
గుండె కొట్టుకునే వేగం, వేసిన అడుగులు, ఖర్చయిన కేలరీల వివరాలు ఎప్పటికప్పుడు చూపగలిగే హెల్త్ ట్రాకర్స్ గురించి మీరు వినే ఉంటారు. ఫొటోలో కనిపిస్తోందే.. ఇదీ అలాంటిదే. కాకపోతే మన శరీరానికి సంబంధించిన కొన్ని వివరాలు మాత్రమే ఇవ్వడంతో ఆగిపోదు ఇది. రక్త కణాల సంఖ్యను కూడా లెక్కకట్టి చెప్పగల సూపర్ హెల్త్ ట్రాకర్ ఇది. తయారు చేసింది.. రట్గర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. బయో సెన్సర్ సాయంతో ఇది రక్త కణాల, బ్యాక్టీరియా సంఖ్యను లెక్కగట్టగలదని, అలాగే గాల్లోని కాలుష్య కణాలకూ లెక్కచెప్పగలదని అంటున్నారు మెహదీ జావాన్‌మర్ద్.
ఇందుకు తగ్గట్టుగా ఈ గాడ్జెట్‌లో సూక్ష్మస్థాయి ద్రవాలను విశ్లేషించగల మైక్రోఫ్లుయిడిక్ సెన్సర్ ఒకటి ఉంటుందని, దీంతోపాటే ఉండే బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా మొత్తం వివరాలను స్మార్ట్‌ఫోన్ యాప్‌కు పంపవచ్చునని వివరించారు. భవిష్యత్తులో ఈ గాడ్జెట్‌ను మరింత అభివద్ధి పరచడం ద్వారా అన్ని రకాల వివరాలను ఎప్పటికప్పుడు పొందేలా చేస్తామని చెప్పారు. లుకేమియా వ్యాధిగ్రస్తుల్లో తెల్ల రక్త కణాల మోతాదును ఎప్పటికప్పుడు లెక్కించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment