బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల భీభత్సం ఆగడం లేదు. అటవీశాఖ అధికారులు ఐదవ తోడేలును పట్టుకున్న తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన ఆరవ తోడేలు ఆహారం కోసం నిరంతరం దాడులు చేస్తోంది. తాజాగా ఇంటి టెర్రస్‌పై నిద్రిస్తున్న 13 ఏళ్ల అర్మాన్ అలీపై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో బాలుడు గాయపడ్డాడు. బాధిత బాలునికి బహ్రాయిచ్‌లోని మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు.
అటవీ శాఖ అన్ని రకాలుగా తోడేళ్లను పట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. మహసీ ప్రాంతంలో తోడేళ్ల దాడుల కారణంగా సుమారు 110 గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మహసీ, శివపూర్‌లోని 110 గ్రామాల్లో అటవీశాఖ, పోలీసులు, పీఎస్సీ సిబ్బంది, జిల్లా ఉద్యోగులు వంతుల వారీగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ తోడేళ్ల దాడులు ఆగడం లేదు.
బహ్రాయిచ్‌లోని మహసీ తహసీల్‌లో గత 200 రోజులుగా నరమాంస భక్షక తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. తోడేళ్లు ఇప్పటివరకు 60 మందిని గాయపరిచాయి. ఆరు తోడేళ్లు దాడులకు దిగుతున్నాయని గుర్తించామని, వాటిలో ఐదు తోడేళ్లను పట్టుకున్నామని అటవీ శాఖ పేర్కొంది. ఇక ఒక తోడేలు మాత్రమే మిగిలి ఉందని, దానిని పట్టుకోవడానికి అన్నిరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. అయితే అటవీ శాఖ సమాధానానికి గ్రామస్తులు సంతృప్తి చెందడం లేదు.
ఇది కూడా చదవండి: ట్రంప్‌పై కాల్పులు జరిపిన ర్యాన్ వెస్లీ రౌత్ ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment