wild boar
-
యాదాద్రి టెంపుల్ క్యూ కాంప్లెక్స్‌లో అడవి పంది హల్చల్
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఓ అడవి పంది హల్చల్ చేసింది. యాద్రాది క్యూ కాంప్లెక్స్‌లోకి దూరి పరుగులు తీసింది. ఈ క్రమంలోనే క్యూ కాంప్లెక్స్ భవనంపై నుంచి పడిపోయి పంది చనిపోయింది. అనంతరం, అడవి పంది కళేబరాన్ని ఎస్పీఎఫ్ సిబ్బంది తొలగించారు. కాగా, ఆలయ ప్రాంగణంలోకి పంది రావడంతో అర్చకులు ఆలయంలో పుణ్యవచనం చేపట్టనున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. మంత్రి ఎర్రబెల్లికి చేదు అనుభవం -
యాదాద్రి క్యూ కాంప్లెక్స్‌లో అడవి పంది పరుగులు
-
ఈ బంధమేనాటిదో!
మల్కన్‌గిరి(భువనేశ్వర్): తన ఆనందం, అవసరాల కోసం సాధు జంతువులను మచ్చిక చేసుకోవడం వేల సంవత్సరాల క్రితమే మనిషి ప్రారంభించాడు. కొందరైతే అడవుల్లో ఉన్న వన్య ప్రాణులకు సైతం ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చి, యజమానిలా వాటితో ఆదాయం పొందుతుంటారు. మరికొందరు రాక్షసానందం కోసం జీవాల ప్రాణాలు హరిస్తుంటారు. మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి చెందని మహేంద్ర మాత్రం పైవాటికి భిన్నం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వన్యప్రాణికి ఆశ్రయం కల్పించడంతో పాటు ఆలనాపాలన చూస్తున్నారు. జీవం కూడా నిన్ను వదలి పోలేనంటూ గత 20 ఏళ్లుగా ఆయనను విడిచి పెట్టడం లేదు. వివరాల్లోకి వెళ్తే... 20 ఏళ్ల క్రితం వచ్చిన వరదలో మల్కన్‌గిరిలోని జగన్నాథ్ మందిరం సమీపంలో నివాసం ఉంటున్న మహేంద్ర ఇంటికి సమీప కాలువలో అడవిపంది పిల్ల కొట్టుకు వచ్చింది. చలికి గజగజా వణుకుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వరాహాన్ని గమనించిన ఆయన.. ఇంటికి తీసుకు వచ్చి, ఆహారం అందించాడు. రక్షణ కల్పించి, అక్కడే ఆశ్రయం కల్పించాడు. అడవిలో వదిలి పెట్టినా.. వరాహం కొద్దిగా కోలుకున్న అనంతరం మహేంద్ర అటవీశాఖ అధికారులకు అప్పగించేందుకు ప్రయత్నించాడు. అయితే చిన్న పిల్ల కావడంతో అతనే వద్దే క్షేమంగా ఉంటుందని భావించిన సిబ్బంది.. తిరిగి అడవిలోకి పంపించేందుకు నిరాకరించారు. దీంతో అప్పటి నుంచి తన ఇంట్లో మనిషిలాగే వన్యప్రాణిని పెంచి, పెద్ద చేశాడు. దానికి రాజు అని పేరు కూడా పెట్టాడు. ఈ ఇద్దరి బంధం ఏనాటిదో గానీ మహేంద్ర ఎంత చెబితే అంతే అన్నట్లుగా వరాహం తయారైంది. రెండు దఫాలు అడవిలో వదిలినా, తిరిగి మహేంద్ర ఇంటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో జీవిపై మరింత ప్రేమ పెంచుకొని, తనకు ఉన్న దాంట్లోనే రాజుని కూడా పోషిస్తున్నాడు. మనుషుల్లాగే అన్నం, బిస్కెట్లు, రొట్టె, చపాతీ తదితర పదార్థాలను ఆహారంగా అందిస్తున్నాడు. ఈ 20 ఏళ్లలో ఎవరికీ ఎలాంటి హానీ చెయ్యలేదని, వీధిలో పిల్లలు కూడా రాజుతో కాసేప గడిపేందుకు ఆసక్తి చూపుతారని మహేంద్ర చొప్పుకొచ్చారు. ఆహారం కోసం అడవికి వెళ్లినా.. సాయంత్రం తిరిగి వస్తుందని, రాత్రి సమయంలోనూ తనను విడిచి ఉండదని వన్యప్రాణి ప్రేమను ఆయన వివరించాడు. చదవండి: ప్రేమ పెళ్లి.. నా భర్త దగ్గరికి వెళ్లిపోతా.. ఇంతలోనే ఘోరం.. -
ట్రైన్లో అడవి పంది: భళే పరుగులు తీస్తుందే!!
హాంకాంగ్: సాధారణంగా పక్షులు దారి తప్పి వచ్చి బస్సులు, రైళ్లలో చిక్కుకున్న సందర్భాలను చూశాం. మరికొన్ని చోట్ల కోతులు సైతం రైళ్లలోకి దూకి అల్లరి చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ అడవి పంది రైళులోకి వచ్చి.. బోగీ మొత్తం అటూ ఇటూ పరుగులు తీసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హాంకాంగ్ ద్వీపంలోని క్వారీ బే స్టేషన్లో టికెట్ కౌంటర్ వద్ద ఓ పంది పిల్ల జారి పడిపోయి ఓ ట్రైన్‌లోకి చేరుకుంది. దానికి బయటకు ఎలా వెల్లాలో తెలియక ట్రైన్ బోగీలో అటూ ఇటూ పరుగులు తీసింది. దీంతో రైలు ప్రయాణికుల ద్వారా సమాచారం అందుకున్న ట్రైన్ సిబ్బంది ఆ చిన్న అడవి పందిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ, ఆ పంది వేగంగా వారికి చిక్కకుండా పరుగు తీసింది. ఇక కొన్ని స్టాప్ల తర్వాత పంది పిల్ల మరో రైలులోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఆ ట్రైన్ డిపో చేరుకున్న తర్వాత సిబ్బంది జంతు పరిరక్షణ అధికారుల సాయంతో పంది పిల్లను పట్టుకొని అడవిలోకి వదిలేశారు. పలు ఆకాశహర్మ్యాలు ఉండే హాంకాంగ్‌లో కూడా పర్యతాలు, ఉద్యానవనాలు అధికంగానే ఉన్నాయి. అయితే వాటిలో ఈ అడవి పందులు సంచరిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ వీడియోను హాంకాంగ్ వైల్డ్ బోర్ కాన్సెర్న్ అనే ఫేస్బుక్ ఖాతా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇప్పటివరకు రైళ్లలో పక్షులు రావడామే చూశాం. ఇప్పడు అడవి పంది కూడా!!’, ‘వావ్..! రైలులో ఆ అడవి పంది భళే పరుగులు తీస్తుందే!’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: బెంగాల్ టైగర్: అటు కాదురా బాబూ.. ఇటూ.. -
అడవి పంపిన బిడ్డ
తప్పిపోయిన కొడుకు తిరిగొస్తే ఎంత సంతోషంగా ఉంటుందో కుంతల కుమారికి ఇప్పుడు అంతకు మించిన సంతోషంగా ఉంది. రెండేళ్ల క్రితం అరణ్యంలో కనిపించిన అడవి పంది కూనను ఇంటికి తెచ్చి పెంచుకుందామె. వారం క్రితం అటవీ అధికారులు వచ్చి ఆ పందిని అలా పెంచుకోకూడదని అడవిలో వదిలి వచ్చారు. ఆ తల్లి ఆ బిడ్డ కోసం ఏడ్చింది. ఆ బిడ్డ ఆ తల్లిని వెతుక్కుంటూ బయలుదేరింది. రోమాంచితమైన ఈ అనురాగబంధపు కథ ఒడిసాలో జరిగి ప్రచారంలో ఉంది. మీడియాకు భావోద్వేగాలు ఉండవు అని అంటారుగాని కుంతల కుమారి కోసం మీడియా కూడా కన్నీరు పెట్టినంత పని చేసింది. వారం క్రితం ఒడిసాలోని గంజాం జిల్లాలో పురుషోత్తంపూర్ అనే చిన్న పల్లెలో నివసించే కుంతల కుమారి ఆక్రందనలు విని మీడియా కూడా అక్కడకు చేరుకుంది. ‘నా బిడ్డను నా నుంచి దూరం చేశారు. నాకు న్యాయం చేయండి’ అని వారి ముందు ఏడ్చింది కుంతల కుమారి. ఆ బిడ్డ పేరు ‘ధుడ’ (పాలు). అది ఒక అడవి పంది. ‘నా సొంతబిడ్డ కంటే దానిని ఎక్కువ సాక్కున్నాను’ అని చెప్పింది కుంతల కుమారి. దేవుడు పంపిన కొడుకు రెండేళ్ల క్రితం కుంతల కుమారి కూతురు జబ్బు చేసి చనిపోయింది. అడవిలో ఆ కుమార్తె అంతిమ సంస్కారాలు పూర్తి చేసి విషాదంతో తిరిగి వస్తున్న కుంతల కుమారికి తల్లి నుంచి తప్పిపోయి భీతిల్లి తిరుగుతున్న రోజుల వయసున్న అడవి పంది పిల్ల కనిపించింది. ‘అది నన్ను చూడగానే నా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది. దానిని చూసి నేను నా కూతురు చనిపోయిందని బాధ పడాలా... ఈ పంది పిల్ల నా దగ్గరకు వచ్చిందని ఆనంద పడాలా తెలియలేదు. మొత్తం మీద ఆ కూన నాకు దేవుడు పంపిన కొడుకు అనుకున్నాను’ అంటుంది కుంతల కుమారి. ఆమెకు ఇంకో కూతురు కూడా ఉంది. తల్లీ కూతుళ్లు కలిసి ఆ పంది పిల్లకు ‘ధుడ’ అని పేరు పెట్టి పెంచసాగారు. అప్పటినుంచి ఆ అడవి పంది ఇంటి పందిగా మారిపోయింది. కుంతల కుమారి పిలిస్తే పరిగెత్తుకుని వస్తుంది. ఇంటి ముందే ఉంటుంది. అడవి పందితో ఆడుకుంటున్న కుంతలకుమారి కుమార్తె అటవీ అధికారుల ప్రవేశం అయితే ఒడిసా వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అడవి పందిని పెంచుకోవడం నేరం. అందువల్ల అటవీ అధికారుల ఇన్నాళ్లు ఊరికే ఉండి వారం క్రితం కుంతల కుమారి ఇంటికి వచ్చి ఆమెను హెచ్చరించి ‘ధుడ’ను అడవిలో విడుస్తామని తీసుకెళ్లి విడిచి వచ్చారు. పురుషోత్తం పూర్‌కు దగ్గరలోనే టెల్కొయ్ అభయారణ్యం ఉంది. అధికారులు దానిని తీసుకెళ్లి ఆ అరణ్యంలో విడిచి పెట్టారు. ఇది జరిగిన వెంటనే కుంతల కుమారి లబలబమని నోరుకొట్టుకొని తీవ్రంగా ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ సమాచారం అందుకున్న మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. సోషల్ మీడియాలో కూడా దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘అటవీ అధికారులు చేసింది తప్పు’ అని అందరూ తిట్టిపోశారు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అడవి లో ధుడా తప్పిపోయింది. దాని ఆహారం ఎలా? ‘ధుడా ఇంటి తిండికి అలవాటు పడింది. అది అడవిలో బతకలేదు’ అని కుంతల కుమారి అంటే ‘అడవి పందులకు తాము అడవిలో ఎలా బతకాలో తెలుసు’ అని అధికారులు అన్నారు. కాని అది నిజం కాదు. అడవిలో పడ్డ ధుడా తిండి లేక నీరసించింది. అడవి కొత్త కావడంతో భీతిల్లిపోయింది. ‘ధుడా’ అని పేరు పిలుస్తూ వెతుక్కుంటూ తిరుగుతున్న కుంతలను చూసి గ్రామస్తులు కూడా ధుడాను వెతికారు. చివరకు అది 25 కిలోమీటర్ల దూరంలో కనిపించింది. వెంటనే కుంతల ఆగమేఘాల మీద వెళ్లి పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి తల్లి దగ్గర సేదదీరింది. కుంతల, కుంతల కుమార్తె ధుడాను ఇంటికి తెచ్చుకున్నారు. ‘అది అడవిలో తిండి సంపాదించుకోలేకపోయింది. దాని సంగతి ఆలోచిస్తాం’ అని అటవీ అధికారులు ఇప్పుడు నత్తులు కొడుతున్నారు. వారం రోజుల ఎడబాటు వల్ల భీతిల్లిపోయిన ధుడా, కుంతల ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండటం లేదు. ‘పడుకో నాన్నా.. కళ్లు మూసుకొని పడుకో’ అని కుంతల దాని ముట్టె మీద చేయి వేసి ఊరడిస్తే అది కళ్లు మూసుకొని నిద్రలోకి జారిపోవడం వీడియో లో చూసి ఆశ్చర్యపోయేవారు వారిద్దరికీ అభిమానులుగా మారారు. బహుశా వీళ్లను ఇక మీదట ఎవరూ విడదీయకపోవచ్చు. – సాక్షి ఫ్యామిలీ -
అడవిపంది అనుకొని స్నేహితున్ని కాల్చేశాడు
తిరువొత్తియూరు: వేటకు వెళ్లి అడవిపంది అనుకుని స్నేహితున్ని ఓ వ్యక్తి తుపాకీతో కాల్చేసాడు. ఈ ఘటన కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. అంజెట్టి సమీపంలోని తొట్టి మంజువల్లిపురం మంజు గ్రామానికి చెందిన పసుప్ప (40). ఇతను, మిత్రుడు నాగరాజు (27)తో కలిసి గురువారం రాత్రి అటవీ ప్రాంతానికి ఇద్దరు నాటు తుపాకీలతో వేటకు వెళ్లారు. అక్కడ అడవిపందులను వేటాడేందుకు చెరో దిక్కుకు వెళ్లారు. అర్ధరాత్రి నాగరాజు వెళ్లిన ప్రాంతంలో శబ్దం రావడంతో అడవిపంది అనుకుని తుపాకీతో కాల్చాడు. అక్కడికి వెళ్లి చూడగా తుపాకీ తూట దూసుకెళ్లి పసుప్ప మృతిచెంది వున్నాడు. ఇది చూసి నాగరాజు అక్కడి నుంచి పారిపోయాడు. శుక్రవారం ఉదయం అటవీ ప్రాంతానికి వెళ్లిన కొందరు పసుప్ప మృతిచెంది వుండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు నాగరాజు కోసం గాలిస్తున్నారు. చదవండి: విహారం.. విషాదం.. ప్రధాని దిగ్భ్రాంతి చదవండి: కన్నిబల్: ఫ్రెండ్స్‌ని చంపి తిన్నాడు.. చదవండి: ఎంత పని చేశావు.. అమ్మ -
పందులను చంపే అధికారం సర్పంచ్‌కే
సాక్షి, హైదరాబాద్: పంటలకు నష్టం చేకూర్చే అడవి పందులను హతమార్చేందుకు అనుమతుల జారీ అధికారాన్ని అటవీ, పర్యావరణ శాఖ గ్రామ సర్పంచ్‌లకు కల్పిం చింది. ఈ మేరకు గ్రామ సర్పంచ్‌ను గౌరవ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రక్షిత ప్రాంతాలు, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాల వెలుపల అడవి పందుల నుంచి మనుషుల ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగే అవకాశాలున్న చోట కొన్ని నిబంధనలకు లోబడి వాటిని అంతమొందించేందుకు సర్పంచ్‌లకు అవకాశం కల్పిం చింది. అయితే రాష్ట్ర స్థాయిలో చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఆదేశాలకనుగుణంగా సర్పంచ్‌లు ఈ పని చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర అధికారి నుంచి ఆదేశాలు వచ్చిన తేదీ నుంచి ఏడాది పాటు ఈ అధికారాలు అమల్లో ఉంటాయని మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి (పూర్తి అదనపు బాధ్యతలు) రజత్‌కుమార్ స్పష్టం చేశారు. ‘అడవి పందుల నుంచి పంట నష్టం లేదా ఇతర సమస్యలపై రైతుల నుంచి రాత పూర్వకంగా ఫిర్యాదు ఉంటేనే సర్పంచ్‌లు చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదు అందిన తర్వాత సర్పంచ్, గ్రామ పెద్దలు సంబంధిత ప్రదేశాన్ని సందర్శించి అడవి పందులను హతమార్చాల్సిన పరిస్థితులపై పంచనామా నిర్వహించి సిఫార్సు చేయాలి. అందుకు అనుగుణంగా ఆ పందులను చంపేందుకు సర్పంచ్‌లు ఆదేశాలిస్తారు. వీటి సంహారానికి అటవీశాఖ ప్యానెల్‌లోని షూటర్ల సేవలను ముఖ్యంగా సంబంధిత గ్రామం, మండలం, జిల్లాలో దీనికి సంబంధించిన లైసెన్స్, ఆయుధం, పందులను కాల్చడంలో నైపుణ్యం వంటివి ఉన్న వారిని ఎంపిక చేయాలి. పందులను చంపేటప్పుడు ఇతర జంతువులు, మనుషులు గాయపడకుండా, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు -
అడవి పంది.. చంపాలంటే ఇబ్బంది!
రాష్ట్రంలో పెద్ద పులి ఒక వ్యక్తిపై దాడి చేసి చంపడమే కాకుండా కొన్ని శరీరభాగాలను భక్షించడం కలకలాన్ని సృష్టించింది. ఆ పులిని గుర్తించి బంధించేందుకు అటవీ అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. పులి దాడి చేసి చంపిన అదే (కొమురం భీం ఆసిఫాబాద్) జిల్లాలోని అదే దహెగాం మండలం చిన్న ఐనం గ్రామంలో తన పొలం లో పనిచేసుకుంటున్న కె.జితేందర్ (33) అనే రైతుపై ఈ నెల 15న అడవి పంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి అతడు చనిపోయాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల అడవి పందుల బెడద విపరీతంగా పెరిగింది. అడవుల పక్కనుండే పల్లెల్లోని ప్రజలు తమ ప్రాణాలను, పంటలను వీటి నుంచి రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ తదితర జిల్లాల్లో ఈ సమస్య పెరుగుతోంది. ఈ అంశంపై వ్యవసాయ, అటవీ శాఖలు దృష్టి సారించాయి. షెడ్యూల్–3 నుంచి మార్చితేనే.. రక్షిత జంతువుల జాబితాలో అడవి పందిని చేర్చడంతో ప్రభావిత ప్రాంతాల్లో వాటిని సంహరించేందుకు అటవీ చట్టాలు అడ్డొస్తున్నాయి. వీటిని చంపడం ఈ చట్టాల మేరకు నేరం. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్–3లో ఉన్న అడవి పందిని షెడ్యూల్–5లోకి (వెర్మిన్లోకి చేర్చి తే) మార్చితే పరిమిత ప్రాంతాల్లో హతమార్చే అవకాశాలుంటాయి. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో వీటి వల్ల ఏయే జిల్లాల్లోని ఏయే ప్రాంతా ల్లో పంటలకు నష్టం వాటిల్లుతోంది? ఇతరత్రా రైతులు, ప్రజ లకు ఎదురవుతున్న సమస్యలేమిటి అన్న దాని పై నివేదిక సిద్ధం చేసే పనిలో అటవీశాఖ నిమగ్నమైంది. (ఆ రెండిటి మధ్య అత్యంత అరుదైన పోరు) ఏమిటీ వెర్మిన్..? పంటలు, వ్యవసాయంలో సహాయపడే పశువులు, మేకలు, ఇతర పెంపుడు జంతువులకు నష్టం కలుగజేసే.. ఆస్తులు, ఇతర ప్రాణాలకు అపాయం కలిగించే వ్యాధులు, రోగాల వ్యాప్తికి కారణమయ్యే జంతువులు, పక్షులను ‘వెర్మిన్’గా ప్రకటించవచ్చు. ఈ సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే, పరిమిత కాలం పాటు వేటగాళ్ల సాయంతో వెర్మిన్లను వేటాడేందుకు అనుమతి లభిస్తుంది. గతంలో పలు రాష్ట్రాలు తగిన సమాచారం, పంటలు, ఇతరత్రా జరుగుతున్న నష్టంపై సమగ్ర వివరాలు పంపకుండానే కొన్ని రకాల జంతువులను ‘వెర్మిన్’గా ప్రకటించాలని చేసిన విజ్ఞప్తులపై కేంద్రం ఆ మేరకు నోటిఫికేషన్లు జారీ చేసిన సందర్భాలున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కూడా చాలా సమయమే పడుతోం ది. ఈ నేపథ్యంలో అటు వ్యవసాయశాఖ, ఇటు అటవీశాఖ ఆయా జిల్లాలు, ప్రాంతాల వారీ గా జరుగుతున్న నష్టంపై వివరాలు సేకరించి నివేదికను సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యాయి. (లాప్టాప్ లాక్కెళ్లిన పంది.. నగ్నంగా అడవంతా..) ఈ నివేదిక సిద్ధమయ్యాక రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి, సర్కార్ ఆమోదంతోనే కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. అయితే కేంద్రం నుంచి అనుమతే కాకుండా రాష్ట్రప్రభుత్వ ఆమోదం మేరకు అడవి పందుల వల్ల అధిక నష్టం జరుగుతున్న ప్రాంతాల్లో, పరిమిత కాలానికి వీటిని వేటగాళ్లతో చంపించేందుకు అవకాశం కూడా ఉంది. ఈ వన్యప్రాణులు, పక్షులను ‘వెర్మిన్లు’గా ముద్రవేసి చంపడాన్ని పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. కూరమృగాలు, వన్యప్రాణుల నుంచి పంటల రక్షణ, రైతులపై ప్రాణాంతక దాడుల నివారణకు ఉత్తరాఖండ్, బిహార్, హిమాచల్‌ప్రదేశ్‌లకు కొన్ని జంతువులను వెర్మిన్లో చేర్చేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతినిచ్చిం ది. ఈ రాష్ట్రాలతో పాటు గతంలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు కూడా ప్రైవేట్ షూటర్లు, వేటగాళ్లతో కొన్ని జంతువులను చంపేందుకు అనుమతినిచ్చాయి. వివరాలు రాగానే నివేదిక.. అడవి పందులను తాత్కాలికంగా వెర్మిన్ జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం.. అయితే దానికి కేంద్రం అనుమతి కావాలి. రాష్ట్రంలో అడవి పందుల సమస్యలపై కొన్ని జిల్లాల ఫీల్డ్ ఆఫీసర్ల నుంచి నివేదికలొచ్చాయి. పూర్తి వివరాలు, సమాచారం వచ్చాక ఓ నిర్ణయం తీసుకుంటాం.. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి కూడా నివేదిక రావాల్సి ఉంది. ఆ తర్వాత ఈ అంశంపై తుది నిర్ణయం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం.– అటవీశాఖ వైల్డ్‌లైఫ్ విభాగం ఓఎస్డీ శంకరన్ -
అదిగో చిరుత.. ఇదిగో జింక
పశ్చిమ ఏజెన్సీలోని పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో ఉన్న పోలవరం, బుట్టాయగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గల రేంజ్‌ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటి కదలికలను గుర్తించారు. వీటి సంరక్షణ కోసం అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి, బుట్టాయగూడెం(పశ్చిమగోదావరి) : జిల్లాలోని పోలవరం, బుట్టాయగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పరిధితో పాటు పాపికొండల నేషనల్ పార్కుగా సుమారు 1.12 లక్షల హెక్టార్లలో అభయారణ్యం విస్తరించి ఉంది. అందులో ఎలుగుబంటులు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, గెద్దలు, నెమళ్లు, చిరుత పులులు, కురుడు పందులు, చుక్కల దుప్పిలు, సాంబాలు, జాకర్స్, ముళ్ల పందులు, ముంగీసలు వంటి జంతువులు అధికంగా ఉన్నట్లు వన్యప్రాణి విభాగం అధికారులు చేసిన సర్వేల్లో బయట పడింది. పాపి కొండల అభయారణ్యంలో చిరుతపులి, జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, అడవిదున్నలు ఉన్నట్లు గుర్తించారు. 5 ఫారెస్ట్ రేంజ్‌ల పరిధిలో 60 బీట్లలో 2018లో జంతుగణన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో చిరుత పులులతో పాటు పలు వన్యప్రాణులు ఉన్నట్లు తేలడంతో వాటి సంరక్షణ కోసం గోగులపూడి సమీపంలో బేస్ క్యాంపు, పోలవరం మండలంలోని టేకూరు వద్ద మరో బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బేస్ క్యాంపులో ఐదుగురు చొప్పున సిబ్బంది పని చేసేవిధంగా ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేశారు. అభయారణ్యం సంరక్షణ, జంతువుల ఉనికి తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పలు ప్రదేశాల్లో సంచరిస్తున్న అడవి జంతువుల కదలికలు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. పాపికొండల అభయారణ్యంలో చిరుతపులి జాడ ఉందని తేలింది. దీనితో పాటు కార్నివోర్స్, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లు, అడవి కుక్కలు, కుందేళ్లు, లేళ్లు, కనుజులు, అడవి పందుల జాడ కూడా ఉన్నట్లు తేలింది. పోలవరం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, కుక్కునూరు అటవీరేంజ్ పరిధిలో నిర్వహించిన జంతు గణనల్లో పోలవరం రేంజ్ పరిధిలో సుమారు 30 అడుగుల గిరినాగులు కూడా ఉన్నట్లు తేలిందని అధికారులు చెప్పారు. కానరాని పెద్ద పులుల జాడ 2018లో నిర్వహించిన జంతు గణనల సర్వేలో జీవజాతుల సంఖ్య పెరిగినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రాంతంలో పెద్దపులుల జాడ ఉన్నట్లు ఎక్కడా సమాచారంలేదని అధికారులు చెబుతున్నారు. అయితే పెద్దపులి జాడ కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తద్వారా సీసీ కెమెరాల ద్వారా బంధించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో పులుల సంచారం కూడా ఉందని, అయితే కెమెరాల్లో బందీ కావడంతో పాటు ఆచూకీ లభిస్తేనే వెల్లడిస్తామని అంటున్నారు. వేసవిలో వణ్యప్రాణుల దాహర్తి తీరుతుందిలా.. వేసవిలో వణ్యప్రాణుల దాహర్తిని తీర్చేందుకు అటవీశాఖ అధికారులు నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తారు. కుక్కలు, వాహనాల బారిన పడకుండా అటవీప్రాంతంలో జంతువులు సంచరించే ప్రాంతంలో సాసర్వెల్(నీటి తొట్టె) ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటితో నింపుతారు. బేస్‌క్యాంప్ సిబ్బందితో కలిసి అధికారులు ప్రతీరోజూ నీటిని పరిశీలించి అందులో చెత్తలేకుండా చూస్తారు. నీటి తొట్టె పక్కనే ఉప్పుముద్దను కూడా ఏర్పాటు చేస్తారు. వన్యప్రాణుల దాహార్తిని తీర్చుకుని ఉప్పుముద్దను నాకుతాయి. దీంతో ఎండ బారి నుంచి కాపాడుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పోలవరం, కన్నాపురం, కుక్కునూరు, వేలేరుపాడు రేంజ్ పరిధిలో సుమారు 70 వరకూ నీటి తొట్టెలు 150 వరకూ చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే వన్యప్రాణులకు వేసవిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో వేణుగోపాల్ తెలిపారు. వెంటాడుతున్న నిధుల కొరత వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అధికారులు అనేక అవస్థలు పడుతున్నారు. నీటితొట్టెల్లో నీటిని ట్యాంక్‌ల ద్వారా తరలించేందుకు, ఇతర ఏర్పాట్లకు నిధుల కొరత వెంటాడుతున్నట్లు అధికారులు అంటున్నారు. నిధుల కోసం ప్రతిపాదనలు పంపినా మంజూరుకాలేదని దీనితో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. జంతు సంరక్షణ కోసం చర్యలు అటవీ ప్రాంతంలోని జంతువులను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో వన్యప్రాణి దాహర్తి తీర్చేందుకు నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నాం. అలాగే చెక్‌డ్యామ్‌లు, ర్యాపిడ్ ఫీల్డ్ డ్యామ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. అయితే పనులకు సంబంధించి కాస్త నిధుల కొరత ఉన్నమాట వాస్తవమే. గత ఏడాది నుంచి నిధులు మంజూరు కావడంలేదు. – జి.వేణుగోపాల్, డిప్యూటీ రేంజర్ అధికారి వైల్డ్‌లైఫ్, పోలవరం -
బతుకమ్మ పూల విషాదం
సాక్షి, కృష్ణా/ఖమ్మం : పండగ పూట విషాదం నెలకొంది. బతుకమ్మ పూల కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మృత్యువాత పడ్డాడు. పంటలపై దాడులు చేస్తున్న అడవిపందులను కట్టడిచేయడానికి పెట్టిన మీటా (మందు గుండు ఉచ్చు)కు గురై ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కొర్లగూడెం గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాసరెడ్డి (50) మరణించారు. ఈ ఘటన కృష్ణాజిల్లాలోని గంపలగూడెం మండలం కనుమూరు - చిక్కుళ్లగూడెం మధ్య గల అడవిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ప్రాణాలకు తెగించి అడవి పందితో రైతు పోరాటం
-
యువతిని కిందపడేసిన అడవిపంది.. వైరల్
బీజింగ్ : అడవి పందిని మీరెప్పుడైనా చూశారా? ఒక వేళ చూసినా అది ఎలా గాయపరుస్తుందోననే విషయం తెలుసా? తెలియకుంటే ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తొలుత ఓ షాపింగ్ మాల్‌లోకి దూసుకెళ్లిన అడవిపంది అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ప్రయత్నించి విఫలమై చివరకు రోడ్డెక్కింది. అనంతరం తనకు ఎదురుగా ఉన్న ఓ యువతిని.. అనంతరం ఓ వ్యక్తిని బలంగా గుద్దేసి పారిపోయింది. అది ఎలాగో తెలియాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే.. -
యువతిని బలంగా గుద్దిన అడవిపంది..
-
దారి తప్పి.. జనాలకు చిక్కి
హైదరాబాద్: జనారణ్యంలోకి వచ్చిన ఓ అడవిపంది పార్కులో కలకలం సృష్టించింది. దానిని పట్టుకునే ప్రయత్నంలో ఓ యువకుడు గాయపడ్డాడు. శుక్రవారం వనస్థలిపురం సాహెబ్‌నగర్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు అడవి పందిని తరమడంతో అది సచివాలయనగర్లోని హుడా పార్కులో దూరింది. దీనిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా, ఎదురుదాడి చేయడంతో ఇద్దరు గాయపడ్డారు. సాహెబ్‌నగర్ ప్రాంతవాసులు ఉచ్చులు, వలల సహాయంతో దానిని పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించేందుకు తీసుకెళ్లారు. ఇది కూడా డ్యూటీనే: పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసు పట్టుకో..పట్టుకో.. పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ హమ్మయ్య దొరికింది...ఉచ్చులో చిక్కుకున్న అడవిపంది సాధించాం: అడవిపందిని అటవీశాఖ అధికారులకు అప్పగించేందుకు వెళ్తున్న స్థానికులు, పోలీసులు -
పార్కులో అడవిపంది పట్టివేత
హైదరాబాద్: ఎక్కడి నుంచి వచ్చిందో వనస్థలిపురంలోని జనావాసాల్లోకి శుక్రవారం ఓ అడవిపంది ప్రవేశించి అందరినీ హడలెత్తించింది. స్థానిక ఎల్ఐజీ పార్కులో సంచరిస్తున్న అడవిపందిని గమనించిన స్థానికులు దానిని పట్టుకోవటానికి ప్రయత్నించారు. దీంతో అది బెదిరిపోయి నలుగురిని గాయపరిచింది. చివరికి వారు వలలు వేసి పట్టుకుని బంధించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించటంతో వారు వచ్చిన పందిని స్వాధీనం చేసుకున్నారు. -
అడవి పంది దాడిలో గొర్రెలకాపరికి గాయాలు
ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామశివారులో సంతోష్ నాయక్(22) అనే గొర్రెల కాపరికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామశివారులో ఉన్న గుట్టలపై బుధవారం ఉదయం గొర్రెలు కాస్తుండగా ఒక్కసారిగా అడవి పందులు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను చికిత్స నిమిత్తం ధర్మారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. -
అడవి పంది దాడిలో యువకుడికి తీవ్రగాయాలు
పాతపట్నం మండలం రంకిని గ్రామంలో అడవి పంది దాడిలో ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. పెళ్లి పందిరి నిర్మించడానికి అవసరమైన కర్రల కోసం గ్రామ సమీపంలోని కొండపైకి వెళ్లినపుడు ఈ సంఘటన జరిగింది. గాయపడిన బురుజు షణ్ముఖరావు(19)ను చికిత్స నిమిత్తం పాతపట్నంలోని ప్రభుత్వాసుప్రతికి తరలించారు. -
అడవి పందుల దాడిలో వేటగాడు మృతి
గచ్చిబౌలి (హైదరాబాద్) : వేటకు వెళ్లిన ఓ వ్యక్తి అడవి పందుల దాడిలో మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ జె.రమేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గౌలిదొడ్డిలో నివాసం ఉండే జెర్రి అశోక్(45) ఈ నెల 11వ తేదీన ఉదయం 10 గంటలకు శంకర్ హిల్స్‌లో గల అటవీ ప్రాంతానికి వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు పొదల్లో ఉన్న పందుల గుంపు ఒక్కసారిగా అశోక్‌పై దాడి చేశాయి. మర్మాంగాలతో పాటు పొట్ట లోపల బలమైన గాయాలయ్యాయి. కిందపడిపోయిన అశోక్‌ను స్థానికులు కొండాపూర్‌లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం 12న రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 2.10 గంటలకు చనిపోయాడు. అశోక్ కుక్కలను వెంట తీసుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, శంకర్‌హిల్స్ ప్రాంతంలో అడవి జంతువులు, పక్షులను తరచుగా వేటాడేవాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అడవి పందిని ఢీకొన్న బైకు
నవాబుపేట: బైకు అడవిపందిని ఢీకొన్న ప్రమాదంలో ఓ టీఆర్ఎస్ నాయకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామంలో చోటు చేసకుంది. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట మండలం పులుమామిడి గ్రామానికి చెందిన మేడిపల్లి రాములు(50) గతంలో వట్టిమీనపల్లి పీఏసీఎస్ చైర్మన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం టీఆర్ఎస్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన కుటుంబంతో సహా వికారాబాద్‌లో నివసిస్తున్నాడు. రాము లు మంగళవారం అర్ధరాత్రి వరకు చిట్టిగిద్ద రైల్వేస్టేషన్ గ్రామంలో తనకున్న వ్యవసాయ పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నించాడు. అనంతరం బైకుపై వికారాబాద్ మండలం పులుసుమామిడి మీదుగా బైకుపై ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో పులుసుమామిడి గ్రామ సమీపంలో ఓ అడవిపంది రోడ్డుపై అడ్డుగా వచ్చింది. దీంతో వేగంగా ఉన్న రాములు బైకు అడవిపందిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో స్థానికులు విషయం గమనించి రాములును గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుడి తమ్ముడు వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. రాములకు భార్య పద్మమ్మ, కొడుకు ప్రశాంతకుమార్, ఓ కూతురు ఉన్నారు. రాములు మృతితో భార్యాపిల్లలు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడి కుటుంబీకులను పరామర్శించిన ఎమ్మెల్యే.. రోడ్డు ప్రమాదంలో రాములు దుర్మరణంపాలయ్యాడనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు మృతుడి స్వగ్రామం పులుమామిడికి చేరుకొని కుటుంబీకులను పరామర్శిం చారు. రాములు మృతి పార్టీకి తీరని లోటు అని తెలిపారు. వీరితో పాటు ఎంపీపీ పాండురంగారెడ్డి, పీఎసీఎస్ చెర్మైన్ మాణిక్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్టెపు మల్లారెడ్డి, సర్పంచులు భీంరెడ్డి, సుధాకర్‌రెడ్డి, గోపాల్, నాయకులు నాగిరెడ్డి, మాణిక్‌రెడ్డి,వెంకట్‌రెడ్డి, సిందం మల్లేషం తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
అమ్మో... అడవి పంది
-
కాదేదీ ఎలక్షన్లకనర్హం!
చెరువులో చేప, అడవిలో వెదురు, అడవి పందీ, ఏనుగు మంద.... పొలంలోని ఉల్లిగడ్డలు ఇవి కూడా ఎన్నికల్లో ప్రధాన సమస్యలౌతాయా? కూడు, గుడ్డ, గూడు కన్నా ముఖ్యమైన ఎన్నికల ఇష్యూలుంటాయా? అధికధరలు, అవినీతి వంటి అంశాలకన్నా ముఖ్యమైనవి ఉంటాయా? గోవా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే అక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన ఎన్నికల ఇష్యూ చేప! గోవా ప్రజలకు చేపలంటే ఎంతో ఇష్టం. ప్రతి భోజనంలోనూ చేపలుండాల్సిందే. కానీ గత అయిదేళ్లలో చేపల ధరలు నూరు శాతం పెరిగాయి. ఇది గోవా వాసుల పర్సులు కరుసైపోయేలా చేస్తున్నాయి. కొన్ని రకాల చేపలు అసలు మార్కెట్ లో దొరకడమే లేదు. వాటి పేరు వినగానే గోవన్ల నోట్లో లాలాజలం ఊరుతోంది. కానీ ధర ఆకాశంలో, లభ్యత పాతాళంలో ఉంటున్నాయి. ఉదాహరణకి సొరచేపలతో తయారుచేసే అంబాట్ తీఖ్ అనే కర్రీ అంటే గోవన్లు నాలిక కోసుకుంటారు. ఇప్పుడా కర్రీ దొరకడం లేదు. అదే గోవన్లకు అతిపెద్ద వర్రీ. అందుకే 'మత్స్యావతారాన్ని మాముందుంచే వాడికే మా ఓటు' అంటున్నారు గోవా ప్రజలు. పశ్చిమ తీరం లోని గోవా నుంచి ఈశాన్య భారతదేశంలోని మిజోరాం కి వస్తే అక్కడ వెదురు శవపేటికలే ఎన్నికల ప్రధాన ఇష్యూ. అధికార కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టోలో వెదురు తో చేసే శవపేటికలు సరఫరా చేస్తామన్నదే అతి ముఖ్యమైన వాగ్దానం. మిజోలు వెదురుతో శవపేటికలను తయారు చేస్తారు. ఇప్పుడు అక్కడ వెదురు లభ్యత బాగా తగ్గిపోయింది. దీంతో శవపేటికలను తయారు చేయాలంటే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడానికి కావలసిన వెదురు శవపేటికలను ఎవరు అందిస్తామని చెబితే ఓట్లు వాళ్లకే పడతాయి. మిజో యూత్ ఫ్రంట్ ఇప్పటికే శవపేటికల డిమాండ్ ను ముందుకు తెచ్చింది. రాజకీయ పార్టీలు వెదురు శవపేటికల విషయంలో హామీల మీద హామీలు గుప్పించేస్తున్నారు. కేరళలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో అడవిపందులు ఒక పెద్ద సమస్య. రాత్రిపూట పొలాల్లోచొరబడి అవి పంటల్ని నాశనం చేస్తాయి. దీంతో అక్కడి ఓటర్లు అడవిపందులను అదుపు చేసేవాడే మాకు ఎమ్మెల్యే కావాలని అంటున్నారు. ఇక ఝార్ఖండ్ రాష్ట్రంలోని గ్రామాలకు వెళ్తే అక్కడ మాకు ఏనుగుల బెడద తగ్గించండి అన్నదే ప్రజల ఏకైక డిమాండ్. ఏనుగులు ఊళ్లను, పంటలను భారీగా దెబ్బతీస్తున్నాయి. ఏనుగులు ఇప్పటికే దాదాపు వంద మందిని తొక్కి చంపాయి. గ్రామీణులు ఒక నలభై ఏనుగుల్ని చంపేశారు. 'మాకు ఏనుగుల సమస్యను తొలగించండి. ఎవరు ఏనుగుల్ని తరిమితే వారికే మా ఓటు' అంటున్నారు వారు.