బెంగళూరు: ధోతీ ధరించారన్న కారణంతో ఓ రైతును మాల్ సిబ్బంది లోపలికి అనుమతించలేని ఘటన మంగళవారం బెంగళూరులో చోటుచేసుకున్న విఫయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా కూడా మారింది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఈ విషయం అధికారుల దృష్టికి చేరింది. సంబంధిత మాల్‌పై ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. వృద్ధ రైతుకు ధోతి ధరించినందుకు ప్రవేశం నిరాకరించిన జీటీ వరల్డ్ షాపింగ్ మాల్‌ను వారం రోజులపాటు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.
వృద్ధ రైతుకు ధోతీ ధరించినందుకు ప్రవేశం నిరాకరించడంతో బెంగళూరు షాపింగ్ మాల్‌ను వారం రోజుల పాటు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి చర్యకు పాల్పడినందుకు చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని అందుకే ఏడు రోజులు మూసివేయాలని ఆదేశించినట్లు గురువారం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేష్ వెల్లడించారు.
Under Karnataka Congress govt patronage
Farmers are being abused and insulted for wearing Dhoti? Banned entry in a mall!
Karnataka CM wears a dhoti!
Dhoti is our pride.. should farmer wear a tuxedo in a mall?
How is Karnataka Congress allowing this? They are most anti… pic.twitter.com/NvctuwPBpp— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) July 17, 2024
కాగా బెంగళూరులోని జీటీ మాల్‌లో సినిమా చూసేందుకు ఓ తండ్రీ, కుమారులు వచ్చారు. మాల్‌లోకి వెళ్తుండగా అక్కడి భద్రతా సిబ్బంది ఆ రైతుని అడ్డగించి లోపలికి అనుమతి నిరాకరించారు. ఆ రైతు ధోతీ ధరించిన కారణంగా అనుమతి లేదని సిబ్బంది తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో మాల్ యాజమాన్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా మాల్ యజమాని, సెక్యూరిటీ సిబ్బంది భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 126(2) కింద కేసు నమోదు అయ్యింది. అలాగే బుధవారం రైతు సంఘాలు మాల్ ఎదుట ఆందోళనకు కూడా దిగాయి. ఆ రైతుకి, అతడి కుమారుడికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మాల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే వేలాదిమంది రైతులతో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. దీంతో ఆ భద్రతా సిబ్బంది రైతు, అతడి కుమారుడికి క్షమాపణలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment