ఎన్నాళ్లయిందో; యజమానిని హగ్‌ చేసుకున్న ఒంటె | Viral Video: Camel Hugging Human | Sakshi
Sakshi News home page

వైరల్‌: ఇవి కూడా ప్రేమను చూపిస్తాయి

Published Sun, Dec 29 2019 12:08 PM | Last Updated on Sun, Dec 29 2019 12:11 PM

Viral Video: Camel Hugging Human - Sakshi

ఆత్మీయ ఆలింగనం.. బాధల్ని మరిచిపోయేలా చేస్తుంది. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’లో మెగాస్టార్‌ చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే అది కేవలం మనుషులకే కాదు.. జంతువులకూ వర్తిస్తుందని నిరూపించిందో ఘటన. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒంటె యజమాని కొన్ని రోజులుగా దాని దగ్గరకు వెళ్లలేకపోయాడు. దీంతో ఒంటె ఎంతగానో బెంగపెట్టేసుకుంది. ఆ తర్వాత యజమాని తిరిగి ఒంటె దగ్గరకు వెళ్లగానే ఒంటె ఒక్కసారిగా అతన్ని చుట్టుకుపోయింది. తన మెడతో ఆ వ్యక్తిని చుట్టేసి ఆప్యాయంగా హత్తుకుంది. ఈ వీడియోను భారత అటవీశాఖ అధికారి సుశాంత్‌ నంద సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

‘మనం ఏదైతే పంచుతామో అది మాత్రమే మనకు దక్కుతుంది’ అని క్యాప్షన్‌ జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. గతంలోనూ దాదాపు ఇలాంటి ఘటనే సౌదీ అరేబియాలో జరిగింది. ఓ వ్యక్తి తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఒంటెను అమ్మేశాడు. కొంత కాలానికి ఆ మూగ జంతువును చూడాలని మనసు తహతహలాడటంతో ఒంటెను కొనుగోలు చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లాడు. అక్కడే దీనంగా ఉన్న ఒంటె అతన్ని చూడగానే వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లుగా అతన్ని సమీపించి హత్తుకుని ఆత్మీయ అనురాగాన్ని కురిపించింది. కాగా ఈ ఘటనలతో పెద్ద జంతువులు కూడా ప్రేమను చూపించగలవని మరోసారి రుజువైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement