
త్వరలోనే రూ.10, రూ.500 నోట్లు విడుదల
ముంబై: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం చేసిన మహాత్మాగాంధీ సిరీస్‌తో నూతన రూ.10, రూ.500 నోట్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని ఆర్‌బీఐ స్వయంగా ప్రకటించింది. రూ.10, రూ.500 నోట్ల డిజైన్ గత సిరీస్ నోట్ల మాదిరే ఉంటుందని స్పష్టం చేసింది.
గతంలో ఆర్‌బీఐ జారీ చేసిన రూ.10 నోట్లు అన్నీ చెల్లుతాయని పేర్కొంది. అలాగే, మహాత్మాగాంధీ చిత్రంలో గతంలో జారీ చేసిన రూ.500 నోట్ల చెల్లింపు కొనసాగుతుందని వెల్లడించింది. గవర్నర్ మల్హోత్రా సంతకం చేసిన కొత్త రూ.100, రూ.200 నోట్లను విడుదల చేయనున్నట్టు ఆర్‌బీఐ గత నెలలో ప్రకటించడం గమనార్హం. ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంతదాస్ స్థానంలో మల్హోత్రా 2024 డిసెంబర్‌లో బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే.