ఘోరం: విలవిల్లాడిన ఒంటె | Speeding Car Hits Camel In Rajasthan | Sakshi
Sakshi News home page

ఘోరం: విలవిల్లాడిన ఒంటె

Published Wed, Aug 8 2018 4:54 PM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

Speeding Car Hits Camel In Rajasthan - Sakshi

బికనీర్‌, రాజస్థాన్‌ : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గత నెల 9వ తేదీన బికనీర్‌లో రోడ్డు దాటుతున్న ఒంటెను కారు ఢీ కొట్టింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఒంటె కారులో ఇరుక్కుపోయింది. కారు టాప్‌ విండో నుంచి బయటపడేందుకు ఒంటె యత్నించడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.

కాళ్లను అదేపనిగా ఆడిస్తుండటం వల్ల స్థానికులు దాన్ని బయటకు లాగేందుకు యత్నించలేదు. దాదాపు 4 గంటల పాటు అలానే నరకయాతన పడిన ఒంటె కాళ్ల ఆడించడం ఆపడంతో కొందరు దాన్ని బయటకు లాగి రక్షించారు. గాయాలపాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కారును అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, ఒంటెకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement