
గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనేది ఆమె కళ. అయితే అది పూర్తి కాకుండానే ఆమెకు వివాహం జరిగిపోయింది. అయితే అదృష్టం కొద్ది ఆమెకు అర్ధం చేసుకునే వ్యక్తి భర్తగా వచ్చాడు. తన భార్య కలను సాకారం చేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడితే.. చివరికి కలలో ఊహించని షాక్ ఇచ్చింది ఆ మహిళ. ప్రస్తుతం తన భార్య చేసిన మోసానికి లబోదిబో మంటూ ఆ భర్త గుండెలు బాదుకుంటున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
జాబ్ రాగానే బండారం బయటపడింది
అలోక్ మౌర్య, జ్యోతి మౌర్య ఇద్దరు దంపతులు. అయితే మధ్యతరగతి కావడంతో వారిద్దరూ వివాహం తర్వాత ఆర్థికంగా కష్టనష్టాలను అనుభవించారు. ఏదో ఒకరకంగా బతుకు బండిని ముందుకు సాగిస్తూ వస్తున్నారు. అంతలో జ్యోతి మౌర్య తాను ప్రభుత్వ ఉద్యోగం చేయడం తన కల అని భర్తకు విన్నవించుకుంది. అయితే అలోక్ చేస్తోంది చిన్న ఉద్యోగమే కావడంతో ఇది అంత సులభం కాదని అతనికి తెలుసు. భార్య కలనే తన కల భావించి దాన్ని సాకారం చేసుకునే దిశగా ఆమెను ప్రోత్సహించాడు. అందుకు అలోక్ తనకు వీలైనంత సహాయం చేశాడు.
ఈ క్రమంలోనే ఆమెను ప్రయాగ్‌రాజ్‌లోని మంచి కోచింగ్ సెంటర్‌లో చేర్పించి ఆమె లక్ష్యానికి చేరువయ్యేలా చేశాడు. ఎట్టకేలకు ఆమె 2016లో సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఇక్కడి నుండే అసలు కథ మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక తన అసలు రంగును బయటపెట్టింది ఆ భార్య. తన భార్యకు గొప్ప ఉద్యోగం వచ్చిందని సంతోషించేలోపు ఆమె ఆ భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమె ఎఫైర్ గురించి తెలుసుకున్న అలోక్ తన భార్యకు నచ్చజెప్పేందకు ఎంతగానో ప్రయత్నించాడు.
అయితే ఆమె మాత్రం తన భర్త మాటలు పట్టించుకోకపోగా.. అలోక్‌పై తప్పుడు వరకట్నం కేసు పెట్టి అతడిని అరెస్టు చేయించింది. అలోక్ ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ ఉద్యోగం పోవడంతో.. ఉన్న ఉపాధిని కూడా కోల్పోయాడు. తన భార్యే సర్వస్వంగా బతికిన తనను ఇంత మోసం చేస్తుందని ఊహించలేకపోయానంటూ అలోక్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఇప్పుడు ఆమె తన పై ఆఫీసర్ తో అక్రమ సంబంధం పెట్టుకుని, ఇద్దరూ కలిసి బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతున్నాడు. ఈ భర్త గోడు విన్న నెటిజన్లు.. అతనికి పట్ల సానుభూతి చూపుతూ కామెంట్స్ పెడుతున్నారు.
पति ने बीवी को पढ़ा-लिखाकर बनाया SDM,मैडम ने होमगार्ड कमांडेंट से चलाया अफेयर, हस्बैंड ने दिखाए सबूत
Story- @varnitavajpayee pic.twitter.com/O5i7BwNIoL
— CrimeTak.in (@CrimeTakBrand) June 22, 2023
Comments
Please login to add a commentAdd a comment