
పార్కులో అడవిపంది పట్టివేత
హైదరాబాద్: ఎక్కడి నుంచి వచ్చిందో వనస్థలిపురంలోని జనావాసాల్లోకి శుక్రవారం ఓ అడవిపంది ప్రవేశించి అందరినీ హడలెత్తించింది. స్థానిక ఎల్‌ఐజీ పార్కులో సంచరిస్తున్న అడవిపందిని గమనించిన స్థానికులు దానిని పట్టుకోవటానికి ప్రయత్నించారు. దీంతో అది బెదిరిపోయి నలుగురిని గాయపరిచింది. చివరికి వారు వలలు వేసి పట్టుకుని బంధించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించటంతో వారు వచ్చిన పందిని స్వాధీనం చేసుకున్నారు.