వృద్ధ వయసులోనూ అసభ్యంగా చేస్తున్నాడని.. | Sharon Osbourne 'dumps husband Ozzy after he cheated with a hairdresser' | Sakshi
Sakshi News home page

వృద్ధ వయసులోనూ అసభ్యంగా చేస్తున్నాడని..

Published Sun, May 8 2016 12:18 PM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

వృద్ధ వయసులోనూ అసభ్యంగా చేస్తున్నాడని..

వృద్ధ వయసులోనూ అసభ్యంగా చేస్తున్నాడని..

లండన్: తనను మోసం చేశాడనే కారణంతో లండన్లో ఓ టీవీ చానెల్ ప్రోగ్రాంకు న్యాయనిర్ణేతగా పనిచేసిన మహిళ తన భర్తకు గుడ్ బాయ్ చెప్పేసింది. మరో స్త్రీతో అతడు సంబంధాలు పెట్టుకున్నాడని ఆధారాలతో సహ లభించడంతో ఆమె అతడితో బ్రేకప్ చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లండన్ ఎక్స్ ఫ్యాక్టర్ టీవీ షోలో శరాన్ ఓస్బోర్న్ జడ్జిగా పనిచేస్తుండేది. ఆమెకు అక్కడ పనిచేస్తున్న సమయంలోనే ఓజీ ఓస్బోర్న్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు చాలా స్టైలిష్ గా ఉండేవాడు.

వారిద్దరికి ముగ్గురు పిల్లలు కూడా. అయితే, ఇప్పటికే ఆరుపదుల వయసుపై బడిన అతడు ఇటీవల కాలంలో మిషెల్లీ పఫ్ (45) అనే ఓ సెలబ్రిటీస్ హెయిర్ డ్రెసర్తో సంబంధాలు పెట్టుకున్నట్లు వదంతులు విపరీతంగా వచ్చాయి. మిషెల్లీ పఫ్.. జెన్నీఫర్ లోపేజ్, అలిసియా సిల్వర్ స్టోన్ వంటి నటీ నటులకు హెయిర్ డ్రెసర్ గా పనిచేస్తుంది. అయితే, తన భర్తకు మిషెల్లీకి సంబంధం ఉందని గతంలోనే షరాన్ కు తెలిసినా ఆధారాలు లేక పరోక్షంగా మాత్రమే ఓజీని తిడుతుండేది. అయితే, గత వారం పూర్తిగా కనిపించకుండా పోయిన ఓజీ ఓ హోటల్తో మిషెల్లీతో ఉన్నాడని తెలియడంతో ఇక ఆమె తెగదెంపులు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement