ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 200 కిలోల గంజాయిని పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురి అరెస్ట్
నర్సీపట్నం: ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 200 కిలోల గంజాయిని పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం చింతపల్లి రూట్‌లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పట్టణ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. చింతపల్లి వైపు నుంచి వస్తున్న కారును ఆపి తనిఖీ చే యగా వంద కిలోల గంజాయి బయటపడింది. గంజాయిని తరలిస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన రాపర్తి సతీష్ , బి.రాజశేఖర్ , హుక్కుంపేట మం డలానికి చెందిన బి.నాగేశ్వరరావును అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
గంజాయిని స్వాధీనం చేసుకుని, కారును సీజ్ చేసినట్టు ఆయన చెప్పారు. గం జాయి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందన్నారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఐలు అప్పలనాయుడు, మోహన్‌రావు, సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.
వంద కిలోల గంజాయి పట్టివేత
చింతపల్లి వైపు నుంచి మోటార్‌బైక్‌పై గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నర్సీపట్నం మీదుగా తుని వెళ్తుండగా ఏఎస్పీ కార్యాలయం సిబ్బంది వెంబడించి లార్డు సమీపంలో వారిని పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఆదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి మోటార్‌బైక్, రెండు బ్యాగ్‌లలో ఉన్న వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఏఎస్పీ కార్యాలయానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.