మనిషిగా, మంచిగా బతకలేను..అందుకే వెళ్లిపోతున్నా: టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌ | Turkish influencer Kubra Aykut who married herself passed away at 26 | Sakshi
Sakshi News home page

మనిషిగా, మంచిగా బతకలేను..అందుకే వెళ్లిపోతున్నా: టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌

Published Mon, Sep 30 2024 3:27 PM | Last Updated on Mon, Sep 30 2024 4:43 PM

Turkish influencer Kubra Aykut  who married herself passed away at 26

"వెడ్డింగ్ విత్ ఎ గ్రూమ్" అంటూ తనను తాను పెళ్లి చేసుకున్న టిక్‌టాక్ స్టార్ కుబ్రా అయ్‌కుట్ (Kubra Aykut) అనూహ్యంగా ప్రాణాలు  విడిచింది. టర్కీలోని తన అపార్ట్‌మెంట్ భవనంలోని ఐదో అంతస్తు దూకి ఆత్మహత్యకు పాల్పడటం సోషల్‌మీడియ  ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.  26 ఏళ్ల ‘సోలోగామి’ ఫేమ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయుకుట్‌ 2023లో విలాసవంతమైన వివాహ వేడుక, వీడియో ఫోటోలతో  ఇంటర్నెట్‌లోఅనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. ఇపుడు తన ఆకస్మిక మరణంతో కూడా అనేక  ప్రశ్నల్ని మిగిల్చి వెళ్లిపోయింది .

స్థానిక మీడియా నివేదికల  ప్రకారం  సెప్టెంబర్ 23న  ఆమె చనిపోయింది.   టిక్‌టాక్ వీడియోలో, ఆమె ఆత్మహత్యకు కొద్దిసేపటి ముందు, కుబ్రా తన ఇంటిని శుభ్రం చేస్తూ కనిపించడంతో ఈ ఘటన ప్రమాదమా లేక ఆత్మహత్యా అనే చర్చకు దారి తీసింది. అయితే సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.టిక్‌టాక్‌లో 10 లక్షలకుపైగా ఫాలోవర్లు,ఇన్‌స్టాగ్రామ్‌లోరెండు లక్షలకుపైగా ఫాలోవర్లున్నారు. 

 సూసైడ్‌ నోట్‌
"నేను నా ఇష్టపూర్వంకంగానే దూకాను. ఎందుకంటే నాకు ఇక జీవించాలని లేదు. ఫిస్టిక్‌ని బాగా చూసుకోండి. నేను నా జీవితంలో అందరికీ మంచిదాన్నే, ఇక మంచిగా ఉండలేను. మంచిగా బతకడం వల్లన నాకేమీ ఒరగలేదు. స్వార్థం ఉంటేనే, సంతోషంగా ఉంటారు చాలా రోజులుగా కష్టపడుతున్నా ఎవరూ గమనించలేదు.. నన్ను నేను ప్రేమించానుకుంటూ వెళ్లిపోతున్నాను. ఒక్క సారి నన్ను క్షమించండి’’  

(హరివరాసనం : చిన్నారి విష్ణుప్రియ నృత్యాభినయం, వీడియో వైరల్‌)

 

అనూహ్యంగా బరువు తగ్గడంపై ఆమె బాగా ఆందోళనలో పడిన్నట్టు తెలుస్తోంది. మరణానికి కొన్ని గంటల ముందు,  సోషల్ మీడియా  ఇలా పోస్ట్‌ చేసింది "నేను నా శక్తిని సేకరించాను, కానీ నేను బరువు పెరగడం లేదు. ఈ రోజు నేను 44 కిలోగ్రాములకు పడిపోయాను, నేను ప్రతిరోజూ ఒక కిలోగ్రాము తగ్గుతాను. నేను ఏమి చేయాలో నాకు తెలియదు; నేను అత్యవసరంగా బరువు పెరగాలి”. గత కొన్నిరోజులుగా వస్తున్న ఇలాంటి పోస్ట్‌లపై అనుచరులు  కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వారి భయాలను నిజం చేస్తూ ఆమె  తీసుకున్న కఠిన నిర్ణయం ఫ్యాన్స్‌ను విషాదంలో ముంచేసింది.

ఇదీ చదవండి: చదరంగం ఎత్తులే కాదు, డ్యాన్స్‌ స్టెప్పుల్లోనూ మనోడు తోపు, వైరల్‌ వీడియో


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement