బహ్రయిచ్: యూపీలోని బహ్రయిచ్‌లో తోడేళ్ల భీభత్సం కాస్త అదుపులోకి వచ్చింది. తాజాగా అటవీశాఖ అధికారులు ఐదో తోడేలును కూడా పట్టుకున్నారు. ఆ తోడేలును రెస్క్యూ షెల్టర్‌కు తరలిస్తున్నారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకూ మొత్తం ఐదు నరమాంసభక్షక తోడేళ్లను పట్టుకోగా, ఒక తోడేలు ఇంకా స్వేచ్చగా తిరుగుతోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పుడు పట్టుకున్న తోడేలు బహ్రయిచ్‌లోని హర్బక్ష్ సింగ్ పూర్వా గ్రామంలో అటవీశాఖ అధికారుల కంటబడింది. అటవీశాఖ అధికారులు గాలిస్తున్న తోడేళ్లలో ఇదొకటని తెలుస్తోంది.
గత కొంతకాలంగా బహ్రయిచ్,సీతాపూర్‌లలో తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఐదేళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సీతాపూర్‌లో కూడా తోడేలు దాడులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఆరుగురిపై తోడేలు దాడి చేసింది. తోడేలు బారిన పడిన ఒక వృద్ధురాలు మృతి చెందింది. బహ్రయిచ్‌లో తోడేళ్ల దాడిలో ఏడుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి. 35కి పైగా గ్రామాల్లో తోడేళ్ల భయంతో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. గ్రామంలో దాదాపు డజను తోడేళ్లు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే వీటి సంఖ్య చాలా తక్కువేనని అటవీశాఖ అధికారులు అంటున్నారు.
#WATCH | Bahraich, Uttar Pradesh: The Forest Department captured the fifth wolf and is now taking it to a rescue shelter of the Forest Department.
So far 5 wolves have been caught. One more wolf remains to be caught. pic.twitter.com/euCm2tKaAr— ANI (@ANI) September 10, 2024
Comments
Please login to add a commentAdd a comment