terrifying video
-
పిడుగు ముద్దాడ బోయింది
వానలో తడవాలని పిల్లలకు ఉంటుంది. జల్లుల్లో వాళ్లు కేరింతలు కొడితే ముద్దొస్తారు. మరి పిడుగుకు ముద్దొస్తే? తృటిలో ప్రాణాలు తప్పిపోయాయి. వానలో పిల్లలు జాగ్రత్త.బిహార్‌లోని సీతామర్హిలో ఒకమ్మాయి వానలో టెర్రస్ మీద సరదాగా కేరింతలు కొడుకుతుంటే తల్లి అది ఫోన్లో వీడియో తీయసాగింది. మనం అనుకుంటాం వాతావరణం ఆహ్లాదంగా ఉందని. కాని మెరుపులు, పిడుగులు ఎలా మెరిసి ఉరుముతాయో తెలియదు కదా. ఇక్కడ ఆ అమ్మాయికి కొద్ది దూరంలోనే పిడుగు పడింది. క్షణాల్లో ఆ అమ్మాయి లోపలికి పరిగెత్తింది. అమ్మాయి, తల్లి క్షేమమేగాని గురి సూటిగా ఉండి ఉంటే? అందుకే జాగ్రత్త. ఇకపై వానలు... ఉరుములు... పిడుగులు.. -
షాకింగ్ వీడియో.. కారు డోరు తెరిచేప్పుడు కాస్త చూసుకోండి..!
బెంగళూరు: రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ ప్రమాదం ఎటు నుంచి వస్తుందో ఊహించలేం. కొందరు నిర్లక్ష్యపూరింతా చేసే చిన్న చిన్న తప్పులు మరొకరి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన అలాంటి ఓ రోడ్డు ప్రమాదం వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో ప్రకారం.. ఓ మహిళ తన స్కూటర్‌పై వెళ్తోంది. ముందు నిలిపి ఉంచిన కారు డోరును అకస్మత్తుగా తెరవటంతో దానిని ఢీకొట్టి రోడ్డుపై పడిపోయింది మహిళ. ఆ వెనకాలే వస్తున్న కారు ఆమెపైకి ఎక్కింది. కారు డ్రైవర్ అప్రమత్తమై బ్రేకులు వేసినా ఫలితం లేకుండా పోయింది. కారు కింద ఉన్న మహిళను కాపాడేందుకు చుట్టుపక్కల జనం హుటాహుటిన అక్కడికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గత సెప్టెంబర్ 24న జరిగింది. రోడ్డుపై వెళ్లేప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలంటూ ఈ ప్రమాదం వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది కర్ణాటక రోడ్డు భద్రతా సంస్థ. ‘రోడ్లపై మీ కారు డోరు తెరిచేప్పుడు తప్పనిసరిగా సైడ్ మిర్రర్లో ఓసారి తనిఖీ చేసుకుని వెనకాల ఏమైనా వాహనాలు వస్తున్నాయో లేదో గమనించండి. దాంతో ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు. రోడ్డుపై జగ్రత్తగా ఉండండి, రోడ్డు భద్రతా నిబంధనలను పాటించండి’అని పేర్కొంది. Before opening the door of your car on public roads, make sure to check in the side or rear view mirror for vehicles coming from behind to avoid such accidents. Be mindful and careful! #roadsafety #rules #safety #drive #drivesafe #traffic pic.twitter.com/McPqHHr1GY — Karnataka State Road Safety Authority (@KSRSA_GoK) October 10, 2022 ఇదీ చదవండి: సింహం పిల్లలే కదా అనుకుంటే ఇట్లుంటది.. ఒక్క గాండ్రింపుతో హడల్ -
కుప్పకూలిన విమానం: షాకింగ్ వీడియో
మాస్కో: రష్యాకు చెందిన కార్గో విమానం కుప్పకూలింది. ఇద్దరు పైలట్లతోపాటు మరో ఇంజనీర్ ఈ ప్రమాదంలోముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ పైలట్, హీరో ఆఫ్ రష్యా నికోలాయ్ కుయిమోవ్తో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని అధికారిక న్యూస్ ఏజెన్సీ టాస్ ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మాస్కోకు పశ్చిమాన 45 కిలోమీటర్ల (28 మైళ్ళు) దూరంలో కుబింకా ఎయిర్ బేస్ వద్ద మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది. సైనిక రవాణా విమానం కూలిపోయిందని రష్యా యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ కూడా ధృవీకరించింది. కొత్త ప్రోటోటైప్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇల్యూషిన్ ఇల్ Il-112 వీ క్రాష్ అయిందంటూ పలు వార్తా సంస్థలు నివేదించాయి. విమానం ల్యాండింగ్ సమయంలో కుడి ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో అటవీ ప్రాంతంలో కూలిపోయిందని న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. మరోవైపు దర్యాప్తు నిమిత్తం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు రోస్టెక్ డిఫెన్స్ తెలిపింది. -
ఇంట్లోకి టైటానిక్‌లాంటి షిప్ దూసుకొస్తుందని..
-
ఇంట్లోకి టైటానిక్‌లాంటి షిప్ దూసుకొస్తుందని..
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ జంట తీవ్రంగా భయపడింది. ఒక భారీ షిప్ తమ ఇంట్లోకి దూసుకొస్తుందని భయపడుతూ గట్టిగా కేకలు వేసింది. వాళ్ల ఇంటి ముందున్న కుక్కలు కూడా ఆ సీన్ చూసి బెంబేలెత్తిపోయాయి. బిల్ తోడాంటర్ అనే వ్యక్తి లాడర్డేల్ అనే పోర్టు నుంచి ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయగా పెద్ద వైరల్ అయింది. లాడర్ డేల్ పోర్ట్ సమీపంలోని బీచ్‌లోని ఓ నివాసంలో ఓ జంట ఏడేళ్లుగా నివసిస్తోంది. ఆ ఇళ్లు బీచ్ ఒడ్డునే కావడంతో కాస్తంత సముద్రంలోకి ఉంటుంది. అయితే, ఇటీవలె దాదాపు ఒక ఎనిమిది అంతస్తుల పెద్ద జిగ్నాటిక్ క్రూయిజ్ లైనర్ అనే భారీ నౌక వారి ఇంటివైపుగా వచ్చింది. ఆ సీన్ చూసి ఇంట్లోని మహిళ బెంబేలెత్తిపోయింది. తన భర్తను వెళ్లి ఆ షిప్‌ను ఆపించండి అని చెప్పడంతో అతడు చేతులు ఊపుతూ హలో అంటూ గట్టిగా అరిచాడు. ‘మీరు చాలా దగ్గరగా వస్తున్నారు. పరిమితి దాటవొద్దు. ఇక్కడ నుంచి వెళ్లిపోండి’ ఆమె కేకలుపెట్టింది. ఆ సమయంలో నౌక మా ఇంట్లోకి వస్తుంది. నేను నిజంగా భయపడిపోయాను. నేను మా ఇంట్లో కుక్కల గురించి.. నా ఇల్లు గురించి చాలా బాధపడ్డాను. మా ఏడేళ్ల జీవితంలో ఎప్పుడు ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదు. సరిగ్గా 100 మీటర్ల దూరంలోనే నౌక ఆగిపోయింది’ అంటూ ఆ వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు. -
హల్చల్ చేస్తున్న హారిబుల్ వీడియో!!
దాదాపు అది 10 అడుగుల ఎత్తు ఉన్న డాబా ఇల్లు. పైన ఏడాది కూడా వయస్సులేని పిల్లాడు బుడిబుడి అడుగులు వేసుకుంటూ డాబాపై చివరి అంచుకు వచ్చాడు. డాబాపై చుట్టూ రక్షణగా చిన్న పిట్టగోడ కూడా లేదు. సహజంగా అలా డాబాపై చివరి అంచుకు పిల్లాడు వస్తే కింద పడిపోతాడని ఎవరైనా భయపడతారు. కానీ కింద ఉన్న ఆ పిల్లాడి తండ్రి మాత్రం.. అందుకు విరుద్ధంగా డాబాపై నుంచి పిల్లాడిని దూకేయమంటూ ప్రోత్సాహించాడు. తండ్రి అలా చేయడంతో అభంశుభం తెలియని ఆ పిల్లాడు దూకేశాడు. పది అడుగుల పైనుంచి ఆ బుజ్జాయి కిందపడేలోపు తండ్రి రెండు చేతులు చాపి కౌగిలిలోకి తీసుకున్నాడు. ఈ దారుణాతి దారుణమైన ఈ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తుంది. చూసిన నెటిజన్ల దిమ్మతిరిగేలా చేస్తోంది. తండ్రి అంత నిర్లక్ష్యంగా పిల్లాడి ప్రాణాల్ని పణంగా పెట్టి.. ఈ దారుణమైన సాహసాన్ని చేయాల్సిన అవసరమేముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది మధ్యప్రాచ్యంలో తీసిన వీడియో అని భావిస్తున్నారు. ఈ వీడియోలో వెనుక ఉన్న ఓ మహిళ నవ్వుతున్నట్టు వినిపిస్తోంది. ఆన్లైన్లో పెట్టే ఉద్దేశంతో తీసినా.. లేక మరే ఉద్దేశంతో ఈ వీడియో తీసినా కానీ చిన్నారి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడంపై మాత్రం నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ లేని సమయంలో ఆ బుజ్జాయి డాబాపైకి ఎక్కి.. కిందకు దూకేస్తే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. పిల్లల పట్ల ఇలాంటి ప్రమాదకర ఫీట్లు వద్దని హితవు పలుకుతున్నారు. ఆ వీడియోలోని పిల్లాడి తండ్రిని 'ఫాదర్ ఆఫ్ ది ఇయర్'గా పేర్కొంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.