నవాబుపేట: బైకు అడవిపందిని ఢీకొన్న ప్రమాదంలో ఓ టీఆర్‌ఎస్ నాయకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామంలో చోటు చేసకుంది. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట మండలం పులుమామిడి గ్రామానికి చెందిన మేడిపల్లి రాములు(50) గతంలో వట్టిమీనపల్లి పీఏసీఎస్ చైర్మన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన కుటుంబంతో సహా వికారాబాద్‌లో నివసిస్తున్నాడు. రాము లు మంగళవారం అర్ధరాత్రి వరకు చిట్టిగిద్ద రైల్వేస్టేషన్ గ్రామంలో తనకున్న వ్యవసాయ పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నించాడు. అనంతరం బైకుపై వికారాబాద్ మండలం పులుసుమామిడి మీదుగా బైకుపై ఇంటికి బయలుదేరాడు.
ఈక్రమంలో పులుసుమామిడి గ్రామ సమీపంలో ఓ అడవిపంది రోడ్డుపై అడ్డుగా వచ్చింది. దీంతో వేగంగా ఉన్న రాములు బైకు అడవిపందిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో స్థానికులు విషయం గమనించి రాములును గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుడి తమ్ముడు వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శేఖర్ తెలిపారు. రాములకు భార్య పద్మమ్మ, కొడుకు ప్రశాంతకుమార్, ఓ కూతురు ఉన్నారు. రాములు మృతితో భార్యాపిల్లలు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.
మృతుడి కుటుంబీకులను పరామర్శించిన ఎమ్మెల్యే..
రోడ్డు ప్రమాదంలో రాములు దుర్మరణంపాలయ్యాడనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు మృతుడి స్వగ్రామం పులుమామిడికి చేరుకొని కుటుంబీకులను పరామర్శిం చారు. రాములు మృతి పార్టీకి తీరని లోటు అని తెలిపారు. వీరితో పాటు ఎంపీపీ పాండురంగారెడ్డి, పీఎసీఎస్ చెర్మైన్ మాణిక్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్టెపు మల్లారెడ్డి, సర్పంచులు భీంరెడ్డి, సుధాకర్‌రెడ్డి, గోపాల్, నాయకులు నాగిరెడ్డి, మాణిక్‌రెడ్డి,వెంకట్‌రెడ్డి, సిందం మల్లేషం తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
అడవి పందిని ఢీకొన్న బైకు
Published Thu, May 28 2015 12:46 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement