camel
-
ఊహకే అందని రైడ్..ఐతే అక్కడ మాత్రమే..!
ఈ రోజుల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోతున్నాం. క్షణాల్లో మనకు నచ్చిన ప్రదేశానికి చేరిపోతున్నాం. జేబు నిండా డబ్బులు ఉంటే చాలు పని ఈజీ. ఇంతవరకు కారు, బైక్ రైడ్లు చూసుంటారు. కానీ ఈ మహిళ బుక్ చేసిన రైడ్ లాంటిది దొరకడం మాత్రం కష్టం. ఔను ఇది కొంచెం కష్టం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు మహిళలు ఎడారిలో చిక్కుకుపోయి ఉంటారు. వారి వాహనం పాడవ్వడంతో ఉబర్ యాప్‌తో రైడ్ బుక్ చేద్దామని భావిస్తారు. అందులోని ఆప్షన్స్‌లో ఊహకందని రైడ్ కనిపించే సరికి షాకవ్వుతారు. సరే ఒంటె రైడ్ బుక్ చేద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అని భావిస్తారు. ఇంతలో ఉబర్ ఒంటె రైడ్ రావడం జరుగుతుంది. అది చూసి ఒక మహిళ ఆశ్చర్యపోతూ..ఇది ఉబెర్ ఒంటె రైడేనా అని అడుగుతుంది. దానికి ఆ వ్యక్తి తనను ఉబెర్ ఒంటె డ్రైవర్‌గా పరిచయం చేసుకోవడంతో నోట నుంచి మాట రాదు. సదరు వ్యక్తి తాము ఉబెర్ ఒంటెను నడుపుతున్నామని, ఇలా ఎడారిలో దారితప్పిన వ్యక్తులకు సహయం చేయడమే తమ డ్యూటీ అని చెప్పారు. తాము దారి తప్పడంతో ఒంటెని ఆర్డర్ చేసినట్లు తెలిపింది సదరు మహిళ. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి దుబాయ్‌లో మాత్రమే ఇలా ఒంటెని ఆర్డర్ చేయగలరు, ఇదేమి పెద్ద విషయం కాదని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by JETSET DUBAI (@jetset.dubai) (చదవండి: మరమరాల చాట్ అమ్ముతూ బ్రిటిష్ వ్యక్తి..!) -
ఒంటెనే చోరీ చేశారు
కురబలకోట : ఇన్నాళ్లు పర్సులు కొట్టేసే దొంగలను చూశాం.. ఇంట్లో చొరబడి బంగారో..నగదో చోరీ చేసిన వాళ్లనూ చూశాం.. కానీ ఏకంగా పెద్ద జంతువులలో ఒకటైన ఒంటెనే ఎత్తుకెళ్లే ఘనులుంటారని ఇప్పుడే చూస్తున్నాం. అవును.. అన్నమయ్య జిల్లా కురబల కోట మండలం అంగళ్లులో ఒంటెను ఎత్తుకెళ్లిన ఘటన వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు..త్వరలో జరగబోయే బక్రీద్‌కు అంగళ్లుకు చెందిన మిత్రులు కొందరు 13 రోజుల క్రితం రూ.1.25 లక్షలతో ఒంటెను కొన్నారు. పరిసర ప్రాంతాల్లో మేపుతూ రాత్రి వేళ ఇంటి వద్ద కట్టేసేవారు. ఆదివారం వేకువ జామున లేచి చూస్తే ఒంటె కాస్తా కన్పించలేదు. తాడు తెంపుకుని బయటకు వెళ్లిందోమోనని తొలుత భావించారు. స్థానికంగా వెతికినా కన్పించలేదు. ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకే కాకుండా రాత్రి పొద్దుపోయే వరకు కూడా స్నేహితులు కలసి అంతటా గాలించారు. పరిసర ప్రాంతాలు జల్లెడ పట్టినంత పనిచేశారు. సమీపంలోని గుట్టలు, వాగులు, వంకలతో పాటు పరివాహక ప్రాంతాల్లో కూడా వెతికారు. ఎక్కడా ఆచూకీ కన్పించలేదు. గుర్తు తెలియని వారు ఎవరైనా తోలుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. ఒంటె జాడ మాత్రం కన్పించలేదు. అంగళ్లు సమీపంలోని కనసానివారిపల్లె నుంచి మదనపల్లెకు కొత్తగా వేస్తున్న బైపాస్ మీదుగా ఒంటెను తోలుకెళ్లిన ఆనవాళ్లు, అడుగులు కన్పించినట్లు చెబుతున్నారు. సాధారణంగా ఏనుగులు, ఒంటెలు లాంటి భారీ సైజు వాటిని చోరీ చేయడం ఆషామాషీ కాదు. కష్టంతో పాటు సాహసంతో కూడుకున్న పని. ఇలాంటి పెద్ద ఒంటెనే అంగళ్లులో ఏకంగా చోరీ చేశారంటే వారెంత ఘనులో అర్థం చేసుకోవచ్చు. ఆచూకీ తెలిస్తే 8978126623 మొబైల్ నెంబరుకు సమాచారం ఇస్తే తగిన పారితోషికం ఇస్తామని బాధితులు తెలిపారు. -
‘ఒంటెలను ఇవ్వండి’.. పోలీసులకు జడ్జి ఆదేశం!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ వింత ఉదంతం చోటుచేసుకుంది. హైకోర్టును ఆశ్రయించిన ఓ వ్యక్తి తమ 22 ఒంటెలను పోలీసుల నుంచి తిరిగి ఇప్పించాలని అభ్యర్థించాడు. దీనిపై స్పందించిన కోర్టు.. లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నుండి సమాధానం కోరింది. ఈ కేసు రాబోయే మార్చి లో విచారణకు రానుంది. ఈ కేసు 2019 నుంచి నడుస్తోంది. ఆ ఏడాది ఆగస్టు లో ఈద్ సందర్భంగా ఒంటెలను బలి ఇవ్వడాన్ని పోలీసు యంత్రాంగం నిషేధించింది. ఈ నేపధ్యంలో మీరట్‌లోని మహ్మద్ అనాస్‌కు చెందిన 22 ఒంటెలను లిసాడి గేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంతకాలమైనా ఆ ఒంటెలను పోలీసులు తిరిగి ఇవ్వకపోవడంతో అనాస్ 2022లో హైకోర్టును ఆశ్రయించాడు. తన ఒంటెలను తిరిగి ఇప్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 2023, జనవరి 12న ఒంటెలను అతనికి తిరిగి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందని, అయితే పోలీసులు కోర్టు ఆదేశాలను పాటించలేదని అనాస్ తరపు న్యాయవాది షామ్స్-ఉ-జమాన్ మీడియాకు తెలిపాడు. ఇప్పుడు ఈ ఉదంతంపై తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు మార్చి 18న కోర్టులో విచారణకు రానుంది. ఈ విషయమై సిటీ మేజిస్ట్రేట్ మాట్లాడుతూ అనాస్‌కు చెందిన 22 ఒంటెలను పోలీసులు తిరిగి అతని ఇవ్వని విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అందుకే లిసాడి గేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ నుంచి దీనికి తక్షణం సమాధానం కోరామన్నారు. -
అందం హిందోళం.. అధరం తాంబూలం
అందంలో మనకు ఐశ్వర్యరాయ్ ఎలాగో.. ఒంటెల్లో ఇదలాగన్న మాట.. ఖతర్‌లో అటు ప్రపంచ ఫుట్‌బాల్ కప్ పోటీలు జరుగుతున్న సమయంలోనే ఇటు ఈ ఒంటెల అందానికి సంబంధించిన ప్రపంచ కప్ పోటీలూ జరిగాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందమైన ఆడ ఒంటెలు ఈ పోటీల్లో తమ హొయలను ప్రదర్శించాయి. ఈ చిత్రంలోని ఒంటె.. మొదటి స్థానాన్ని గెలుచుకుని.. రూ.44 లక్షల బహుమతిని గెలుచుకుంది. ఇందులో గెలవడం అంత ఈజీ కాదు.. ముందుగా ఈ ఒంటెలకు వైద్యుల పర్యవేక్షణలో ఎక్స్‌రేలు వంటివి తీస్తారు. ఎందుకంటే.. అందాన్ని ఇనుమడింపజేయడానికి ఏమైనా ప్లాస్టిక్ సర్జరీలు, బొటాక్స్ ఇంజెక్షన్లు వంటివి వాటికి ఇచ్చారా అన్నది తెలుసుకోవడానికట. సహజ సౌందర్యరాశికే పట్టం కట్టాలన్నది తమ లక్ష్యమని నిర్వాహకులు చెప్పారు. గత పోటీల్లో వైద్య పరీక్షల్లో పట్టుబడిన 47 ఒంటెలపై అనర్హత వేటు వేశారట. పోటీల్లో భాగంగా.. వాటి చెవులు, ముక్కు.. పెదాలు ఇలా అన్నిటినీ నిశితంగా పరీక్షించి.. జడ్జీలు మార్కులేస్తారు. Spectators watch a camel beauty contest in Ash-Shahaniyah, Qatar 📸 @reuterspictures pic.twitter.com/0wQ3WCyQBm — Reuters (@Reuters) November 30, 2022 -
అందంగా లేమా.. అసలేం బాలేమా!
హొయలుపోతూ వయ్యారపు నడక... అదిరేటి అధరాలు.. పొడవాటి మెడ.. నిగనిగలాడే మేని ఛాయ... అందానికి తగ్గ శరీర సౌష్టవం... ఇంకేం, న్యాయ నిర్ణేతలు ముగ్ధులయ్యారు. అంతటి సౌందర్యరాశిని ఈ ఏటి అందాల పోటీ విజేతగా ప్రకటించేశారు. ప్రైజ్‌మనీ కింద భారీ మొత్తం సైతం ముట్టజెప్పారు. ఇంతకీ ఆ కుందనపు బొమ్మ ఎవరో తెలుసా.. ఒక ఒంటె! అవాక్కయ్యారా.. పైన చెప్పిన ఆ వర్ణన అంతా దాని అందం గురించే..! ఈ పోటీ ప్రత్యేకతలు, విజేతగా ఆ ఒంటె ఎంపిక వెనక సాగిన తతంగం ఏమిటో తెలుసుకుందామా? ఎక్స్‌రేలతో తనిఖీలు... ఖతార్‌లోని అల్ షహనియా నగరంలో ఇటీవల జరిగిన ఒంటెల అందాల పోటీలో మంగియ గుఫ్రాన్ అనే ఒంటె విజేతగా నిలిచింది. సౌదీ అరేబియా, కువైట్, యూఏఈల నుంచి వచ్చిన వేలాది ఒంటెలతో పోటీపడుతూ వివిధ వడపోతలను దాటుకొని మరీ ట్రోఫీ సాధించింది. అయితే ఈ విజయం దానికి ఊరికే ఏమీ దక్కలేదు. ఇందుకోసం అది ఎన్నో పరీక్షలను ఎదుర్కొంది. ముఖ్యంగా ఎక్స్‌రేల ద్వారా వెటర్నరీ వైద్యులు ఒంటె శరీరాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కృత్రిమంగా అందాన్ని మెరుగుపరిచే బ్యూటీ సర్జరీలు ఏమైనా చేశారా అనే విషయాన్ని తేల్చేందుకు ఈ పరీక్ష చేపట్టారు. ఎందుకంటే... సౌదీ అరేబియాలో ఇటీవల నిర్వహించిన అందాల పోటీలో తమ ఒంటెలు అందంగా కనపడేందుకు కొందరు యజమానులు వాటికి బొటాక్స్ ఇంజెక్షన్లు ఇవ్వడంతోపాటు కాస్మెటిక్ సర్జరీలు సైతం చేయించారు. ఆ పోటీలో వారి ఒంటెలు గెలిస్తే అప్పనంగా భారీ నజరానా కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. అయితే ఈ విషయం చివరి నిమిషంలో బయటపడటంతో 43 ఒంటెలను అక్కడి నిర్వాహకులు పోటీల నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఖతార్‌లో ఒంటెల అందాల పోటీ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారన్నమాట. ఈ పరీక్షలో మంగియ గుఫ్రాన్ సులువుగానే గట్టెక్కింది. ఇక ఆ తర్వాత... ఒంటెల అందానికి కొలమానాలుగా పరిగణనలోకి తీసుకొనే తల సైజు, మెడ పొడవు, వీపుపై మూపురం ఉండాల్సిన ప్రదేశం, పెదవుల అందం వంటి కొలతల లెక్కల్లోనూ పాసైంది. భారీ నజరానా... మంగియ గుఫ్రాన్ న్యాయ నిర్ణేతలను మెప్పించడంతో నిర్వాహకులు దాన్ని ఈ అందాల పోటీ విజేతగా ప్రకటించారు. ఒంటె యజమాని ఫాహెద్ ఫర్జ్ అల్గుఫ్రానీకి 10 లక్షల ఖతారీ రియాళ్ల (సుమారు రూ. 2.10 కోట్లు) చెక్కును అందించారు. దేశ సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నమైన ఒంటెలపట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ఫుట్‌బాల్, ఫార్ములా వన్ వంటి క్రేజ్ ఉన్న టోర్నమెంట్లకు దీటుగా ప్రజామద్దతు కూడగట్టేందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ పోటీలను తిలకించేందుకు జనం భారీగా తరలిరావడంతో తమ ఉద్దేశం నెరవేరిందని చెప్పారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
పాలు తక్కువ ఇస్తోందని ఇంటిముందే నరికి పూడ్చి
జైపూర్: మూఢనమ్మకంతో ఒంటెను దారుణంగా హత్య చేశాడో ఓ వ్యక్తి. ఒంటెను చంపేసి తన ఇంటి ముందే గుంతలో పూడ్చిపెట్టాడు. కొన్నాళ్లకు పూడ్చిపెట్టిన ఒంటె తల బయటకు రావడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది. అయితే అతడి చంపింది రాష్ట్ర జంతువుగా ఉన్న ఉంటెను కావడంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒంటెను హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: ప్రాణం తీసిన అంబులెన్స్: నిండు గర్భిణి సహా..) సూరజ్‌పోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోవర్ధన్ విలాస్ ప్రాంతంలో రాజేశ్ అహిర్ డెయిరీ నిర్వహిస్తున్నాడు. అతడికి 24కు పైగా ఆవులు ఉన్నాయి. అయితే డెయిరీలోని ఆక ఆవు అనారోగ్యం పాలైంది. పాలు తక్కువగా ఇస్తుండడంతో ఆవేదన చెందాడు. ఈ విషయాన్ని అతడికి తెలిసిన వ్యక్తి చేతన్‌ను ఆశ్రయించాడు. చేతన్ తన తండ్రి శోభాలాల్‌కు పరిచయం చేశాడు. శోభాలాల్ మూఢనమ్మకాలు వదిలిస్తానని మంత్రతంత్రాలు చేస్తుంటాడు. ఒంటె తల నరికి ఇంటి వెలుపల పాతిపెడితే సమస్య పరిష్కారమవుతుందని శోభాలాల్ రాజేశ్ అహీర్‌కు చెప్పాడు. మంత్రగాడు చెప్పినట్టు రాజేశ్ ఒంటెను తీసుకువచ్చి తన స్నేహితుల సహాయంతో ఒంటె మెడను నరికి చంపేశాడు. అనంతరం ఒంటె మొండాన్ని ఇంటి ముందు పాతిపెట్టాడు. కొన్ని రోజులకు ఒంటె మొండెం పోలీసులకు చిక్కింది. విచారణ చేపట్టగా ఓ వ్యక్తి రాజేశ్ పేరు చెప్పాడు. అనంతరం పోలీసులు రాజేశ్‌ను విచారించగా నేరం అంగీకరించాడు. అక్కడ ఒంటెను చంపిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దీంతో రాజేశ్‌తో పాటు అతడి స్నేహితుడు చేతన్, అతడి తండ్రి శోభాలాల్‌తో పాటు అతడి స్నేహితుడు మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. మూఢ నమ్మకాలతో ఒంటెను రాజేశ్ హత్య చేశాడని సూరజ్‌పోల్ పోలీస్ అధికారి డాక్టర్ హనుమంత్ సింగ్‌రాజ్ పురోహిత్ తెలిపారు. రాష్ట్ర జంతువుగా ఉన్న ఒంటెను హతమార్చడంతో ఈ కేసును తీవ్రంగా పరిగణించినట్లు చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఘటన ఒక్కసారిగా ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. చదవండి: రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. వైరల్ -
Reindeer: దుప్పి పాలు రుచి చూస్తారా!
పాలు అంటే మనకు సాధారణంగా గుర్తుకు వచ్చేది అవులు, గేదెలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో మేకపాలు, గొర్రె పాలు కూడా తాగుతారన్న విషయం మనకు తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో పాల కోసం దుప్పి (రైన్డీర్)ని పెంచుతారన్న విషయం మీకు తెలుసా? స్కాండినేవియా ప్రాంతంలో ఈ రైన్డీర్ పాలు వినియోగిస్తారు. అతి తక్కువ పరిమాణంలో లభించే ఈ పాలను పోషకాల ఘనిగా చెప్పవచ్చు. ఈ పాలలో 20 శాతం కొవ్వు 10 శాతం ప్రొటీన్లు ఉంటాయి. అయితే ఒక్కో రైన్డీర్ రోజుకి ఒకటి నుంచి రెండు కప్పుల పాలు మాత్రమే ఇస్తుంది. భౌగోళిక, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏఏ జంతువుల పాలు వినియోగిస్తారో చూద్దాం.. ఒంటె (సోమాలియా, కెన్యా) ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే పాడి జంతువు ఒంటె. ఇవి సుమారు వారం రోజుల పాటు నీరు తాగకుండా జీవించగలవు. సోమాలియా, కెన్యాలు ప్రపంచంలో అత్యధికంగా ఒంటె పాలను ఉత్పత్తి చేస్తున్న దేశాలు. ఒంటెలు రోజుకు 5 నుండి 20 లీటర్ల పాలు ఇస్తాయి. ఆవు పాలతో పోల్చితే ఒంటె పాలు చిక్కగానూ, రుచిలో కాస్త ఉప్పగానూ ఉంటాయి. గేదె (ఇండియా, పాకిస్తాన్) ఇండియా, పాకిస్తాన్లలో పాల ఉత్పత్తికి ప్రధాన ఆధారం పాడి గేదెలు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పరిమాణంలో 80 శాతానికిపైగా గేదె పాలు ఈ రెండు దేశాల్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. గేదెలు ఆవుల కన్నా ఎక్కువ పాల దిగుబడిని ఇస్తాయి. భారత్‌లో గుజరాత్‌లోని సూరత్ చుట్టు పక్కల ప్రాంతాల్లో గేదె పాలతో తయారుచేసే ‘సూర్తి పనీర్’ అనే మృదువైన జున్ను (చీజ్)కు విశేషమైన గుర్తింపుఉంది. సాహివాల్ (ఇండియా, పాకిస్తాన్) ఇండియా, పాకిస్తాన్లలో ప్రధానంగా కనిపించే మరో పాడి ఆవు సాహివాల్. ఇది పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం సాహివాల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో వృద్ధి చెందిన దేశవాళీ ఆవు. మన దేశంలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దేశీ జాతి ఆవులు కనిపిస్తాయి. వీటిలో రోజుకు 10 నుంచి 15 లీటర్ల పాల దిగుబడి సామర్థ్యం ఉంది. పాలలో వెన్న 5 నుంచి 10 శాతం వరకు ఉంటుంది. గుర్రం (మంగోలియా) గుర్రాలను ఎందుకు వినియోగిస్తారో అందరికీ తెలుసు. కానీ గుర్రం పాల గురించి చాలా మందికి తెలీదు. మంగోలియాలో గుర్రాలను వ్యవసాయంతోపాటు పాల ఉత్పత్తికి వాడుతున్నారు. ఇక్కడ గుర్రపు పాలను 24 నుంచి 48 గంటలపాటు పులియబెట్టి, చిలకడం ద్వారా కౌమిస్ (లేదా ఐరాగ్) అనే పానీయాన్ని తయారు చేస్తారు. పుల్లగా ఉండే ఈ పానీయంలో 2 శాతం ఆల్కహాల్ ఉండటం విశేషం. యాక్ (జడల బర్రె) / (టిబెట్) యాక్ (జడల బర్రె) హిమాలయ ప్రాంతానికి చెందిన పాడి జంతువు. వీటి నుండి పాలతోపాటు ఉన్ని, మాంసం ఉత్పత్తి చేస్తున్నారు. చలికాలంలో కంటే వేసవిలో ఎక్కువ పాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. ఆవు పాలతో పోల్చితే జడల బర్రె పాలలో కొవ్వులు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీటి పాలతో వెన్న, వివిధ రకాల చీజ్‌లను తయారు చేస్తారు. మేక (ఫ్రాన్స్) ఫ్రాన్స్‌లో మేక పాలు విరివిగా వినియోగిస్తున్నారు. ఇక్కడ మేక పాలను రకరకాల చీజ్ల తయారీలో ఉపయోగిస్తారు. సహజసిద్ధంగా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండటం వల్ల మేక పాలను చర్మ సంరక్షణకు, సౌందర్య సాధనాల (కాస్మొటిక్స్) తయారీకి వినియోగిస్తున్నారు. మేక పాలలో కంటి చూపుకు మేలు చేసే ఎ–విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. రైన్డీర్ (పలవల దుప్పి)/ (ఫిన్‌ల్యాండ్) రైన్డీర్ పాలు చాలా అరుదుగా లభిస్తాయి. స్కాండినేవియా భూభాగంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రైన్డీర్లు సంచరిస్తున్నాయి. ఇవి రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల పాలు మాత్రమే ఇస్తాయి. ఈ పాలలో 20 శాతం కొవ్వు పదార్థం ఉండటంతో చిక్కదనంతో పాటు రుచిగా ఉంటాయి. ఫిన్‌ల్యాండ్‌లో రైన్డీర్ పాలను ‘లేపజువస్టో’ అనే జున్ను తయారీకి వాడతారు. గొర్రె (గ్రీస్) గొర్రె పాలకు గ్రీస్ ప్రసిద్ధి చెందింది. ఆవు పాలతో పోల్చితే గొర్రె పాలలో కొవ్వు శాతం ఎక్కువ. అందువల్ల ఇవి చీజ్ తయారీకి అత్యుత్తమైనవి. గ్రీస్‌లో గొర్రె పాలతో ఎన్నో వెరైటీల చీజ్‌లను తయారు చేస్తున్నప్పటికీ ‘ఫెటా చీజ్’ అనే వెరైటీని ఇక్కడ ఎక్కువ మంది ఇష్టపడతారు. గొర్రె పాలలో అధికంగా ఉండే కాల్షియం మన దంతాలను, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మూస్ (రష్యా, స్వీడన్) ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదుగా లభిస్తున్న మూస్ పాలను రష్యా, స్వీడన్ దేశాలలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. మూస్ రోజుకు 1 నుండి 6 లీటర్ల పాలను ఇస్తుంది. మూస్ పాలతో తయారయ్యే చీజ్ (మూస్ చీజ్) ప్రపంచంలో అత్యంత ఖరీదైన చీజ్‌గా గుర్తింపు పొందింది. ప్రపంచంలో మూస్ చీజ్‌ను తయారు చేస్తున్న ఏకైక కేంద్రం (మూస్ హౌస్) స్వీడన్‌లోని బ్జుర్హోమ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మూడు వెరైటీలతో మూస్ చీజ్‌లను తయారు చేస్తున్నారు. గాడిద పాలు గాడిద పాలు మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కలిగిఉన్నట్లు ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ప్రకటించింది. రోగ నిరోధక శక్తిని పెంచే మెడిసినల్ వ్యాల్యూస్ కూడా గాడిద పాలలో ఉన్నాయి. విటమిన్లు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెండ్లు పుష్కలంగా ఉంటాయి. గాడిద పాలు స్నానానికి ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుందని, చర్మ సంరక్షణ కలుగుతుందని శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. క్రీస్తు పూర్వం ఈజిప్టు రాణి క్లియో పాత్ర తన బ్యూటీని కాపాడుకోవడానికి గాడిద పాలతోనే స్నానం చేసేదట. ఇప్పటికీ అందానికి కేరాఫ్ అడ్రస్‌గా ఆమెనే చెబుతారు. -
మహిళకు మరిచిపోలేని షాకిచ్చిన ఒంటె
-
వైరల్: ఆహారం అనుకుందో.. కోపమొచ్చిందో
జంతువులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మంచిగా ఉంటే ఓకే.. కానీ అతి చేసి వాటికి చిరాకు తెప్పిస్తే.. మనకు మూడుతుంది. జన్మలో మర్చిపోలేని పాఠం చెప్తాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తనతో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించిన మహిళకు దిమ్మ తిరిగే షాకిచ్చింది ఒంటె. టిక్‌టాక్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ యువతి ఒంటెతో సెల్ఫీ దిగేందుకు దాని దగ్గరకు వెళ్తుంది. ఫోటో తీసుకుంటుండగా ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఇలా ఫోటోలు తీయడం ఆ ఒంటెకు నచ్చలేదో.. లేక బాగా ఆకలిగా ఉందో ఏమో తెలియదో కానీ సదరు యువతి జుట్టును కొంచెం కొరుక్కుని తినడం ప్రారంభించింది ఒంటె. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చదవండి: తృటిలో తప్పించుకున్న శ్రియ.. లేదంటే! -
తృటిలో తప్పించుకున్న శ్రియ.. లేదంటే!
శ్రియ సరన్.. పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే పదిహేనేళ్లు పూర్తయినా చెక్కుచెదరని అందం, అభినయంతో ఆకట్టుకోగల బ్యూటీ. దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా పలు చిత్రాల్లో నటించిన శ్రియ సరన్ ప్రస్తుతం ఆమె భర్త ఆండ్రీ కొస్చీవ్‌తో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రొమాంటిక్ ట్రిప్‌లో భాగంగా పెరులో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో కుజ్కోలోని ప్రఖ్యాతి గాంచిన మచ్చుపిచ్చు ప్రాంతాన్ని సందర్శించారు ఈ జంట. ఇది 2007లో ప్రపంచంలోని ఏడు కొత్త వింతల్లో ఒకటిగా ఎన్నికైంది. వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు శ్రియ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మచ్చుపిచ్చు వద్ద శ్రియ కూర్చొని ఫోటోకు ఫోజ్ ఇస్తుండగా పక్కనే ఉన్న ఒంటె ఆమె వద్దకు అకస్మాత్తుగా పరిగెత్తుకు వచ్చింది. దీనిని గమనించి అప్రమత్తమైన శ్రియ లేచి దూరం వెళ్లడంతో ఒంటె దాడి నుంచి తృటిలో తప్పించుకుంది. ఈ వీడియోను ‘టేక్ మీ బ్యాక్’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. కాగా 2018లో శ్రియ రష్యాకు చెందిన అండ్రీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఉదయ్‌పూర్ వేదికగా మారింది. ఆండ్రీ బార్సిలోనాలో స్థిరపడిన మాజీ టెన్నిస్ ఆటగాడు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం)లో అజయ్ దేవగణ్‌కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ‘గమనం’ అనే మల్టీలాంగ్వేజ్ చిత్రంలో నటిస్తున్నారు. చదవండి: సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే.. షూటింగ్లో నిజంగా పేలిన బాంబు.. హీరోకు గాయాలు View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
ప్రేయసికి అరుదైన కానుక.. ఇద్దరూ అరెస్టు
దుబాయ్: సాధారణంగా ఇష్టసఖి పుట్టినరోజు అంటే గులాబీలు, చాక్లెట్లు, టెడ్డీబేర్లు ఇచ్చే ప్రేమికుల గురించి విన్నాం. కానీ ఓ వ్యక్తి వీటన్నికంటే భిన్నంగా ఓ అరుదైన బహుమతిని ఇవ్వాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అప్పుడే పుట్టిన ఓ ఒంటె పిల్లను దొంగతనం చేసి ప్రేయసికి కానుక అందించాడు. అతడు చేసిన పనికి ఇద్దరూ కటకటాలపాలయ్యారు. ఈ ఘటన దుబాయ్‌లో చోటు చేసుకుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. కొన్ని రోజుల క్రితం ఓ జంట తమ ఒంటె పిల్ల కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా దొంగ వెన్నులో వణుకుపుట్టింది. ఈ క్రమంలో ఎక్కడి నుంచైతే ఒంటె పిల్లను ఎత్తుకొచ్చాడో అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో దానిని వదిలిపెట్టి వచ్చాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి తానే దాని జాడను చెప్పాడు. కొన్ని రోజులుగా అక్కడే తచ్చాడుతుందంటూ సమాచారం అందించారు. దీంతో లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. ప్రేమికురాలికి గిఫ్టు ఇచ్చేందుకే ఈ దొంగతనం చేశానని అతడు అంగీకరించాడు. తొలుత తల్లి ఒంటెనే తీసుకువెళ్దామని భావించానని, అయితే అప్పుడే ఓనర్లు రావడంతో దానిని వదిలేసి పిల్లను ఎత్తుకెళ్లినట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో చోరీ చేయడమే కాకుండా తమను తప్పుదోవపట్టించినందుకు నిందితుడు, అతడి ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా అరబ్ దేశాల్లో చాలా కుటుంబాలు పోషణ కోసం ఒంటెల మీద ఆధారపడతాయన్న విషయం తెలిసిందే. పాలు, ఇతర ఆహార ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా కొట్టాలు వేసి వాటిని పెంచుతూ ఉంటారు. మరోవైపు, రేసుల కోసం కూడా కొంతమంది ఒంటెలను కొనుగోలు చేస్తారు. కొన్ని ప్రత్యేక జాతులకు చెందిన ఒంటెలకు అందాల పోటీలు కూడా నిర్వహిస్తారు. చదవండి: ముక్కలు.. ముక్కలైన నవ్వుతున్నాడు..! -
ఒంటెతో ఏనుగు జలకాలాట.. వీడియో వైరల్
సాధారణంగా మూడ్ బాగాలేకపోతే పార్క్ లేదా జూపార్కులకు వెళ్తుంటాం. అక్కడి పచ్పదనం, పక్షుల కిలకిలలు, జంతువు అరుపులను వింటే మనసు కుదుట పడుతోంది. ఇక కొన్ని కొన్ని జంతువులు చేసే చిలిపి పనులు చూస్తే ఎన్ని బాధలు ఉన్నా ఇట్టే మర్చిపోతాం. కొన్ని జంతువులు అప్పుడప్పుడు మనుషుల కంటే ఎక్కువ తెలివిని ప్రదర్శిస్తుంటాయి. ఆ వీడియోలను చూస్తే మనస్సుకు ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. అలాంటి వీడియోనే ఇది. ఓ గున్న ఏనుగు ఏకంగా ఒంటెకు స్నానం చేయింది. ‘అయ్యో ఇంకా స్నానం చేయలేదా.. ఆగు నేను నీకు స్నానం చేయిస్తా’అన్నట్లు పక్కన ఉన్న కాలువలోని నీటిని తొండంతో తీసుకొచ్చి ఒంటె మూపురాలపై చిమ్మేసింది. (చదవండి : సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో) ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతా నందా ఈ వీడియోను ట్వీట్ చేశారు. ఒంటెను చల్లబడడానికి ఏనుగు అలా చేసిందని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏగును సరదాగా చేసిన ఆ పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ‘ఫ్రెండ్షిప్ అంటే ఇదేనేమో’, ‘ఇతరులు విజ్ఞప్తి చేయకముందే జంతువులు సహాయం చేస్తుంటాయి’, ఒంటెతో ఏనుగు ఆడుకుంటుంది’అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా, మొత్తానికి ఈ వీడియో భలే నవ్విస్తోంది. -
ఒంటె పాలు@ 600
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వేళ నగరంలో ఉంటున్న వలస జీవులు సొంత ప్రాంతాలకు తరలిపోతుండగా...రాజస్థాన్‌కు చెందిన కొందరు ఒంటెల యజమానులు మాత్రం ఉపాధి కోసం నగరానికి వలస వచ్చారు. ఒంటె పాలు లీటర్ రూ.600కు విక్రయిస్తున్నారు. తద్వారా కొద్దిగా ఆదాయం వస్తోందని వారు పేర్కొన్నారు. శుక్రవారం కొందరు ఒంటెల్ని మలక్‌పేట వద్ద నిలిపి మేత వేసి...నీళ్లు తాపించారు. -
జూకు వెళ్లారు...విచిత్ర అనుభవం ఎదురైంది
-
ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూడలేదు
కాలిఫోర్నియా : ఓ ఆదివారం సాయంత్రం కుటుంబంతో అలా బయటకు వెళితే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. రోజూ ఉండే ఉరుకుల పరుగుల జీవితం నుంచి కొంచెం విముక్తి లభిస్తుంది. అయితే ఇన్ని రోజులు లాక్డౌన్ తో బోరింగ్‌గా ఫీల్ అయిన ఓ కుటుంబం ఇటీవల సరాదాగా జూకు వెళ్లారు. అయితే అక్కడ వారికి ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే..ఇటీవల కాలిఫోర్నియాకు చెందిన నాతన్ పగ్ అనే వ్యక్తి భార్య, పిల్లలతో కలిసి ఓక్లహోమాలోని జంతుశాలకు వెళ్లాడు. అక్కడ ఉండే జంతువుల కోసం పది డాలర్ల విలువైన ఆహారాన్ని తీసుకెళ్లాడు. కారులో కోక్, స్నాక్స్ ఉంచుకొని కారులో జూ అంతా తిరుగుతూ జంతువులకు తినిపిస్తున్నాడు. (సింహాలు కూడా ఉహించని ట్విస్ట్!) ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఓ ఒంటె వారిని చూసి కారు వద్దకు వచ్చింది. ఏమనిపించిందో ఏమో కారులోని వ్యక్తి చేతిలో ఉన్న కోక్‌పై కన్నేసింది. ఇక అంతే కోక్‌ను ఆమాంతం లాగి గుటుక్కున తాగేసింది. ఇది చూసిన కుటుంబం వెంటనే షాక్ గురయ్యింది. అయితే ఒంటెకు మాత్రం ఒక్క కోక్ సరిపోలేదేమో కారు వెనక సీట్లో ఉన్న పాప చేతిలో మరో కోక్ చూసింది. దానిని కూడా బలవంతంగా లక్కొని తాగేసింది. దీంతో ఉలిక్కిపడ్డ చిన్నారి భయంతో ఏడుపు లంకించుకుంది. అక్కడే ఉంటే ఒంటె ఏం చేస్తుందోనని భయపడిన ఆ ఫ్యామిలీ అక్కడ నుంచి కారును ముందుకు తీసుకెళ్లారు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ‘చేతిలో తినే వస్తువులు ఉన్నప్పుడు జంతువులు లాక్కోవడం తెలుసు కానీ, ఇలా కారులోకి దూరి దొంగతనం చేయడం ఎప్పుడూ చూడలేదు’ని నెటిజన్లు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. (సెట్లో యాంకర్‌పై కోతి దాడి.. పరుగో పరుగు) -
రాజస్తాన్ నుంచి ఒడిశాకు ఒంటె పాలు
భువనేశ్వర్: ఆటిజమ్, ఫుడ్ అలర్జీలతో బాధపడుతున్న మూడేళ్ల బాలుడికి రాజస్తాన్ నుంచి ఒంటె పాలు సరఫరా చేయడం ద్వారా రైల్వే శాఖ తన మానవతను చాటుకుంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాజస్తాన్‌లోని ఫల్నా ప్రాంతం నుంచి ఒడిశాలోని బెహ్రంపూర్‌కు ఈ ఒంటెపాలు సరఫరా చేయడం విశేషం. పార్సిల్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ద్వారా ఢిల్లీ, హౌరా మీదుగా పాలు ఒడిశా చేరాయని, భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో బాలుడి బంధువుకు పాలు అందజేశామని రైల్వే శాఖ అధికారి ఒకరు తెలిపారు. దాదాపు 20 కిలోలున్న ప్యాకేజీ కోసం రూ.125 వసూలు చేశామని తెలిపింది. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారులు నిర్వహిస్తున్న స్వచ్ఛంద కార్యక్రమం సేతు ద్వారా దీనిని చేపట్టామని అధికారులు తెలిపారు. ఆటిజమ్, ఫుడ్ అలర్జీలు ఉన్న బాలుడికి ఒంటెపాలు ఎంతో మేలు చేస్తాయని బాలుడి బంధువు చందన్ కుమార్ ఆచార్య తెలిపారు. సేతు కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా అత్యవసరమైన మందులు, ఇతర పదార్థాల సరఫరా సాఫీగా జరిగేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎనిమిది రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా 100 ప్రాంతాల్లో అత్యవసరమైన పదార్థాలను సరఫరా చేశామని తెలిపారు. జాతీయ విపత్తుల నిర్వహణ కేంద్రంతోనూ తాము పనిచేశామని, మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు, వెంటిలేటర్లు, ఎరువులు, కొన్ని ముడిసరుకులను దేశవ్యాప్తంగా రవాణా చేశామని వివరించారు. కరోనా వైరస్: మరో దుర్వార్త -
గబ్బిలాన్ని కరోనా ఏం చేయలేదా?
సింగపూర్ సిటీ: నిఫా, ఎబోలా వైరస్ల తరహాలో కరోనా వైరస్ సైతం గబ్బిలాల నుంచే సోకిందని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మొదట కరోనా వైరస్‌ను గుర్తించిన చైనాలోని వుహాన్‌లోని కరోనా పేషెంట్ల నుంచి చైనా శాస్త్రవేత్తలు శాంపిల్స్ సేకరించారు. వాటిని ఇతర వైరస్ల జన్యు క్రమాలతో పోల్చారు. చైనాలోని ఒక తరహా గబ్బిలం(హార్స్‌షూ)లో లభించిన వైరస్ జన్యుక్రమంతో ఈ శాంపిల్‌లోని వైరస్ జన్యుక్రమం 96% సరిపోలింది. అయితే, ఈ వైరస్ నేరుగా గబ్బిలం నుంచి మనిషికి సోకలేదని, మధ్యలో మరో వాహకం ఉండే చాన్సుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సార్స్ వ్యాధికి కారణమైన కరోనా వైరస్ గబ్బిలం నుంచి ముంగిస జాతికి చెందిన వాహకం ద్వారా మనుషులకు సోకినట్లు, అలాగే, మెర్స్ వ్యాధి గబ్బిలం నుంచి ఒంటె ద్వారా మనుషులకు సోకినట్లు నిర్ధారణ అయిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. గబ్బిలాల్లో పెద్ద సంఖ్యలో వివిధ రకాలైన వైరస్లు ఉంటాయి. మనుషులకు సోకే ముప్పున్న దాదాపు 130 రకాల వైరస్‌లను గబ్బిలాల్లో గుర్తించారు. మల, మూత్రాలు, ఉమ్మి ద్వారా గబ్బిలాలు వైరస్‌ను వ్యాప్తి చేస్తాయి. ఇన్ని వైరస్‌లకు ఆవాసమైన గబ్బిలాలపై ఆ వైరస్ ప్రభావం ఎందుకు పడదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి సమాధానాన్ని సింగపూర్‌లోని డ్యూక్ ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్లో గబ్బిలాల్లోని వైరస్‌లపై పరిశోధన చేస్తున్న లిన్ఫా వాంగ్ వివరించారు. ‘గబ్బిలం ఎగరగల క్షీరద జాతి. ఎగిరేటపుడు వాటి శరీర ఉష్ణోగ్రత 100 ఫారన్‌హీట్ వరకు వెళ్తుంది. గుండె నిమిషానికి 1000 కన్నా ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మిగతా క్షీరదాలైతే చనిపోతాయి. ఎగిరే సమయంలో తలెత్తే ఈ ఒత్తిడిని తట్టుకునేలా ఒక ప్రత్యేక వ్యాధి నిరోధక వ్యవస్థను గబ్బిలాలు సమకూర్చుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా అవి తమ శరీరంపై వైరస్ల ప్రభావాన్ని చంపేసే ప్రత్యేక కణాలను తయారుచేసుకుంటాయి. అలా, వాటి శరీరాలు వైరస్ల ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొని, జబ్బు పడకుండా ఉంటాయి’అని వాంగ్ వివరించారు. ఇలాంటి వ్యవస్థ మనుషులు సహా ఇతర క్షీరదాల్లో లేదని చెప్పారు. -
ఎన్నాళ్లయిందో; యజమానిని హగ్ చేసుకున్న ఒంటె
ఆత్మీయ ఆలింగనం.. బాధల్ని మరిచిపోయేలా చేస్తుంది. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’లో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే అది కేవలం మనుషులకే కాదు.. జంతువులకూ వర్తిస్తుందని నిరూపించిందో ఘటన. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒంటె యజమాని కొన్ని రోజులుగా దాని దగ్గరకు వెళ్లలేకపోయాడు. దీంతో ఒంటె ఎంతగానో బెంగపెట్టేసుకుంది. ఆ తర్వాత యజమాని తిరిగి ఒంటె దగ్గరకు వెళ్లగానే ఒంటె ఒక్కసారిగా అతన్ని చుట్టుకుపోయింది. తన మెడతో ఆ వ్యక్తిని చుట్టేసి ఆప్యాయంగా హత్తుకుంది. ఈ వీడియోను భారత అటవీశాఖ అధికారి సుశాంత్ నంద సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘మనం ఏదైతే పంచుతామో అది మాత్రమే మనకు దక్కుతుంది’ అని క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. గతంలోనూ దాదాపు ఇలాంటి ఘటనే సౌదీ అరేబియాలో జరిగింది. ఓ వ్యక్తి తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఒంటెను అమ్మేశాడు. కొంత కాలానికి ఆ మూగ జంతువును చూడాలని మనసు తహతహలాడటంతో ఒంటెను కొనుగోలు చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లాడు. అక్కడే దీనంగా ఉన్న ఒంటె అతన్ని చూడగానే వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లుగా అతన్ని సమీపించి హత్తుకుని ఆత్మీయ అనురాగాన్ని కురిపించింది. కాగా ఈ ఘటనలతో పెద్ద జంతువులు కూడా ప్రేమను చూపించగలవని మరోసారి రుజువైంది. We only have What we give😊 Camel owner went absent from his herd for few days. On his return love showered on him by one of his camels is the purest love. pic.twitter.com/CYsZybRos3 — Susanta Nanda IFS (@susantananda3) December 27, 2019 -
అమూల్ నుంచి ఒంటె పాలు
ముంబై: డెయిరీ దిగ్గజం అమూల్ తాజాగా ఒంటె పాలు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అరలీటరు పెట్ బాటిల్ ధర రూ. 50గా ఉంటుందని సంస్థ తెలిపింది. ముందుగా గుజరాత్‌లోని గాంధీనగర్, అహ్మదాబాద్, కచ్ మార్కెట్లలో ఈ పాలను విక్రయిస్తారు. ఫ్రిజ్ లో ఉంచితే ఈ పాలు మూడు రోజుల దాకా పాడవకుండా ఉంటాయి. ఇటీవలే ప్రవేశపెట్టిన ఒంటె పాల చాక్లెట్లకు మంచి స్పందన వస్తోందని అమూల్ తెలిపింది. ఒంటె పాలు సులభంగా జీర్ణం కావడంతో పాటు మధుమేహ సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చేకూరుస్తాయని కంపెనీ తెలిపింది. -
ఘోరం: విలవిల్లాడిన ఒంటె
బికనీర్, రాజస్థాన్ : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గత నెల 9వ తేదీన బికనీర్‌లో రోడ్డు దాటుతున్న ఒంటెను కారు ఢీ కొట్టింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఒంటె కారులో ఇరుక్కుపోయింది. కారు టాప్ విండో నుంచి బయటపడేందుకు ఒంటె యత్నించడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. కాళ్లను అదేపనిగా ఆడిస్తుండటం వల్ల స్థానికులు దాన్ని బయటకు లాగేందుకు యత్నించలేదు. దాదాపు 4 గంటల పాటు అలానే నరకయాతన పడిన ఒంటె కాళ్ల ఆడించడం ఆపడంతో కొందరు దాన్ని బయటకు లాగి రక్షించారు. గాయాలపాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కారును అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, ఒంటెకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. -
8 టన్నుల ఒంటె మాంసం పట్టివేత
మునుగోడు: పచ్చని పొలాల నడుమ రక్తం ఏరులై పారింది. పదునైన కత్తులు, గొడ్డళ్లతో వధిస్తుంటే మూగజీవాల వేదన..అరణ్య రోదనగా మారింది. నల్లగొండ జిల్లా మనుగోడు మండలం ఊకొండిలోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో ఒంటెలను వధిస్తున్న ముఠాను పోలీసులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. హైదరాబాద్‌కు రవాణా చేసేందుకు సిద్ధం చేసిన 8 టన్నుల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ కాచిగూడకు చెందిన అఫ్జల్, మలక్‌పేటకు చెందిన ఫరీద్ కొంతకాలంగా ఒంటె మాంసం వ్యాపారం చేస్తున్నారు. వీరు నల్లగొండ జిల్లా మునుగోడుకు చెందిన మాంసం వ్యాపారి ఖయ్యూంతో పరిచయం ఏర్పరు చుకున్నారు. రాత్రి సమయంలో ఒంటెలను కోసేందుకు అనువైన స్థలం కావాలని అడిగారు. దీంతో ఖయ్యూం తనకు నిత్యం పశువులని విక్రయించే అదే మండలం ఊకొండి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నిమ్మల స్వామిని ఆ«శ్రయించగా.. తన భూమిని వాడుకోండని చెప్పాడు. దీంతో వ్యవసాయ భూమిలో ఒంటెలను వధించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి రెండు లారీలు, డీసీఎంల (మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్నవి)లో 28 ఒంటెలను వ్యవసాయక్షేత్రం వద్దకు తీసుకొచ్చారు. వాటిని వధించేందుకు కోల్‌కతా, హైదరాబాద్, అసోం, నాగాలాండ్‌కు చెందిన 25 మంది యువకులను కూడా వెంట తీసుకువచ్చారు. రాత్రి 11.30 గంటల తర్వాత ఒంటెలను వధించడం మొదలుపెట్టారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. మునుగోడు ఎస్ఐ రాములు తన సిబ్బందితో అర్ధరాత్రి ఘటనాస్థలికి చేరుకోగా.. అప్పటికే 22 ఒంటెలను కోశారు. సుమారు ఎనిమిది టన్నుల మాంసాన్ని డీసీఎంలలో లోడ్ చేశారు. కాగా, పోలీసులను చూసి వ్యాపారులు, యువకులు పారిపోయారు. లారీలో ఉన్న ఆరు ఒంటెలను కిందికి దింపారు. అందులో ఒకటి చనిపోయింది. కాగా, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నాలుగు లారీలతోపాటు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. -
కష్టంలోనూ కారుణ్యం!
• ప్రవక్త జీవితం అందులో గొప్పధీశాలి అయిన సురాఖ బిన్ మాలిక్ జూషమ్ అనే యువకుడు కూడా ఉన్నాడు. ఆ ఖ్యాతి తనకే దక్కాలని, వంద ఒంటెల భారీబహుమానాన్ని తానే కొట్టేయాలని తన శక్తిసామర్ధ్యాలన్నిటినీ ఉపయోగించాడు. మెరుపుతీగలాంటి అశ్వాన్ని అధిరోహించి తీరప్రాంతం వైపు దౌడుతీయించాడు. గుర్రపుస్వారీలో ఆరితేరిన సురాఖ ఆరోజెందుకో ఎదురుదెబ్బలు తిన్నాడు. మనసు కీడుశంకించింది. కాని తనకు తానే ధైర్యం చెప్పుకొని పట్టుదలతో ముందుకుసాగాడు. ప్రవక్తవారి ప్రయాణం ఒకరాత్రి, రెండుపగళ్ళు అవిశ్రాంతంగా, నిరాటంకంగా, నిశ్చింతగా సాగింది. తరువాతి రోజు మధ్యాహ్నం వేళ ఎండతీవ్రంగా ఉండడంతో వారు ఓచోట నీడలో ఆగి భోజనాలు ముగించుకొని విశ్రాంతికి ఉపక్రమించారు. అంతలో దక్షిణం వైపునుండి మెరుపువేగంతో ఓ అశ్వధారి రావడాన్ని గమనించిన హ.అబూబక్ర్. ’దైవప్రవక్తా! ఇక మనం దొరికిపోయినట్లే’ అన్నారు కంగారుగా.. కాని ముహమ్మద్ ప్రవక్తముఖంలో ఎలాంటి ఆందోళనా లేదు. ’అబూబక్ర్! కంగారుపడకు. మనకు తోడుగా దేవుడున్నాడు’. అన్నారు ప్రశాంత వదనంతో! శతృవు దగ్గరవుతున్నకొద్దీ డెక్కల చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. దుమ్ము ధూళి రేణువులు ఎగిరిపడుతున్నాయి. అశ్వం మరికాస్త దగ్గరయిందో లేదో అకస్మాత్తుగా ఒక్క పల్టీకొట్టింది. అశ్వం ముందరి కాళ్ళు మోకాళ్ళవరకు కూరుకుపొయ్యాయి. ఆ ఊపుకు అశ్వధారి కూడా బోర్లా పడిపోయాడు. ఊబిలో దిగబడినట్లు దిగబడిన గుర్రపుకాళ్ళు ఎంతగింజుకున్నా బయటికి రావడం లేదు. పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న సురాఖ కూడా శక్తినంతా కూడదీసుకున్నా పైకి లేవలేక పోతున్నాడు. ఈ దెబ్బతో అతని ధైర్యం జావగారిపోయింది. ఉదయం నుండి తగిలిన ఎదురు దెబ్బలను గురించి ఆలోచిస్తే, అన్నీ అపశకునాలే గోచరించాయి. ఏనాడూ ఓటమి ఎరుగని వాడికి ఈ పరిణామంతో జ్ఞానోదయమైంది. బహుశా తను చేస్తున్నపని దేవునికి ఇష్టంలేదేమో అన్నఆలోచన వచ్చింది. ఓటమిని అంగీకరిస్తూ రెండుచేతులు పైకెత్తి ప్రవక్తను, ఆయన అనుచరులతో ‘అయ్యా.. నేను సురాఖాను. మాలిక్ బిన్ జూషమ్ కొడుకును. నేను మీకు ఎలాంటి హానీ తలపెట్టను. నన్నునమ్మండి. నేను మీతో మాట్లాడాలి’. అని వేడుకున్నాడు. ఆసమయంలో ఎవరైనా ఏంచేస్తారు? తనను చంపడానికి కరవాలం చేతపట్టుకొని బుసలు కొడుతూవచ్చిన శత్రువు కత్తివేటుదూరంలో, దాడిచేయలేని నిస్సహాయ స్థితిలో చతికిల పడి ఉంటే అలాగే వదిలేస్తారా? కత్తికో కండగా చీల్చి కాకులకూ గద్దలకూ వేయరూ..? కాని కారుణ్యమూరి ్తముహమ్మద్ ప్రవక్త(స) శత్రువును కరుణించారు. అతని కోసం ప్రార్థించారు. అప్పుడు ఊబిలో కూరుకుపోయిన గుర్రం పైకి లేచింది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతాది వచ్చేవారం) -
ఒంటె నుంచి జలుబు!
బెర్లిన్: మానవుల్లో సాధారణ జలుబుకు కారణమైన వైరస్ ఒంటెల నుంచి వచ్చిందని పరిశోధనల్లో తేలింది. రైనోవైరస్ అనే నాలుగు రకాల ఎండమిక్ కరోనా వైరస్లు(ఒకే ప్రాంతానికి పరిమితమైనవి) జలుబు కలిగిస్తాయి. అయితే వీటి వల్ల మానవులకు ఎలాంటి హానీ లేదని పరిశోధకులు చెబుతున్నారు. జర్మనీలోని యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ బాన్ పరిశోధకుడు క్రిస్టియన్ డ్రోస్టెన్ బృందం ఈ వైరస్లలో ఒకటైన హెచ్‌సీవోవీ-229ఈ వైరస్ మూలాలను కనుగొన్నారు. కాగా, ప్రాణాంతకమైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వైరస్ కూడా ఒంటెల నుంచే మానవులకు సంక్రమించింది. వెయ్యికి పైగా ఒంటెలను పరిశీలించగా, హెచ్‌సీవోవీ-229ఈ వైరస్ 6 శాతం కేసుల్లో ఉన్నట్లు తేలింది. గబ్బిలాలు, మానవులు, తదితరాలపై చేసిన పరిశోధనల్లో ఒంటెల నుంచే సాధారణ జలుబు మానవులకు సంక్రమించినట్లు తేలిందని పరిశోధకులు చెప్పారు. అయితే వైరస్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే మానవుల్లో నిరోధక శక్తి పెంపొందిందని పేర్కొన్నారు. -
ఒంటెకు ముద్దిచ్చిన కోడలు.. ఒంటికాలిపై లేచిన అత్త
మనామా: సౌదీ అరేబియాలోని ఒక కుటుంబంలో ఓ ఒంటె చిచ్చుపెట్టింది. పచ్చగా ఉన్న ఓ భార్యభర్తల కాపురంలో భగ్గుమనేమంటలు రేగేలా చేసింది. తన కోడలు ఓ ఒంటెను ముద్దు పెట్టుకుందని ఆమెకు వెంటనే విడాకులు ఇవ్వాలని ఓ అత్తగారు తన కుమారుడిపై పెద్దపెద్దమాటలతో చిందులేసింది. ప్రారంభంలో ఆ విషయంలో వివాదంగా మారినా చివరకు సుఖాంతమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే సౌదీ అరెబియాకు చెందిన ఇద్దరు భార్యభర్తల్లో భార్య ఈ మధ్య ఓ ఒంటెకు ప్రేమగా ముద్దుపెట్టింది. అది చూసిన అత్తగారు ఒంటికాలుపై లేస్తూ మతాన్ని అవమానించావని, సామాజిక కట్టుబాట్లు దాటావని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా వెంటనే ఆమెకు విడాకులు ఇవ్వాల్సిందిగా తన కొడుకుపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీనిపై ఒంటెను ముద్దు పెట్టుకున్న ఆ కోడలు స్పందిస్తూ తాను ఒంటెను ముద్దుపెట్టుకోవడం వెనుక వేరే ఉద్దేశం లేదంది. కేవలం అమాయమైన జంతుప్రేమమాత్రమే ఉందని, తన అత్తగారు అసలు దాడి చేయడానికి అసలు కారణం అది కాదని, తనకు ఇప్పటి వరకు పిల్లలు లేరనే ఆగ్రహంతోనే ఆమె అలా అన్నారని చెప్పింది. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఆమె పుట్టింటికి కూడా వెళ్లిపోయింది. అయితే, తన భార్యను అర్ధం చేసుకున్న భర్త ఆమె తప్పే లేదని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. తల్లి ఒక గదిలో ఉంటుండగా వారిద్దరు వేరే గదిలో ఉంటున్నారు. అయితే, తన భర్తతో ప్రశాంతంగా ఉండాలనే తానెప్పుడూ కోరుకుంటానని ఆ కోడలు చెప్పుకొచ్చింది.