
పోలీసులు పట్టుకున్న సబ్సిడీ గొర్రెలు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని అమనగల్ గ్రామం మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న 200 సబ్సిడీ గొర్రెలను పట్టుకుని రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించామని రూరల్ ఎస్సై పత్తిపాక జితేందర్ బుధవారం రాత్రి తెలిపారు.
సబ్సిడీ గొర్రెలను కొనుగోలు చేసిన పలువురు అక్రమంగా పలు పట్టణాలకు తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీ సులు తనిఖీలు చేశారు. కాగా 200 గొర్రెలను పట్టుకున్నామని నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్సై వివరించారు. గొర్రెల చెవులకు ఉన్న ట్యాగులను తొలగించి తరలిస్తున్నారని, చెవుల నుంచి రక్తం కారడం కనిపించిందని తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామ ని ఎస్సై జితేందర్ అన్నారు.