
వధశాలకు తరలిస్తున్న దూడలను పట్టివేత
వధశాలకు అక్రమంగా తరలిస్తున్న దూడలను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... మండల పరిధిలోని అవుశాపూర్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు.రెండు డీసీఎంలను ఆపారు.
ఘట్‌కేసర్: వధశాలకు అక్రమంగా తరలిస్తున్న దూడలను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... మండల పరిధిలోని అవుశాపూర్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రెండు డీసీఎంలను ఆపారు. ఇదేంటని ప్రశ్నించగా ఆ వాహనాల్లో 15 దూడలను నగరంలోని అంబర్‌పేట్ వధశాలకు తరలిస్తున్నట్లు దాని డ్రైవర్లు బానోతు కుమార్, బానోతు మోహన్ తెలిపారు. డ్రైవర్లు నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం గోపతండాకు చెందిన వారని చెప్పారు. వరంగల్ జిల్లా లింగాల ఘణాపూర్ మండలం నవాబుపేట్ గ్రామంలోని సంత నుంచి 15 దూడలను వ్యాపారులు కొనుగోలు చేశారు. వాటిని వాహనాల్లో నగరానికి తరలించడానికి డ్రైవర్లతో బేరం కుదుర్చుకున్నారని వివరించారు. దూడలను, వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దూడలను గోశాలకు పంపినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.