
కోయిల్‌కొండ (నారాయణపేట): మండలం లోని కోత్లాబాద్ గ్రామ సమీపంలోని కొయ్యగుండుగుట్టలో రైతులు అడివి జంతువుల కోసం వేసిన వలలో కొండచిలువ చిక్కింది. శుక్రవారం విషయం తెలుసుకున్న రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు సంజీవరావు, రాములునాయక్, శ్రీనివాస్ కొండచిలువను వల నుంచి వేరు చేసి పట్టుకున్నారు.
కొండచిలువు సుమారు 8 అడుగుల పొడవు 10 కిలోల బరువు ఉందని అధికారులు తెలిపారు. కొండ చిలువును మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రికి తరలించి చికిత్స నిర్వహిస్తామన్నారు. రైతులు అడవి జంతువుల బారినుంచి తమ పంటలను కాపాడుకొనేందుకు వలలు వేస్తుంటారన్నారు. ఈ నేపథ్యంలోనే వేసిన వలకు కొండచిలువ చిక్కిందన్నారు.