ఆయుధాలతో పట్టుబడిన చైనా నౌక
Published Sun, Oct 13 2013 3:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM
తమిళనాడులో ఇటీవల కాలంలో తీవ్రవాదుల కదలికలు అధికమయ్యూరుు. కరుడుగట్టిన తీవ్రవాదులు వారం క్రితం పట్టుబడ్డారు. ఈ ఘటన మరువక ముందే ఆయుధాలతో చైనా నౌక పట్టుబడడం కలకలం రేపింది. దీనిపై విచారణ జరిపేందుకు అధికారులు రంగంలోకి దిగారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:కసబ్ తదితర ఉగ్రవాదులు ముంబయిలో దాడులకు పాల్పడేందుకు సీమెన్‌గార్డు అనే చైనా నౌక ద్వారా నగరంలోకి ప్రవేశించినట్లు అప్పట్లో విచారణలో తేలింది. దీంతో చైనా నౌకల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత్‌లోని హార్బర్లకు కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యూరుు. సీమెన్‌గార్డు చైనా నౌక మూడు నెలల క్రితం భారత్ చేరుకుంది. దీనిని దేశ సరిహద్దుల్లోనే అధికారులు తనిఖీ చేయగా అప్పట్లో అనుమానాస్పద వస్తువులు లభించలేదు. అయినా చైనా నౌకలను హార్బర్ అధికారులు అనుమానిస్తూనే ఉన్నారు. మూడు నెలల క్రితం తనిఖీకి గురైన ఇదే చైనా నౌక శుక్రవారం అర్ధరాత్రి సమయంలో తూత్తుకూడి హార్బర్‌ను సమీపించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో నౌకను సముద్రంలోనే నిలిపేయూలంటూ తూత్తుకూడి అధికారులకు సమాచారం అందింది. అప్రమత్తమైన అధికారులు ‘నాయకిదేవీ’ అనే యుద్ధనౌకలో వేగంగా ఎదురెళ్లి సీమెన్‌గార్డులో తనిఖీలు ప్రారంభించారు. అనేక ఆయుధాలు నౌకలో దాచి ఉంచడాన్ని అధికారు లు గుర్తించారు. కేంద్రం ఆదేశాల మేరకు తూత్తుకూడి హార్బర్‌కు 10 మైళ్ల దూరంలో నౌకను నిలిపేశారు. నౌక చుట్టూ గస్తీ నౌకలు, మరబోట్లు ఉంచారు.
అమెరికా నుంచి రాక!
చైనాలో రిజిస్టరైన ఈ నౌక ప్రస్తుతం అమెరికా నుంచి తూత్తుకూడి చేరుకున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. సముద్రపు దొంగల బారి నుంచి కాపాడుకునేందుకే ఆయుధాలు సమకూర్చుకున్నట్లు చైనా నౌకలోని సిబ్బంది సమర్థించుకున్నారు. ప్రపంచంలోని అన్ని హార్బర్లకూ తిరిగే విధంగా పర్మిట్లు పొందామని వివరించారు. అరుుతే చైనా నౌక వ్యవహారం రాష్ట్రం లో కలకలం రేపింది. చెన్నై తదితర జిల్లాల్లో విధ్వం సాలకు పాల్పడేందుకు చైనా నుంచి ఉగ్రవాదులు మరోసారి ప్రవేశించే ప్రయత్నం చేశారా అని అధికారులు అనుమానిస్తున్నారు. ముంబయి దాడుల నేపథ్యంలో ఏ అంశాన్నీ సులభంగా తీసుకోరాదని భావి స్తున్నారు. క్షుణ్ణంగా విచారణ జరిపి ఒక నిర్ధారణకు రానిదే సీమెన్‌గార్డు నౌకను విడిచిపెట్టరాదని కేంద్రహోంశాఖ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేం ద్రం ఆదేశించే వరకు సీమెన్‌గార్డు చుట్టూ బందోబస్తు కొనసాగిస్తామని తూత్తుకూడి హార్బర్ అధికారులు స్పష్టం చేశారు.
Advertisement
Advertisement