సాక్షి, బెంగళూరు: ఓ వ్యక్తి ప్రాణభయంతో పరుగు లు తీస్తుండగా వెనుకే ఓ స్కార్పియో వాహనం అతడిని తరుముతోంది. చివరికి అతడిని బలంగా ఢీకొట్టి అంతే వేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. బాధితుడు ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరు నగరంలోని పులకేశి నగర్‌లో అక్టోబర్ 18వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో అందరూ చూస్తుండగానే జరిగిన దారుణమిది. మృతుడిని అస్గర్‌గా గుర్తించిన పోలీసులు, సాధారణ రోడ్డు ప్రమాద కేసుగా భావించారు.
అయితే, మృతుడి స్నేహితుడిచ్చిన సమాచారంతో దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడు అమ్రీన్, అతడి వెంట ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బు వివాదం కారణంగానే తామీ పనికి పూనుకున్నట్లు వారు అంగీకరించారు. దీంతో ముగ్గురిపైనా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అస్గర్ సెకండ్ హ్యాండ్ కార్ డీలర్ కాగా, అతడి వద్ద అమ్రీన్ కారు కొనుగోలు చేశాడు.
దీనికి సంబంధించి అతడు అస్గర్‌కు రూ.4 లక్షలు బకాయి పడ్డాడు. దీనిపై ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. అస్గర్ తనపై దాడి చేశాడంటూ అమ్రీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు వెనక్కి తీసుకోవాలని అస్గర్ కోరగా అమ్రీన్ నిరాకరిస్తున్నాడు. ఘటన జరిగిన రాత్రి మాట్లాడుకుందాం రమ్మని అస్గర్‌ను అమ్రీన్ పిలిచాడు. చెప్పినచోటుకు రాగానే ప్లాన్ ప్రకారం అతడిని కారుతో ఢీకొ ట్టి, చంపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో ఈ ఘటన ఆ సాంతం వీడియో తీశాడని పోలీసులు చెప్పారు.
A murder committed openly on the streets of #Bengaluru has been captured on a mobile phone wherein a Scorpio runs over a man who was running to save his life.
— Hate Detector 🔍 (@HateDetectors) October 31, 2023
The incident, which occurred on October 18 at around 12:30 am, was recorded on a passerby's mobile phone in the… pic.twitter.com/ZBahJI0RNX
పారిస్ రైలులో బెదిరింపులు.. పోలీసు కాల్పులు
పారిస్: ఫ్రాన్సు రాజధాని పారిస్‌లో హిజాబ్ ధరించిన ఓ మహిళ(38) రైలులో ప్రయాణి కులను బెదిరింపులకు గురిచేసింది. దీంతో పోలీసులు కాల్పులు జరిపి ఆమెను గాయపరిచారు. దక్షిణ పారిస్‌లోని 13వ డిస్ట్రిక్ట్ గుండా వెళ్తున్న సబర్బన్ రైలులో ఓ మహిళ ‘అల్లాహూ అక్బర్’ అని అరుస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తోందంటూ పోలీసులకు సమాచారం అందింది. ఉగ్రవాద వ్యతిరేక దళం పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని, సదరు మహిళను పలుమా ర్లు హెచ్చరించారు. తనను తాను పేల్చేసుకుంటానంటూ బెదిరించింది.
దీంతో పోలీసులు ఆమెపైకి కాల్పులు జరిపారు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరో గ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలి పారు. ఆమె 2021లోనూ భద్రతా అధికారులను ఇలాగే బెదిరింపులకు గురిచేసిందన్నారు. ఈ సంఘటన తర్వాత మానసిక ఆరోగ్య కారణాలతో కొన్ని రోజులపాటు నిర్బంధంలో ఉంచామన్నారు. తాజా ఘటనపై దర్యాప్తు చేపట్టామన్నారు. ఇజ్రాయెల్– హమాస్ యు ద్ధంతో ఫ్రాన్సులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చోటుచేసుకున్న ఈ ఘటనపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment