Bangalore Accident: Woman Rider Run Over After Hit By Car Door Video Goes Viral - Sakshi
Sakshi News home page

షాకింగ్‌ వీడియో.. నిర‍్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం

Published Tue, Oct 11 2022 11:01 AM | Last Updated on Tue, Oct 11 2022 12:39 PM

Bangalore Accident Woman Rider Run Over After Hit By Car Door Viral - Sakshi

బెంగళూరు: రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ ప్రమాదం ఎటు నుంచి వస్తుందో ఊహించలేం. కొందరు నిర్లక్ష్యపూరింతా చేసే చిన్న చిన్న తప్పులు మరొకరి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన అలాంటి ఓ రోడ్డు ప్రమాదం వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

వీడియో ప్రకారం.. ఓ మహిళ తన స్కూటర్‌పై వెళ్తోంది. ముందు నిలిపి ఉంచిన కారు డోరును అకస్మత్తుగా తెరవటంతో దానిని ఢీకొట్టి రోడ్డుపై పడిపోయింది మహిళ. ఆ వెనకాలే వస్తున్న కారు ఆమెపైకి ఎక్కింది. కారు డ్రైవర్‌ అప్రమత్తమై బ్రేకులు వేసినా ఫలితం లేకుండా పోయింది. కారు కింద ఉన్న మహిళను కాపాడేందుకు చుట్టుపక్కల జనం హుటాహుటిన అక్కడికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గత సెప్టెంబర్‌ 24న జరిగింది. 

రోడ్డుపై వెళ్లేప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలంటూ ఈ ప్రమాదం వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది కర్ణాటక రోడ్డు భద్రతా సంస్థ. ‘రోడ్లపై మీ కారు డోరు తెరిచేప్పుడు తప్పనిసరిగా సైడ్‌ మిర్రర్‌లో ఓసారి తనిఖీ చేసుకుని వెనకాల ఏమైనా వాహనాలు వస్తున్నాయో లేదో గమనించండి. దాంతో ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు. రోడ్డుపై జగ్రత్తగా ఉండండి, రోడ్డు భద్రతా నిబంధనలను పాటించండి’అని పేర్కొంది.

ఇదీ చదవండి: సింహం పిల్లలే కదా అనుకుంటే ఇట్లుంటది.. ఒక్క గాండ్రింపుతో హడల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement