
నచ్చలేదో.. లేక బాగా ఆకలిగా ఉందో ఏమో తెలియదో కానీ సదరు యువతి
జంతువులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మంచిగా ఉంటే ఓకే.. కానీ అతి చేసి వాటికి చిరాకు తెప్పిస్తే.. మనకు మూడుతుంది. జన్మలో మర్చిపోలేని పాఠం చెప్తాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తనతో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించిన మహిళకు దిమ్మ తిరిగే షాకిచ్చింది ఒంటె.
టిక్‌టాక్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ యువతి ఒంటెతో సెల్ఫీ దిగేందుకు దాని దగ్గరకు వెళ్తుంది. ఫోటో తీసుకుంటుండగా ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఇలా ఫోటోలు తీయడం ఆ ఒంటెకు నచ్చలేదో.. లేక బాగా ఆకలిగా ఉందో ఏమో తెలియదో కానీ సదరు యువతి జుట్టును కొంచెం కొరుక్కుని తినడం ప్రారంభించింది ఒంటె. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.