ఫేస్‌బుక్ వాడుతున్నాడని ప్రియుడ్ని చంపింది | Hairdresser stabbed boyfriend to death after row over his use of Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ వాడుతున్నాడని ప్రియుడ్ని చంపింది

Published Tue, Feb 23 2016 9:40 AM | Last Updated on Sat, Apr 6 2019 8:51 PM

ఫేస్‌బుక్ వాడుతున్నాడని ప్రియుడ్ని చంపింది - Sakshi

ఫేస్‌బుక్ వాడుతున్నాడని ప్రియుడ్ని చంపింది

లండన్: ఫేస్‌బుక్ వాడకం ప్రాణాల మీదికి తెస్తుందంటే ఏంటో అనుకుంటుంటాం. కానీ ఓ హెయిర్ డ్రెస్సర్ చేసిన పని తెలిస్తే ఇది నిజమే అనిపిస్తుంది. తన బోయ్‌ఫ్రెండ్ ఫేస్‌బుక్ వీపరీతంగా వాడతున్నాడని, దానివల్ల అతడి ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయని భావించి ఆవేశానికి లోనైన ప్రియురాలు.. అతడ్ని హత్య చేసింది. ఈ కేసును విచారించిన కోర్టు నిందితురాలికి 12 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ, ఆ గడువు ముగిసిన తర్వాత పెరోల్‌పై బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది. గతేడాది ఆగస్టులో జరిగిన హత్య ఘటనలో పూర్తి వివరాలిలా ఉన్నాయి.

టెర్రీ మారీ పామర్ అనే యువతి హెయిర్ డ్రెస్సర్ గా పనిచేస్తుండేది. నిరుద్యోగి అయిన ఆమె బోయ్ ఫ్రెండ్ డామన్ సియర్సన్ ఇటీవలే ఓ మొబైల్ ఫోన్ కొన్నాడు. అందులో ఫేస్‌బుక్ చాటింగ్ చేయడం మొదలెట్టాడు. తన అర్ధనగ్న ఫొటోలు కూడా విపరీతంగా పోస్ట్ చేసేవాడు. అలా.. అతడి వాడకం శృతిమించింది. దాంతో బాగా విసిగిప ఓయిన పామర్.. అతడ్ని చంపేయాలని నిర్ణయించుకుంది. గతేడాది ఆగస్టు13వ తేదీన బోయ్ ఫ్రెండ్ సియర్సన్‌ను గుండెల్లో కత్తితో పలు పోట్లు పొడిచి హత్యచేసింది. ఆ వెంటనే షాక్ నుంచి తేరుకుని స్వయంగా తానే అత్యవసర సేవల నంబర్ 999కు కాల్ చేసింది. తన లవర్ పొరపాటున కత్తితో పొడుచుకుని గాయపడ్డాడని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

ఆరు నెలల విచారణ తర్వాత పోలీసుల దర్యాప్తులో నిజాలు ఒక్కక్కటిగా బయటపడ్డాయి. బోయ్ ఫ్రెండ్ లేకపోవడంతో తనకు చాలా బోరింగ్‌గా ఉందని ఫేస్ బుక్ లో ఓ సందేశాన్ని పంపిన ఆమె... సియర్సన్ వ్యవహారం నచ్చకనే అతడ్ని చంపేశానంటూ మరో పోస్ట్‌లో పేర్కొంది. కొత్త ఫోన్ కొన్న తర్వాక ఫేస్‌బుక్ అతిగా వాడటం, కొత్త స్నేహాలు పెంచుకోవడమే సియర్సన్ మృతికి కారణమయ్యాయని పోలీసులు వివరించారు. తనను వదిలించుకోవాలని ప్రయత్నించాడని, వేరొక యువతిలో సన్నిహితంగా ఉంటున్నాడని భావించి ప్రియుడ్ని హత్యచేసినట్లుగా పామర్ కోర్టులో చెప్పింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement