
టెక్నాలజీ పెరిగాక ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఫోటోల విషయంలో. సోషల్ మీడియాలో మహిళల ఫోటో కనిపిస్తే చాలు.. మృగాళ్లు వాటితో ఆడవారిని ఓ రేంజ్‌లో టార్చర్ చేస్తారు. అందుకే సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే ఓ మహిళ తెలిసిన వాడే కదా అని.. ఓ వ్యక్తి అడగటంతో అతడికి తన సెల్ఫీ పంపంది.
దాన్ని అతడు మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో చూసి సదరు మహిళ తీవ్రంగా షాక్ అయ్యింది. ఎందుకంటే ఎంతో అందంగా ఉన్న తనను సదరు వ్యక్తి చాలా అందవిహీనంగా మార్చి.. ఆ ఫోటోని పబ్లిష్ చేశాడు. ఈ క్రమంలో సదరు మహిళ ఆమె పంపిన ఫోటో.. అతడు మార్ఫ్ చేసిన ఫోటోలను వీడియోలో షేర్ చేసింది. ప్రసుత్తం అది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు...
టిక్‌టాక్ యూజర్ అయిన సదరు మహిళ చూడ్డానికి చాలా అందంగా, స్టైల్‌గా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె హెయిర్ డ్రస్సర్ ఒక రోజు ఆమెకు కాల్ చేసి.. సదరు మహిళ సెల్ఫీ ఫోటో ఒకటి అతడికి సెండ్ చేయమని కోరాడు. తెలిసిన వాడే కావడంతో ఆమె తన సెల్ఫీని అతడికి పంపింది. ఆ తర్వాత అతడు ఆమె ఫోటోని ఎడిట్ చేసి తన సోషల్ మీడియా పేజ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ ఫోటో చూసి ఆ మహిళ షాక్‌కు గురయ్యింది. ఏంటి నేను ఇలా ఉంటానా అనుకోని భయపడింది.
ఎందుకంటే సదరు హెయిర్ డ్రెస్సర్ ఎంతో అందంగా ఉన్న మహిళ ఫేస్‌ను దారుణంగా ఎడిట్ చేశాడు. స్కిన్ కలర్ నల్లగా.. ముఖం కూడా ఉబ్బిపోయినట్లుగా మార్చాడు. ఈ క్రమంలో సదరు మహిళ రెండు ఫోటోలను చూపిస్తూ ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇప్పటికే 1.2మిలియన్లకు పైగా జనాలు దీన్ని వీక్షించారు. ఇక వీడియో చూసిన వారంతా ‘‘నీ హెయిర్ డ్రెస్సర్‌కి ఏమైనా పిచ్చా ఏంటి.. అందంగా ఉన్న నిన్ను ఇలా మార్చాడు’’.. ‘‘సహాజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావ్.. అతడు చేసిన పని ఏమాత్రం బాగాలేదు.. నువ్వు మరో హెయిర్ డ్రెస్సర్‌ని చూసుకో’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.
Comments
Please login to add a commentAdd a comment