ఒంటెకు ముద్దిచ్చిన కోడలు.. ఒంటికాలిపై లేచిన అత్త | Daughter-in-law attacked for kissing camel in Saudi Arabia | Sakshi
Sakshi News home page

ఒంటెకు ముద్దిచ్చిన కోడలు.. ఒంటికాలిపై లేచిన అత్త

Published Wed, Dec 16 2015 5:21 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM

ఒంటెకు ముద్దిచ్చిన కోడలు.. ఒంటికాలిపై లేచిన అత్త

ఒంటెకు ముద్దిచ్చిన కోడలు.. ఒంటికాలిపై లేచిన అత్త

మనామా: సౌదీ అరేబియాలోని ఒక కుటుంబంలో ఓ ఒంటె చిచ్చుపెట్టింది. పచ్చగా ఉన్న ఓ భార్యభర్తల కాపురంలో భగ్గుమనేమంటలు రేగేలా చేసింది. తన కోడలు ఓ ఒంటెను ముద్దు పెట్టుకుందని ఆమెకు వెంటనే విడాకులు ఇవ్వాలని ఓ అత్తగారు తన కుమారుడిపై పెద్దపెద్దమాటలతో చిందులేసింది. ప్రారంభంలో ఆ విషయంలో వివాదంగా మారినా చివరకు సుఖాంతమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే సౌదీ అరెబియాకు చెందిన ఇద్దరు భార్యభర్తల్లో భార్య ఈ మధ్య ఓ ఒంటెకు ప్రేమగా ముద్దుపెట్టింది.

అది చూసిన అత్తగారు ఒంటికాలుపై లేస్తూ మతాన్ని అవమానించావని, సామాజిక కట్టుబాట్లు దాటావని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా వెంటనే ఆమెకు విడాకులు ఇవ్వాల్సిందిగా తన కొడుకుపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీనిపై ఒంటెను ముద్దు పెట్టుకున్న ఆ కోడలు స్పందిస్తూ తాను ఒంటెను ముద్దుపెట్టుకోవడం వెనుక వేరే ఉద్దేశం లేదంది.

కేవలం అమాయమైన జంతుప్రేమమాత్రమే ఉందని, తన అత్తగారు అసలు దాడి చేయడానికి అసలు కారణం అది కాదని, తనకు ఇప్పటి వరకు పిల్లలు లేరనే ఆగ్రహంతోనే ఆమె అలా అన్నారని చెప్పింది. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఆమె పుట్టింటికి కూడా వెళ్లిపోయింది. అయితే, తన భార్యను అర్ధం చేసుకున్న భర్త ఆమె తప్పే లేదని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. తల్లి ఒక గదిలో ఉంటుండగా వారిద్దరు వేరే గదిలో ఉంటున్నారు. అయితే, తన భర్తతో ప్రశాంతంగా ఉండాలనే తానెప్పుడూ కోరుకుంటానని ఆ కోడలు చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement