మాస్కో: రష్యాకు చెందిన కార్గో విమానం కుప్పకూలింది. ఇద్దరు పైలట్లతోపాటు మరో ఇంజనీర్ ఈ ప్రమాదంలోముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ పైలట్, హీరో ఆఫ్ రష్యా నికోలాయ్ కుయిమోవ్‌తో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని అధికారిక న్యూస్ ఏజెన్సీ టాస్ ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మాస్కోకు పశ్చిమాన 45 కిలోమీటర్ల (28 మైళ్ళు) దూరంలో కుబింకా ఎయిర్ బేస్ వద్ద మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది. సైనిక రవాణా విమానం కూలిపోయిందని రష్యా యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ కూడా ధృవీకరించింది. కొత్త ప్రోటోటైప్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇల్యూషిన్ ఇల్ Il-112 వీ క్రాష్ అయిందంటూ పలు వార్తా సంస్థలు నివేదించాయి. విమానం ల్యాండింగ్ సమయంలో కుడి ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో అటవీ ప్రాంతంలో కూలిపోయిందని న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. మరోవైపు దర్యాప్తు నిమిత్తం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు రోస్టెక్ డిఫెన్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment