ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ వింత ఉదంతం చోటుచేసుకుంది. హైకోర్టును ఆశ్రయించిన ఓ వ్యక్తి తమ 22 ఒంటెలను పోలీసుల నుంచి తిరిగి ఇప్పించాలని అభ్యర్థించాడు. దీనిపై స్పందించిన కోర్టు.. లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నుండి సమాధానం కోరింది. ఈ కేసు రాబోయే మార్చి లో విచారణకు రానుంది.
ఈ కేసు 2019 నుంచి నడుస్తోంది. ఆ ఏడాది ఆగస్టు లో ఈద్ సందర్భంగా ఒంటెలను బలి ఇవ్వడాన్ని పోలీసు యంత్రాంగం నిషేధించింది. ఈ నేపధ్యంలో మీరట్‌లోని మహ్మద్ అనాస్‌కు చెందిన 22 ఒంటెలను లిసాడి గేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంతకాలమైనా ఆ ఒంటెలను పోలీసులు తిరిగి ఇవ్వకపోవడంతో అనాస్ 2022లో హైకోర్టును ఆశ్రయించాడు. తన ఒంటెలను తిరిగి ఇప్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం 2023, జనవరి 12న ఒంటెలను అతనికి తిరిగి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందని, అయితే పోలీసులు కోర్టు ఆదేశాలను పాటించలేదని అనాస్ తరపు న్యాయవాది షామ్స్-ఉ-జమాన్ మీడియాకు తెలిపాడు. ఇప్పుడు ఈ ఉదంతంపై తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు మార్చి 18న కోర్టులో విచారణకు రానుంది. ఈ విషయమై సిటీ మేజిస్ట్రేట్ మాట్లాడుతూ అనాస్‌కు చెందిన 22 ఒంటెలను పోలీసులు తిరిగి అతని ఇవ్వని విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అందుకే లిసాడి గేట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నుంచి దీనికి తక్షణం సమాధానం కోరామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment