విశాఖలో 200 కిలోల గంజాయి పట్టివేత | 200 kilograms ganjai captured | Sakshi
Sakshi News home page

విశాఖలో 200 కిలోల గంజాయి పట్టివేత

Published Sun, Apr 12 2015 11:39 AM | Last Updated on Sun, Sep 3 2017 12:13 AM

200 kilograms ganjai captured

విశాఖపట్టణం: అక్రమంగా తరలిస్తున్న 200 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్టణం జిల్లా పాడేరు మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. వివరాలు.. పాడేరుకు చెందిన డి.వెంకటకొండారావు అనకాపల్లికి  తన కారులో అక్రమంగా 200 కిలోల గంజాయిని తరలిస్తున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసి అతడిని పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కారును సీజ్ చేశారు. కాగా, ఈ గంజాయి విలువ సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement