు చోరీ చేశారు. నెలమంగల పరిధిలో వీరిని పట్టుకున్న పోలీసులు వారి నుండి చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో సునిల్‌కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ఒక కారు, 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బెంగళూరు, బెంగళూరు గ్రామీణ పరిధిలో కార్లు, బైక్‌లు చోరీ చేసేవాడని పోలీసులు తెలిపారు. -
లీజు భూముల ఆక్రమణ
► రూ.500 కోట్ల విలువైన స్థలాలు కబ్జా ► 17 అసెస్మెంట్లు చేసిన కమిషనర్ ► మున్సిపల్ వైస్ చైర్మన్ , కౌన్సిలర్ల ఫిర్యాదుతో వెలుగులోకి.. ► సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఆగ్రహం ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ మున్సిపాల్టీ లీజు భూములు కబ్జాకు గురయ్యాయి. వందల కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. బల్దియా వైస్ చైర్మన్ , కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ –వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కలెక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ స్టాండింగ్ అడ్వకేట్ హన్మంత్‌రావు, జేసీ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ అలివేలు మంగతాయారు, ఆదిలాబాద్ ఎమ్మార్వో, అసిస్టెంట్ ల్యాండ్ రికార్డు సర్వేయర్లతో ఇటీవల ప్రత్యేకంగా మూడు గంటలకు పైగా సమీక్ష సమావేశం నిర్వహించి.. లీజు భూముల ఆక్రమణపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారులతో కమిటీ వేసి తాను ప్రత్యక్షంగా దృష్టి సారిస్తానని పేర్కొన్నట్లు తెలిసింది. 45 నుంచి 25కు చేరిన లీజు భూములు ఆదిలాబాద్ మున్సిపాల్టీలో గతంలో 45 లీజు భూములు ఉండేవి. రాను రాను ప్రస్తుతం 24 భూములు మాత్రమే మిగిలాయి. ఇందులో ప్రధానంగా రూ.500 కోట్ల విలువైన భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో కోట్ల విలువైన మున్సిపల్ లీజు భూములు సిమెంట్ పైపు ఇండస్ట్రీస్ పేరుతో అర్పన్ లాల్ సూరికి 1968లో 15 ఏళ్లపాటు మున్సిపల్ అధికారులు లీజుకు ఇచ్చారు. లీజు గడువు ముగియడంతో అర్పన్ Sలాల్ సూరి మళ్లీ 1984లో లీజు గడువు పొడగింపునకు దరాఖాస్తు చేశారు. ఆ గడువు 1989 వరకు పొడగిస్తూ మున్సిపల్ కౌన్సిల్ నంబరు 62తో తీర్మానించింది. 1989 నుంచి 2016 వరకు లీజు డబ్బులు రూ.8,44,553 అర్పన్ Sలాల్ సూరి బకాయి పడ్డాడు. బకాయి చెల్లించాలని కమిషనర్ అలివేలు మంగతాయారు 17 నవంబర్ 2016న అండర్ సెక్షన్ 194 ఆఫ్ ఏపీఎం యాక్టు 1965 ప్రకారం నోటీసులు అందజేశారు. లీజు కట్టని పక్షంలో మున్సిపల్ ఆధీనంలోకి తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో అర్పన్ లాల్ సూరి భూమి, అక్కడి స్థలం తమదేనని లీజు చెల్లించనని, ఇది మున్సిపల్ స్థలం కాదని తిరిగి బదులు ఇచ్చారు. లీజు భూములకు 17 అసెస్మెంట్లు చేసిన కమిషనర్ అర్పన్ లాల్ సూరి లీజు ల్యాండ్ మున్సిపాలిటీదే అయినప్పటికీ 2006లో అప్పటి రెవెన్యూ అధికారులు, కుమ్మక్కై వారు కుటుంబ సభ్యుల పేరిట ఐదు పట్టాలు అందించారు. ఒక్కో పట్టాకు రూ.96 వేలు తీసుకుని, రెగ్యులరైజేషన్ ఆఫ్ ఇంక్రోచ్మెంట్ కింద పట్టాలు ఇచ్చారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ వాటికి నోఆబ్జక్షన్ కాపీని అందించడం గమనార్హం. జీవో నంబర్ 508 ప్రకారం చిన్న ఇల్లు ఉన్నవారికి మాత్రమే ఇటువంటి జీవో