
సాక్షి, కాకినాడ: కాకినాడలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మురారీ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.

వివరాల ప్రకారం.. కాకినాడలోకి గండేపల్లి మండలం మురారీ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతిచెందారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్టు సమాచారం. ఇక, మృతులను భీమవరానికి చెందిన వారిగా గుర్తించారు.

Comments
Please login to add a commentAdd a comment