Work From Watching.. Viral: మహమ్మారి మూలంగా వర్క్‌ఫ్రమ్ హోంకు జనాలు అలవాటు అయిపోయారు. చాలా కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు, మరీ ముఖ్యంగా ఎక్కువ పనిగంటలతో అవుట్‌పుట్ రాబట్టుకోవచ్చని ఉద్యోగుల్ని ఇంటి నుంచి పనితోనే ప్రొత్సహించుకుంటూ పోతున్నాయి. అఫ్‌కోర్స్.. ఆ పని భారంతో విసిగిపోతున్న వాళ్లే ఎక్కువనుకోండి!.
అయితే.. వర్క్‌ఫ్రమ్‌ను వర్క్‌ఫ్రమ్ థియేటర్ చేశాడు ఇక్కడో పనిమంతుడు!. టెక్ హబ్‌గా ఉన్న బెంగళూరులో తాజాగా ఈ పరిస్థితి కనిపించింది. సినిమా ప్రారంభం నుంచే తన వెంట తెచ్చుకున్న ల్యాప్‌ట్యాప్‌ను ఆన్ చేసి పనిలో మునిగిపోయాడు. ఆ లైటింగ్ మూలంగా గమనించాడు ఏమో.. పైనుంచి ఓ ప్రేక్షకుడు అదంతా వీడియో తీశాడు. బెంగళూరు మలయాళీస్ అనే పేజీ నుంచి ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. అన్నీ చూశారని అనుకున్నప్పుడే.. బెంగళూరులో కొత్తదనం కనిపిస్తుంటుంది అంటూ క్యాప్షన్ జత చేశారు ఆ వీడియోకి.
‘సినిమా చూడక.. చిమ్మచీకట్లో ఇక్కడ కూడా పనేనా బ్రో?’ అని కొందరు.. ‘వర్క్‌ఫ్రమ్ హోంను భలేగా మేనేజ్ చేస్తున్నావ్.. శెభాష్’ అని మరికొందరు.. సామాజిక స్పృహ ఉన్న మరికొందరు ‘థియేటర్‌లో తోటి ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించడమే’ ఈ చర్య అంటూ కామెంట్లు పెడుతున్నారు. చూద్దాం.. ఇలాంటి వీడియోలకు స్పందించే ఆనంద్ మహీంద్రా లాంటి ప్రముఖులు ఈ వీడియోపై ఎలా స్పందిస్తారో!.
వర్కఫ్రమ్ హోం అనేది.. ఉద్యోగుల సోషల్ కమ్యూనికేషన్స్‌ను దెబ్బతీయడంతో పాటు మానసిక స్థితిని విపరీతంగా ప్రభావితం చేస్తోంది. పని ఒత్తిళ్లను దూరం చేసుకోలేక.. మనశ్శాంతిని కోల్పోయి.. చివరికి తమ వ్యక్తిగత జీవితాల్ని ప్రభావితం చేసుకుంటున్నారు కొందరు. తమ తమ వివాహాల్లోనూ ల్యాప్‌ట్యాప్‌లతో పనులు చేసిన వధువు, వరులను కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో చూశాం.. గుర్తుందా?.
ఈ వీడియో చూడండి: కాస్ట్‌లీ కారుకు గాడిదలను కట్టారెందుకు?
Comments
Please login to add a commentAdd a comment