వర్తిస్తుంది. కమర్షియల్ బిల్డింగ్‌లకు ఇది వర్తించదు. నిబంధనల ప్రకారం 480 గజాలు ఉన్న భూములకు సైతం ఈ జీవో వర్తించదు. దీంతోపాటు సర్వే నంబర్ 1 ప్రాంతం చెరువు ప్రాంతంగా గుర్తించారు. చెరువు ఉన్న ప్రాంతంలో పట్టాలను నిబంధనలకు విరుద్ధంగా అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అర్పన్ లాల్ సూరికి ప్రస్తుత కమిషనర్ నోటీసులు అందించిన తర్వాత 16 ఫిబ్రవరి 2017లో అర్పన్ లాల్ సూరి సబ్ లీజర్ల పేరిట 17 మందికి అసెస్మెంట్లు చేయడం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్ కల్పించుకోని పక్షంలో వందల కోట్ల లీజు ల్యాండ్లు కబ్జాదారుల చేతిలోకి వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినోదానికి ఇస్తే కమర్షియల్ చేశారు... మున్సిపల్ పరిధిలోని లీజు ల్యాండ్ 2002లో గణేశ్ థియేటర్ వినోదం కోసం దండ మహేశ్ పేరుపై లీజుకు ఇచ్చారు. దీని గడువు 2007లో ముగిసింది. తిరిగి 2007లో 17ఏళ్లపాటు పొడగించారు. ప్రస్తుతం 2017 మేలో లీజు గడువు ముగియనుంది. ఈ లీజుల్యాండ్ థియేటర్ నిర్వహణ కోసం వినోదం కోసం అప్పటి కలెక్టర్ సుకుమార్ అప్పగించారు. థియేటర్ నిర్వాహకులు దాని ముందర కమర్షియల్‌గా 29 దుకాణాలు నిర్మించి.. ఒక్కో దుకాణదారు నుంచి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు తీసుకుంటూ, అడ్వాన్స్ గా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు తీసుకుంటున్నారు. సంవత్సరానికి రూ.కోటిపైగా ఆర్జిస్తూ మున్సిపాలిటీకి మాత్రం రూ.7.80 లక్షలు చెల్లిస్తున్నారు. ఫలితంగా ఏడాదికి రూ.కోటిపైగా మున్సిపాలిటీ నష్టపోతోంది. ఏళ్లుగా సాగుతున్న ఈ తంతు రానున్న మేలో గడువు ముగియనుంది. అధికారులు దృష్టి సారించి లీజు గడువును పొడగించకుండా మున్సిపాలిటీ ఆదాయాన్ని పరిరక్షించాలి్సందిగా ప్రజలు కోరుతున్నారు. మరింత ఆక్రమణలు.. మున్సిపాలిటీలో అప్రూవల్ లే ఔట్లు, బహిరంగ స్థలాలు, పార్కింగ్ స్థలాలు కబ్జాకు గురవుతున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని స్పిన్నింగ్ మిల్లు సమీపంలో యాక్షన్ ప్లాటు నం.1, నం.2లో మున్సిపల్ ఇచ్చిన విస్తీర్ణం కంటే అదనంగా ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే తరహాలో పట్టణ నడిబొడ్డున వేల కోట్ల విలువ చేసే ద్వారకానగర్‌లోని రఘునాథ్ మిట్టల్ కేరాఫ్ జీఎన్ రావు పెట్రోల్ బంక్ ప్రాంతంలో మున్సిపాలిటీ రోడ్డు స్థలం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ స్థలంలో జిల్లాకు చెందిన బడానేత హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. -
ఇద్దరు దొంగల అరెస్టు ఆభరణాలు స్వాధీనం
హైదరాబాద్: మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్థులను పోలీసులు గురువారం ఉదయం అరెస్టుచేశారు. వారి నుంచి 115 గ్రాముల బంగారు, 540 గ్రాముల వెండి, ఒక ద్విచక్రవాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కుమార్, రమేష్ అనే వ్యక్తులు తరుచుగా చోరీలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. -
అంతర్రాష్ట్ర గుట్కా డాన్ అరెస్ట్
కడప అర్బన్ : అంతర్రాష్ట్ర గుట్కా డాన్‌గా పేరొందిన పువ్వాడి చంద్రశేఖర్‌ను జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో పులివెందుల పట్టణం పూలంగళ్ల సమీపంలో శుక్రవారం అరెస్టు చేశారు. రాయలసీమ వ్యాప్తంగా ఇతనే నిర్వాహకుడిగా ఉంటూ అక్రమంగా వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగించాడు. ఇతనితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి దాదాపు రూ. 12.35 లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పోలీసు పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ వివరాలను తెలియజేశారు. గతేడాది డిసెంబర్ 3న పులివెందులకు చెందిన మలికిరెడ్డి గంగాధర్‌రెడ్డిని అరెస్టు చేసి, అతని వద్ద గుట్కా మిషన్లు, గుట్కా ముడి పదార్థాలతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. విచారణలో అతడు వెల్లడించిన వివరాల ఆధారంగా అనంతపురానికి చెందిన పొలమడు సత్యనారాయణ, బాలస్వామినంద గుప్తాలను ఈ నెల 9న అరెస్టు చేశామన్నారు. వీరి ఆధారంగా అంతర్ రాష్ట్ర గుట్కా డాన్‌గా పేరొందిన పువ్వాడి చంద్రశేఖర్ ఈ అక్రమ వ్యాపారంలో రాష్ట్ర వ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిర్ధారించామని పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కడప సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరర్‌రెడ్డి, పులివెందుల పోలీసులు సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారని చెప్పారు. ఇందులో పులివెందుల పూల అంగళ్ల సమీపంలో వినాయకుడి గుడి వెనుకాల గుట్కా, ఖైనీ వ్యాపారం, వాటిని తయారు చేసే పువ్వాడి చంద్రశేఖర్‌ను, ఇద్దరు అనుచరులు మెయిన్ బజారు వీధికి చెందిన కొప్పవరపు వెంకటరమణ, మద్దిరాల ప్రవీణ్‌కుమార్‌ను అరెస్టు చేశామన్నారు. వీరు తమ విచారణలో కడప నగరం బీకేఎం వీధి, రాయచోటి, ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను సీజ్ చేశామన్నారు. వీటి విలువ సుమారు రూ. 12.35 లక్షలు ఉంటుందన్నారు. అలాగే గుట్కా ప్యాకెట్లను తయారు, ప్యాకింగ్ చేసే మిషన్లను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ ప్రసాద్‌రెడ్డి, ఎస్ఐలు రాజగోపాల్, హేమకుమార్, రవికుమార్, స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బందిని అభినందిస్తున్నామని వివరించారు. -
దొంగ అరెస్టు
పులివెందుల : పులివెందుల పట్టణంలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 10తులాల బంగార అభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎస్డీపీవో కార్యాలయంలో ఎస్ఐలు గోపినాథరెడ్డి, రవిలతో కలిసి ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన ఎద్దుల రామకృష్ణ దొంగతనాలు చేసేవాడన్నారు. అతనిపై పులివెందులలో 8 దొంగతనాల కేసులు నమోదయ్యాయన్నారు. నిందితుడిని సోమవారం రాత్రి ఉల్లిమెల్ల రింగ్ రోడ్డు వద్ద అరెస్టు చేసి అతని నుంచి 10తులాల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే పులివెందుల అర్బన్, రూరల్ ప్రాంతాలలో 7చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాహనాలను తనిఖీ చేసిన తర్వాతనే పట్టణంలోనికి అనుమతిస్తామన్నారు. ఆలయాల్లో దొంగతనాలు జరుగుతున్న దృష్ట్యా ఆలయాలకు చెందిన ట్రస్ట్ నిర్వాహకులు విలువైన నగదు, బంగారు వస్తువులను ఆలయాల్లో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన సీఐ ప్రసాద్, ఎస్ఐలు గోపినాథరెడ్డి, రవి, కానిస్టేబుల్ వేణుగోపాల్‌రెడ్డిలకు రివార్డు కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామన్నారు. -
యువతిపై గ్యాంగ్ షాకింగ్ అటాక్..!
-
రాజంపేట ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ దాడులు
రాజంపేట: రాజంపేట ఎంవీఐ కార్యాలయంపై కడప ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేశారు. ఈ దాడిలో నలుగురు ఏజెంట్ల దగ్గర నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ నాగరాజు విలేకర్లతో మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు రాజంపేట ఎంవీఐ కార్యాలయంపై దాడులు చేశామన్నారు. కార్యాలయం వద్ద ఉన్న నలుగురు ఏజెంట్లను పట్టుకున్నామని తెలిపారు. వారి దగ్గర నుంచి రూ.32వేల డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లైసెన్సు, రెన్యూవల్స్, ఎల్ఎల్ఆర్ తదితర వాటి కోసం వచ్చేవారు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఏజెంట్ల ద్వారా రవాణాశాఖకు సంబంధించి ఎటువంటి పనులు చేయరాదనే నిబంధన ఉందన్నారు. ఆ నిబంధనలు ఉల్లఘించిన ఏజెంట్లు డబ్బులు అక్రమంగా రాబడుతున్నారని తెలిపారు. దీనిపై పూర్తిస్ధాయిలో విచారణ చేస్తామన్నారు. అధికారులు ఎవరైన డబ్బులు ఇస్తేనే తమ పనులు చేసి పెడతామని చెపితే అలాంటి వివరాలను తమకు అందచేస్తే తమ స్థాయిలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సమాచారం ఉంటే 9440446191 నెంబరుకు సంప్రందించాలన్నారు. కాగా ఎసీబీ అధికారుల బృందం సాయంత్రం వరకు ఎంవీఐ కార్యాలయంలో మకాం వేశారు. -
త్రీడీ టెక్నాలజీతో అద్భుతాలు
-
వధశాలకు తరలిస్తున్న దూడలను పట్టివేత
ఘట్కేసర్: వధశాలకు అక్రమంగా తరలిస్తున్న దూడలను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... మండల పరిధిలోని అవుశాపూర్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రెండు డీసీఎంలను ఆపారు. ఇదేంటని ప్రశ్నించగా ఆ వాహనాల్లో 15 దూడలను నగరంలోని అంబర్పేట్ వధశాలకు తరలిస్తున్నట్లు దాని డ్రైవర్లు బానోతు కుమార్, బానోతు మోహన్ తెలిపారు. డ్రైవర్లు నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం గోపతండాకు చెందిన వారని చెప్పారు. వరంగల్ జిల్లా లింగాల ఘణాపూర్ మండలం నవాబుపేట్ గ్రామంలోని సంత నుంచి 15 దూడలను వ్యాపారులు కొనుగోలు చేశారు. వాటిని వాహనాల్లో నగరానికి తరలించడానికి డ్రైవర్లతో బేరం కుదుర్చుకున్నారని వివరించారు. దూడలను, వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దూడలను గోశాలకు పంపినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
225 బస్తాల బియ్యం పట్టివేత
రాయదుర్గం అర్బన్: కణేకల్లులోని ఒక గోదాము నుంచి కర్ణాటకలోని తళుకు వద్దనున్న రైస్‌మిల్లుకు లారీ( కేఏ09 ఏ 9515)లో అక్రమంగా తరలిస్తున్న 225 బస్తాల బియ్యాన్ని శనివారం ఉదయం రాయదుర్గం చెక్‌పోస్టు సమీపంలో రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్ రమేష్, మరో వ్యక్తి మంజు పరారు కాగా.. ప్రహ్లాద ప్రదీప్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తహసీల్దార్ అఫ్జల్ఖాన్ తెలిపారు. 225 బస్తాల బియ్యంతోపాటు కొన్ని గోధుమ ప్యాకెట్లు కూడా లభించినట్లు తెలిపారు. లారీని తహసీల్దార్ కార్యాలయానికి తరలించామన్నారు. బియ్యం బస్తాలను స్టాక్‌పాయింట్‌లో తూకం వేయించి సీఎస్‌డీటీ రామకృష్ణకు అప్పగించామన్నారు. ఈ బియ్యం చౌక బియ్యమా కాదా అని నిర్ధారణ చేసేందు జాయింట్ కలెక్టర్‌కు శ్యాంపిల్ పంపుతున్నట్లు వెల్లడించారు. ఎటువంటి వే బిల్లులు లేకుండా తరలిస్తున్నందున 6–ఏ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనిఖీ చేయకుండానే రుసుం వసూలు రాయదుర్గం – మొలకాల్మూర్ రోడ్డులో ఉన్న వ్యవసాయ మార్కెట్‌యార్డు చెక్‌పోస్టులో సూపర్వైజర్ కిశోర్‌కుమార్ ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండా లారీ డ్రైవర్ మొక్కజొన్న అని చెప్పగానే పది టన్నుల బరువు లెక్కగట్టి రూ.1.50 లక్షలు అంచనా వేసి రూ. 1500 మార్కెట్‌రుసుం వసూలు చేశారు. చెక్‌పోస్టులో తనిఖీ చేసి ఉంటే అక్కడే దొరికిపోయేది. అధికార పార్టీ అండదండలతోనే.. అధికార పార్టీ అండదండలతోనే బియ్యాన్ని కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని కర్నాటకకు తరలించకుండా చెక్‌పోస్టులో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని లోక్‌సత్తా జిల్లా అధ్యక్షులు బి.బాబు డిమాండ్ చేశారు. బియ్యం తరలించే ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి ఎన్ నాగరాజు కోరారు. -
పార్కులో అడవిపంది పట్టివేత
హైదరాబాద్: ఎక్కడి నుంచి వచ్చిందో వనస్థలిపురంలోని జనావాసాల్లోకి శుక్రవారం ఓ అడవిపంది ప్రవేశించి అందరినీ హడలెత్తించింది. స్థానిక ఎల్ఐజీ పార్కులో సంచరిస్తున్న అడవిపందిని గమనించిన స్థానికులు దానిని పట్టుకోవటానికి ప్రయత్నించారు. దీంతో అది బెదిరిపోయి నలుగురిని గాయపరిచింది. చివరికి వారు వలలు వేసి పట్టుకుని బంధించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించటంతో వారు వచ్చిన పందిని స్వాధీనం చేసుకున్నారు. -
భారీగా రంగురాళ్ల పట్టివేత
వైరా: ఖమ్మం జిల్లాలో భారీగా రంగురాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన 18 బస్తాల రంగురాళ్లను శనివారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైరాలోని నవత రోడ్ ట్రాన్స్పోర్ట్కు కొణిజర్లకు చెందిన ఓ వ్యక్తి 18 బస్తాల రంగురాళ్లను తీసుకొచ్చాడు. మళ్లీ వచ్చి బుక్ చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు. ట్రాన్స్పోర్ట్ గోదాములో రంగురాళ్లు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు గోదాములో తనిఖీలు చేపట్టి 18 బస్తాల రంగురాళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
200 కిలోల గంజాయి స్వాధీనం
ముగ్గురి అరెస్ట్ నర్సీపట్నం: ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 200 కిలోల గంజాయిని పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం చింతపల్లి రూట్లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పట్టణ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. చింతపల్లి వైపు నుంచి వస్తున్న కారును ఆపి తనిఖీ చే యగా వంద కిలోల గంజాయి బయటపడింది. గంజాయిని తరలిస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన రాపర్తి సతీష్ , బి.రాజశేఖర్ , హుక్కుంపేట మం డలానికి చెందిన బి.నాగేశ్వరరావును అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, కారును సీజ్ చేసినట్టు ఆయన చెప్పారు. గం జాయి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందన్నారు. ఈ తనిఖీల్లో ఎస్ఐలు అప్పలనాయుడు, మోహన్‌రావు, సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. వంద కిలోల గంజాయి పట్టివేత చింతపల్లి వైపు నుంచి మోటార్‌బైక్‌పై గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నర్సీపట్నం మీదుగా తుని వెళ్తుండగా ఏఎస్పీ కార్యాలయం సిబ్బంది వెంబడించి లార్డు సమీపంలో వారిని పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఆదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి మోటార్‌బైక్, రెండు బ్యాగ్‌లలో ఉన్న వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఏఎస్పీ కార్యాలయానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. -
'ఆ పైలట్ ను బంధించాం'
డమాస్కస్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు సిరియా యుద్ధ విమానాన్ని కూల్చి, పైలట్ ను బంధించారు. పైలట్ తమ వద్ద బందీగా ఉన్నట్టు ఐఎస్ ప్రకటించింది. శుక్రవారం డమాస్కస్ లో యుద్ధ విమానం ఎగురుతున్న సమయంలో ఉగ్రవాదులు దానిని కూల్చి వేశారు. పైలట్ ఆజామ్ ఇద్ ను ఉగ్రవాదులు బంధించారని సిరియా మానవ హక్కుల సంస్థ ధ్రువీకరించింది. గత కొద్ది రోజులుగా సిరియాలో ఉగ్రవాదులు యుద్ధ విమానాలను కూల్చివేస్తున్నారు. -
800 కిలోల గంజాయి పట్టివేత
మాడుగుల: విశాఖపట్నం జిల్లా మాడుగుల ఘాట్ రోడ్డులో 800 కిలోల గంజాయిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి గంజాయి తరలిస్తున్న వ్యానును పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మాడుగుల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
కడప సెంట్రల్ జైలులో సెల్‌ఫోన్ కలకలం
-
ప్రభుత్వాసుపత్రి స్థలంపై.. ‘పచ్చ’గద్దలు!
ఎక్కడైనా కాస్త ఖాళీ జాగా కనిపిస్తే చాలు..శవాన్ని పీక్కుని తినే రాబందుల్లా.. ‘పచ్చ’గద్దలు వాలిపోతున్నాయి. ప్రజాప్రయోజనాలను ఆశించి జిల్లాలోని పలుచోట్ల దాతలు ఇచ్చిన స్థలాలకు.. వాటి పుణ్యమా అని రక్షణ కరువవుతోంది. కంచే చేను మేసిన చందంగా రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే.. అధికార బలంతో వాటిని తన్నుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు. చట్టంలో లొసుగులను ఆసరా చేసుకొనో.. లేదంటే తమకు అనుగుణంగా నిబంధనలు మార్పించుకునో.. కన్నేసిన స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ/తుని :పిఠాపురం పట్టణంలో క్రిస్టియన్ ఆసుపత్రి స్థలం కబ్జా యత్నాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చి వారం రోజులు తిరగకముందే.. మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. పేదలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలనే మహోన్నత ఆశయంతో ఎప్పుడో వందేళ్ల కిందట తుని సంస్థానానికి చెందిన రాణి సుభద్రయమ్మ.. తుని పట్టణం నడిబొడ్డున రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సమీపంలోని పోస్టాఫీసు వీధిలో సుమారు ఎకరా స్థలం దానంగా ఇచ్చారు. అక్కడ ఆసుపత్రి నిర్మించారు. తుని నియోజకవర్గంలో తొలి ప్రభుత్వాసుపత్రి ఇదే. రోజుకు సగటున 400 నుంచి 500 మంది వరకూ ఇక్కడ వైద్య సేవలు పొందేవారు. కొన్నేళ్ల క్రితం సూరవరం రోడ్డులో ఘోషాసుపత్రి ఏర్పాటు చేయడంతో.. పోస్టాఫీసు వీధిలోని ఈ ఆసుపత్రిని పురుషులకోసం ప్రత్యేకంగా కేటాయించారు. 15 ఏళ్ల క్రితం ఘోషాస్పత్రిని ఏరియా ఆస్పత్రిగా మార్చడంతో ఈ పురుషుల ఆస్పత్రిని తాత్కాలికంగా మూసేశారు. కబ్జాదారుల కన్ను ప్రస్తుతం తుని పట్టణంలోని పాతపోస్టాఫీసు వీధిలో చదరపు గజం స్థలం విలువ రూ.60 వేల వరకూ ఉంది. అనధికార లెక్కల ప్రకారం చూసినా ఈ ఆసుపత్రి స్థలం విలువ కనిష్టంగా రూ.18 కోట్ల పైమాటే. అంత విలువైనది కాబట్టే దీనిని ఆక్రమించుకోవడానికి ఒకటిన్నర దశాబ్దాల క్రితమే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికి బీజం వేసింది కూడా టీడీపీ నాయకులే. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కీలక నేత ఒకరు ఈ స్థలాన్ని ఆక్రమించుకుని, సొంత వ్యాపార అవసరాల నిర్వహణకు వాడుకున్నారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థానిక ముఖ్య నేత ఒకరు ఆసుపత్రి స్థలాన్ని ఆక్రమించారు. అక్కడి నుంచే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించారు. ఆసుపత్రి సముదాయంలోని మూడు పెంకుటిళ్లను పాతసంచుల మరమ్మతులకు వినియోగించేవారు. అసలు ఆసుపత్రి స్థలంలో ఎటువంటి అనుమతులూ లేకుండానే షాపు నిర్మించి, దానిని ఓ వ్యాపారికి అద్దెకు ఇచ్చారు. దీనికి నెలకు రూ.30 వేల చొప్పున పదేళ్ల పాటు అద్దె వసూలు చేసుకున్నారు. బలవంతంగా ఖాళీ చేయించి.. ఈ వ్యవహారాన్ని పదేళ్లపాటు చూస్తూ ఏమీ చేయలేక కూర్చున్న స్థానిక టీడీపీ నేత.. ఏడాదిన్నర క్రితం టీడీపీ అధికారంలోకి రాగానే రెచ్చిపోయారు. దందాల్లో ఆరితేరిన ఆయనకు కాంగ్రెస్ నేతను ఖాళీ చేయించడం పెద్ద కష్టం కాలేదు. యథాప్రకారం పోలీసుల సహకారంతో పని పూర్తి చేయించారు. గతానుభవాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో మరే ఇబ్బందీ తలెత్తకుండా ఆ స్థలాన్ని సొంతం చేసుకోవడానికి ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు. రెవెన్యూ రికార్డులు తిరగరాసేందుకు.. పట్టాదారు పాసు పుస్తకంలో చిన్న తప్పు దొర్లితే చాలు.. దానిని సరిదిద్దడానికి సామాన్య రైతులను రెవెన్యూ అధికారులు నిబంధనల పేరుతో రోజుల తరబడి తిప్పుతారు. అటువంటివారిలో కొందరు అధికార పార్టీ నేతలకు మాత్రం దాసులైపోతున్నారు. ‘లేదంటే దూరప్రాంతానికి బదిలీ చేయించేస్తా’ అని హుంకరిస్తున్న ఆ టీడీపీ నాయకుడి బెదిరింపులకు భయపడి.. చెప్పిందానికల్లా తలాడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి గ్రామకంఠం స్థలాలను లీజు విధానంలో పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకోవడానికి టీడీపీ నాయకుడు పావులు కదుపుతున్నారు. ఆసుపత్రి స్థలాన్ని రెవెన్యూ రికార్డుల్లో గ్రామకంఠం భూమిగా చూపించేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తద్వారా దానిని 33 ఏళ్లపాటు లీజు రూపంలో కైంకర్యం చేయడానికి రెవెన్యూ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. ప్రజావసరాలకే వినియోగించాలి.. ప్రజాప్రయోజనాలకోసం తుని సంస్థానాధీశులు ఆ స్థలాన్ని ఆసుపత్రికి కేటాయించారు. ఆ స్థలాన్ని ఎప్పటికైనా ప్రజాప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించాలి. వాణిజ్య అవసరాలకు వినియోగించడానికి వీల్లేదని నాటి రాణిగారి వీలునామాలో ఉన్నట్లు తెలిసింది. ఏదేమైనా ఆసుపత్రి స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తే మేం ఆందోళనకు దిగుతాం. - దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే, తుని -
భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కొత్తూరుపేట గ్రామ సమీపంలో భారీగా మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాదీనం చేసుకున్న వాటిలో 2000 జిలెటిన్ స్టిక్స్, 1300 డిటోనెటర్స్ తో పాటు ఫ్యూజ్ వైర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మింగలేక.. కక్కలేక..
-
నాలుగు కేజీల గంజాయి పట్టివేత
డెంకాడ: విజయనగరం జిల్లా డెంకాడ మండలం ఐనాడ జంక్షన్ వద్ద నాలుగున్నర కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా నుంచి ఒడిశా వైపు వెళుతున్న ఓ కారును సోమవారం రాత్రి పోలీసులు ఆపి తనిఖీ చేయగా గంజాయి అక్రమ రవాణా వెలుగు చూసింది. ఒడిశాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. -
100 కిలోల గంజాయి పట్టివేత
హైదరాబాద్: భారీఎత్తున గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఈ సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సైదాబాద్ ఆలయ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వాహనంలో భారీ స్థాయిలో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న నాంపల్లి ఎక్సైజ్ పోలీసులు.. రంగంలోకి దిగి 100 కిలోల గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారీలోఉన్నట్లు సమాచారం. -
370 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
వరంగల్(ఖిల్లా వరంగల్): వరంగల్ నగరంలోని శివ నగర్లో అక్రమంగా నిల్వ ఉంచిన 370 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, పోలీస్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గణపురం రమేష్ అనే వ్యక్తి ఈ బియ్యాన్ని నిల్వచేసినట్లు డిప్యూటి తహసీల్దార్ రత్నవీర తెలిపారు. బియ్యాన్ని సీజ్ చేసి, యజమానిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
విశాఖలో 200 కిలోల గంజాయి పట్టివేత
విశాఖపట్టణం: అక్రమంగా తరలిస్తున్న 200 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్టణం జిల్లా పాడేరు మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. వివరాలు.. పాడేరుకు చెందిన డి.వెంకటకొండారావు అనకాపల్లికి తన కారులో అక్రమంగా 200 కిలోల గంజాయిని తరలిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసి అతడిని పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కారును సీజ్ చేశారు. కాగా, ఈ గంజాయి విలువ సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
40కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం: అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముఠాలోని నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్ష నగదు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
దారితప్పుతున్న రేషన్ బియ్యం
కర్నూలు: బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్న నాలుగు బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన డీలర్ రంగస్వామి రెండు క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా ఆటోలో తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడిన రేషన్ డీలర్‌నుంచి అదనపు సమాచారాన్ని సేకరిస్తున్నారు. -
ఆయుధాలతో పట్టుబడిన చైనా నౌక
తమిళనాడులో ఇటీవల కాలంలో తీవ్రవాదుల కదలికలు అధికమయ్యూరుు. కరుడుగట్టిన తీవ్రవాదులు వారం క్రితం పట్టుబడ్డారు. ఈ ఘటన మరువక ముందే ఆయుధాలతో చైనా నౌక పట్టుబడడం కలకలం రేపింది. దీనిపై విచారణ జరిపేందుకు అధికారులు రంగంలోకి దిగారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:కసబ్ తదితర ఉగ్రవాదులు ముంబయిలో దాడులకు పాల్పడేందుకు సీమెన్‌గార్డు అనే చైనా నౌక ద్వారా నగరంలోకి ప్రవేశించినట్లు అప్పట్లో విచారణలో తేలింది. దీంతో చైనా నౌకల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత్‌లోని హార్బర్లకు కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యూరుు. సీమెన్‌గార్డు చైనా నౌక మూడు నెలల క్రితం భారత్ చేరుకుంది. దీనిని దేశ సరిహద్దుల్లోనే అధికారులు తనిఖీ చేయగా అప్పట్లో అనుమానాస్పద వస్తువులు లభించలేదు. అయినా చైనా నౌకలను హార్బర్ అధికారులు అనుమానిస్తూనే ఉన్నారు. మూడు నెలల క్రితం తనిఖీకి గురైన ఇదే చైనా నౌక శుక్రవారం అర్ధరాత్రి సమయంలో తూత్తుకూడి హార్బర్‌ను సమీపించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో నౌకను సముద్రంలోనే నిలిపేయూలంటూ తూత్తుకూడి అధికారులకు సమాచారం అందింది. అప్రమత్తమైన అధికారులు ‘నాయకిదేవీ’ అనే యుద్ధనౌకలో వేగంగా ఎదురెళ్లి సీమెన్గార్డులో తనిఖీలు ప్రారంభించారు. అనేక ఆయుధాలు నౌకలో దాచి ఉంచడాన్ని అధికారు లు గుర్తించారు. కేంద్రం ఆదేశాల మేరకు తూత్తుకూడి హార్బర్‌కు 10 మైళ్ల దూరంలో నౌకను నిలిపేశారు. నౌక చుట్టూ గస్తీ నౌకలు, మరబోట్లు ఉంచారు. అమెరికా నుంచి రాక! చైనాలో రిజిస్టరైన ఈ నౌక ప్రస్తుతం అమెరికా నుంచి తూత్తుకూడి చేరుకున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. సముద్రపు దొంగల బారి నుంచి కాపాడుకునేందుకే ఆయుధాలు సమకూర్చుకున్నట్లు చైనా నౌకలోని సిబ్బంది సమర్థించుకున్నారు. ప్రపంచంలోని అన్ని హార్బర్లకూ తిరిగే విధంగా పర్మిట్లు పొందామని వివరించారు. అరుుతే చైనా నౌక వ్యవహారం రాష్ట్రం లో కలకలం రేపింది. చెన్నై తదితర జిల్లాల్లో విధ్వం సాలకు పాల్పడేందుకు చైనా నుంచి ఉగ్రవాదులు మరోసారి ప్రవేశించే ప్రయత్నం చేశారా అని అధికారులు అనుమానిస్తున్నారు. ముంబయి దాడుల నేపథ్యంలో ఏ అంశాన్నీ సులభంగా తీసుకోరాదని భావి స్తున్నారు. క్షుణ్ణంగా విచారణ జరిపి ఒక నిర్ధారణకు రానిదే సీమెన్‌గార్డు నౌకను విడిచిపెట్టరాదని కేంద్రహోంశాఖ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేం ద్రం ఆదేశించే వరకు సీమెన్‌గార్డు చుట్టూ బందోబస్తు కొనసాగిస్తామని తూత్తుకూడి హార్బర్ అధికారులు స్పష్టం చేశారు.