ఈ రోజుల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోతున్నాం. క్షణాల్లో మనకు నచ్చిన ప్రదేశానికి చేరిపోతున్నాం. జేబు నిండా డబ్బులు ఉంటే చాలు పని ఈజీ. ఇంతవరకు కారు, బైక్ రైడ్‌లు చూసుంటారు. కానీ ఈ మహిళ బుక్ చేసిన రైడ్ లాంటిది దొరకడం మాత్రం కష్టం. ఔను ఇది కొంచెం కష్టం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఇద్దరు మహిళలు ఎడారిలో చిక్కుకుపోయి ఉంటారు. వారి వాహనం పాడవ్వడంతో ఉబర్ యాప్‌తో రైడ్ బుక్ చేద్దామని భావిస్తారు. అందులోని ఆప్షన్స్‌లో ఊహకందని రైడ్ కనిపించే సరికి షాకవ్వుతారు. సరే ఒంటె రైడ్ బుక్ చేద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అని భావిస్తారు. ఇంతలో ఉబర్ ఒంటె రైడ్ రావడం జరుగుతుంది. అది చూసి ఒక మహిళ ఆశ్చర్యపోతూ..ఇది ఉబెర్ ఒంటె రైడేనా అని అడుగుతుంది.
దానికి ఆ వ్యక్తి తనను ఉబెర్ ఒంటె డ్రైవర్‌గా పరిచయం చేసుకోవడంతో నోట నుంచి మాట రాదు. సదరు వ్యక్తి తాము ఉబెర్ ఒంటెను నడుపుతున్నామని, ఇలా ఎడారిలో దారితప్పిన వ్యక్తులకు సహయం చేయడమే తమ డ్యూటీ అని చెప్పారు. తాము దారి తప్పడంతో ఒంటెని ఆర్డర్ చేసినట్లు తెలిపింది సదరు మహిళ. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి దుబాయ్‌లో మాత్రమే ఇలా ఒంటెని ఆర్డర్ చేయగలరు, ఇదేమి పెద్ద విషయం కాదని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: మరమరాల చాట్ అమ్ముతూ బ్రిటిష్ వ్యక్తి..!)
Comments
Please login to add a commentAdd a comment