Hairdresser
-
షాకింగ్: తెలిసిన వాడని ఫోటో పంపితే.. దాన్ని మార్ఫ్ చేసి
టెక్నాలజీ పెరిగాక ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఫోటోల విషయంలో. సోషల్ మీడియాలో మహిళల ఫోటో కనిపిస్తే చాలు.. మృగాళ్లు వాటితో ఆడవారిని ఓ రేంజ్లో టార్చర్ చేస్తారు. అందుకే సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే ఓ మహిళ తెలిసిన వాడే కదా అని.. ఓ వ్యక్తి అడగటంతో అతడికి తన సెల్ఫీ పంపంది. దాన్ని అతడు మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో చూసి సదరు మహిళ తీవ్రంగా షాక్ అయ్యింది. ఎందుకంటే ఎంతో అందంగా ఉన్న తనను సదరు వ్యక్తి చాలా అందవిహీనంగా మార్చి.. ఆ ఫోటోని పబ్లిష్ చేశాడు. ఈ క్రమంలో సదరు మహిళ ఆమె పంపిన ఫోటో.. అతడు మార్ఫ్ చేసిన ఫోటోలను వీడియోలో షేర్ చేసింది. ప్రసుత్తం అది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు... టిక్‌టాక్ యూజర్ అయిన సదరు మహిళ చూడ్డానికి చాలా అందంగా, స్టైల్‌గా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె హెయిర్ డ్రస్సర్ ఒక రోజు ఆమెకు కాల్ చేసి.. సదరు మహిళ సెల్ఫీ ఫోటో ఒకటి అతడికి సెండ్ చేయమని కోరాడు. తెలిసిన వాడే కావడంతో ఆమె తన సెల్ఫీని అతడికి పంపింది. ఆ తర్వాత అతడు ఆమె ఫోటోని ఎడిట్ చేసి తన సోషల్ మీడియా పేజ్‌లో అప్లోడ్ చేశాడు. ఈ ఫోటో చూసి ఆ మహిళ షాక్‌కు గురయ్యింది. ఏంటి నేను ఇలా ఉంటానా అనుకోని భయపడింది. ఎందుకంటే సదరు హెయిర్ డ్రెస్సర్ ఎంతో అందంగా ఉన్న మహిళ ఫేస్‌ను దారుణంగా ఎడిట్ చేశాడు. స్కిన్ కలర్ నల్లగా.. ముఖం కూడా ఉబ్బిపోయినట్లుగా మార్చాడు. ఈ క్రమంలో సదరు మహిళ రెండు ఫోటోలను చూపిస్తూ ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇప్పటికే 1.2మిలియన్లకు పైగా జనాలు దీన్ని వీక్షించారు. ఇక వీడియో చూసిన వారంతా ‘‘నీ హెయిర్ డ్రెస్సర్‌కి ఏమైనా పిచ్చా ఏంటి.. అందంగా ఉన్న నిన్ను ఇలా మార్చాడు’’.. ‘‘సహాజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావ్.. అతడు చేసిన పని ఏమాత్రం బాగాలేదు.. నువ్వు మరో హెయిర్ డ్రెస్సర్‌ని చూసుకో’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ఇకపై ఇలాంటివి పోస్ట్.. షేర్ చేసినా నేరమే -
అవసవరమే!
‘నచ్చి చేసే తప్పుల్లో అందంగా కనిపించాలనే ఆలోచన’ నాకు నచ్చినది అని దర్శకుడు ఆల్ ప్యాచినో ఎప్పుడో అన్నాడు. ఆయన చెప్పిన ఈ మంత్రాన్ని పాటిస్తున్నారు సోనాలీ బింద్రే. ప్రస్తుతం ఆమె క్యాన్సర్ వ్యాధికి లండన్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. చికిత్సలో భాగంగా జుత్తు కత్తిరించుకుని, గుండు చేయించుకున్నా ఇబ్బంది పడకుండా ఫొటోలకు ఫోజులిచ్చారామె. లేటెస్ట్గా అందంగా కనిపించడం కోసం విగ్ (సవరం) ధరిస్తున్నారట. ఆ విషయాన్ని సోనాలి తెలియజేస్తూ ఓ లేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ఆల్ ప్యాచినో చెప్పినమంత్రంతో ఇప్పుడు ఏకీభవిస్తున్నాను. కానీ, అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు? మనం ఎలా కనిపిస్తున్నామో అన్న విషయం మనపై సైకలాజికల్ ఎఫెక్ట్ ఉండనే ఉంటుంది. కొంచెం అందంగా కనిపించాలనుకోవడం ఎవరికీ పెద్ద హాని కాదు. మనకి ఆనందాన్ని ఇచ్చేదేంటో తెలుసుకోవాలి. విగ్ వాడదాం అనుకున్నప్పుడు నాకో చిరు సందేహం వచ్చింది. ఆకర్షణీయంగా కనిపించడానికి నేను ఎందుకింత ఆరాటపడుతున్నానని. బహుశా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండటం వల్లనేమో? ఒక్క క్షణం ఆలోచించి, నాకు బావుంటుంది అనుకొని విగ్ ధరించదలిచాను. మనకేది సూట్ అవుతుందో.. ఏది నచ్చుతుందో అన్నదే ముఖ్యం. ఈ కొత్త హెయిర్ డ్రెస్సర్‌ని పరిచయం చేసినందుకు థ్యాంక్యూ ప్రియాంకా చోప్రా’’ అని పేర్కొన్నారు. -
వృద్ధ వయసులోనూ అసభ్యంగా చేస్తున్నాడని..
లండన్: తనను మోసం చేశాడనే కారణంతో లండన్‌లో ఓ టీవీ చానెల్ ప్రోగ్రాంకు న్యాయనిర్ణేతగా పనిచేసిన మహిళ తన భర్తకు గుడ్ బాయ్ చెప్పేసింది. మరో స్త్రీతో అతడు సంబంధాలు పెట్టుకున్నాడని ఆధారాలతో సహ లభించడంతో ఆమె అతడితో బ్రేకప్ చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లండన్ ఎక్స్ ఫ్యాక్టర్ టీవీ షోలో శరాన్ ఓస్బోర్న్ జడ్జిగా పనిచేస్తుండేది. ఆమెకు అక్కడ పనిచేస్తున్న సమయంలోనే ఓజీ ఓస్బోర్న్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు చాలా స్టైలిష్ గా ఉండేవాడు. వారిద్దరికి ముగ్గురు పిల్లలు కూడా. అయితే, ఇప్పటికే ఆరుపదుల వయసుపై బడిన అతడు ఇటీవల కాలంలో మిషెల్లీ పఫ్ (45) అనే ఓ సెలబ్రిటీస్ హెయిర్ డ్రెసర్తో సంబంధాలు పెట్టుకున్నట్లు వదంతులు విపరీతంగా వచ్చాయి. మిషెల్లీ పఫ్.. జెన్నీఫర్ లోపేజ్, అలిసియా సిల్వర్ స్టోన్ వంటి నటీ నటులకు హెయిర్ డ్రెసర్ గా పనిచేస్తుంది. అయితే, తన భర్తకు మిషెల్లీకి సంబంధం ఉందని గతంలోనే షరాన్ కు తెలిసినా ఆధారాలు లేక పరోక్షంగా మాత్రమే ఓజీని తిడుతుండేది. అయితే, గత వారం పూర్తిగా కనిపించకుండా పోయిన ఓజీ ఓ హోటల్‌తో మిషెల్లీతో ఉన్నాడని తెలియడంతో ఇక ఆమె తెగదెంపులు చేసుకుంది. -
ఫేస్బుక్ వాడుతున్నాడని ప్రియుడ్ని చంపింది
లండన్: ఫేస్బుక్ వాడకం ప్రాణాల మీదికి తెస్తుందంటే ఏంటో అనుకుంటుంటాం. కానీ ఓ హెయిర్ డ్రెస్సర్ చేసిన పని తెలిస్తే ఇది నిజమే అనిపిస్తుంది. తన బోయ్‌ఫ్రెండ్ ఫేస్బుక్ వీపరీతంగా వాడతున్నాడని, దానివల్ల అతడి ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయని భావించి ఆవేశానికి లోనైన ప్రియురాలు.. అతడ్ని హత్య చేసింది. ఈ కేసును విచారించిన కోర్టు నిందితురాలికి 12 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ, ఆ గడువు ముగిసిన తర్వాత పెరోల్‌పై బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది. గతేడాది ఆగస్టులో జరిగిన హత్య ఘటనలో పూర్తి వివరాలిలా ఉన్నాయి. టెర్రీ మారీ పామర్ అనే యువతి హెయిర్ డ్రెస్సర్ గా పనిచేస్తుండేది. నిరుద్యోగి అయిన ఆమె బోయ్ ఫ్రెండ్ డామన్ సియర్సన్ ఇటీవలే ఓ మొబైల్ ఫోన్ కొన్నాడు. అందులో ఫేస్బుక్ చాటింగ్ చేయడం మొదలెట్టాడు. తన అర్ధనగ్న ఫొటోలు కూడా విపరీతంగా పోస్ట్ చేసేవాడు. అలా.. అతడి వాడకం శృతిమించింది. దాంతో బాగా విసిగిప ఓయిన పామర్.. అతడ్ని చంపేయాలని నిర్ణయించుకుంది. గతేడాది ఆగస్టు13వ తేదీన బోయ్ ఫ్రెండ్ సియర్సన్‌ను గుండెల్లో కత్తితో పలు పోట్లు పొడిచి హత్యచేసింది. ఆ వెంటనే షాక్ నుంచి తేరుకుని స్వయంగా తానే అత్యవసర సేవల నంబర్ 999కు కాల్ చేసింది. తన లవర్ పొరపాటున కత్తితో పొడుచుకుని గాయపడ్డాడని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆరు నెలల విచారణ తర్వాత పోలీసుల దర్యాప్తులో నిజాలు ఒక్కక్కటిగా బయటపడ్డాయి. బోయ్ ఫ్రెండ్ లేకపోవడంతో తనకు చాలా బోరింగ్‌గా ఉందని ఫేస్ బుక్ లో ఓ సందేశాన్ని పంపిన ఆమె... సియర్సన్ వ్యవహారం నచ్చకనే అతడ్ని చంపేశానంటూ మరో పోస్ట్‌లో పేర్కొంది. కొత్త ఫోన్ కొన్న తర్వాక ఫేస్బుక్ అతిగా వాడటం, కొత్త స్నేహాలు పెంచుకోవడమే సియర్సన్ మృతికి కారణమయ్యాయని పోలీసులు వివరించారు. తనను వదిలించుకోవాలని ప్రయత్నించాడని, వేరొక యువతిలో సన్నిహితంగా ఉంటున్నాడని భావించి ప్రియుడ్ని హత్యచేసినట్లుగా పామర్ కోర్టులో చెప్పింది.