watching movie
-
థియేటర్లో చిమ్మచీకట్లో.. ఏంటి బ్రో ఇది?
Work From Watching.. Viral: మహమ్మారి మూలంగా వర్క్‌ఫ్రమ్ హోంకు జనాలు అలవాటు అయిపోయారు. చాలా కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు, మరీ ముఖ్యంగా ఎక్కువ పనిగంటలతో అవుట్‌పుట్ రాబట్టుకోవచ్చని ఉద్యోగుల్ని ఇంటి నుంచి పనితోనే ప్రొత్సహించుకుంటూ పోతున్నాయి. అఫ్కోర్స్.. ఆ పని భారంతో విసిగిపోతున్న వాళ్లే ఎక్కువనుకోండి!. అయితే.. వర్క్ఫ్రమ్ను వర్క్‌ఫ్రమ్ థియేటర్ చేశాడు ఇక్కడో పనిమంతుడు!. టెక్ హబ్‌గా ఉన్న బెంగళూరులో తాజాగా ఈ పరిస్థితి కనిపించింది. సినిమా ప్రారంభం నుంచే తన వెంట తెచ్చుకున్న ల్యాప్‌ట్యాప్‌ను ఆన్ చేసి పనిలో మునిగిపోయాడు. ఆ లైటింగ్ మూలంగా గమనించాడు ఏమో.. పైనుంచి ఓ ప్రేక్షకుడు అదంతా వీడియో తీశాడు. బెంగళూరు మలయాళీస్ అనే పేజీ నుంచి ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. అన్నీ చూశారని అనుకున్నప్పుడే.. బెంగళూరులో కొత్తదనం కనిపిస్తుంటుంది అంటూ క్యాప్షన్ జత చేశారు ఆ వీడియోకి. ‘సినిమా చూడక.. చిమ్మచీకట్లో ఇక్కడ కూడా పనేనా బ్రో?’ అని కొందరు.. ‘వర్క్‌ఫ్రమ్ హోంను భలేగా మేనేజ్ చేస్తున్నావ్.. శెభాష్’ అని మరికొందరు.. సామాజిక స్పృహ ఉన్న మరికొందరు ‘థియేటర్లో తోటి ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించడమే’ ఈ చర్య అంటూ కామెంట్లు పెడుతున్నారు. చూద్దాం.. ఇలాంటి వీడియోలకు స్పందించే ఆనంద్ మహీంద్రా లాంటి ప్రముఖులు ఈ వీడియోపై ఎలా స్పందిస్తారో!. వర్కఫ్రమ్ హోం అనేది.. ఉద్యోగుల సోషల్ కమ్యూనికేషన్స్‌ను దెబ్బతీయడంతో పాటు మానసిక స్థితిని విపరీతంగా ప్రభావితం చేస్తోంది. పని ఒత్తిళ్లను దూరం చేసుకోలేక.. మనశ్శాంతిని కోల్పోయి.. చివరికి తమ వ్యక్తిగత జీవితాల్ని ప్రభావితం చేసుకుంటున్నారు కొందరు. తమ తమ వివాహాల్లోనూ ల్యాప్‌ట్యాప్‌లతో పనులు చేసిన వధువు, వరులను కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో చూశాం.. గుర్తుందా?. View this post on Instagram A post shared by Bangalore Malayalis (@bangalore_malayalis) ఈ వీడియో చూడండి: కాస్ట్లీ కారుకు గాడిదలను కట్టారెందుకు? -
తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్..
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ 57 ఏళ్ల వయసులో లీడ్ రోల్లో నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ బెబో కరీనా కపూర్ హీరోయిన్గా అలరించనున్న ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ప్రీమియర్ షోలు రన్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ప్రీమియర్ షోకు అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావుతోపాటు కరీనా కపూర్ కూడా హాజరైంది. అయితే లాల్ సింగ్ చద్దా సినిమాను అమీర్ ఖాన్, కిరణ్ రావు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంటే కరీనా కపూర్ మాత్రం నిద్రపోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలో అమీర్ ఖాన్ మధ్యలో కూర్చోగా, ఆయన ఎడమ వైపు కిరణ్ రావు, కుడివైపు కరీనా కపూర్ కూర్చొని ఉన్నారు. ఈ పిక్లోనే కరీనా కపూర్ నిద్రపోవడం చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 'లాల్ సింగ్ చద్ధా చిత్రం చాలా బోరింగ్‌గా ఉన్నట్లుంది. అందుకే కరీనా నిద్రపోతోంది', 'ఫారెస్ట్ గంప్ సినిమాను అమీర్ చూడలేదేమో.. అందుకే బాగా ఎమోషనల్ అవుతున్నాడు' అంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: నూలుపోగు లేకుండా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ and kareena kapoor slept because of her own screentime in the film — Saharsh (@whysaharsh) July 21, 2022 చదవండి: చిరంజీవికి పానీపూరి తినిపించిన అమీర్ ఖాన్.. -
Sakshi Cartoon: సారు.. ఇలా లైవ్‌లో స్పందించరు!
సారు.. ఇలా లైవ్‌లో స్పందించరు! -
థియేటర్లో సినిమా చూస్తూనే..!
ఏలూరు (పశ్చిమ గోదావరి) : సినిమా చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి చిత్రం చూస్తుండగానే అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాములపర్రు గ్రామానికి చెందిన నక్కా రాజబాబు(37) ఉండిలోని సూర్యాథియేటర్కి మ్యాట్నీ సినిమాకి వెళ్లాడు. అక్కడ సినిమా చూస్తూ మరణించాడు. విషయం తెలుసుకున్న థియేటర్ సిబ్బంది అతని మృతదేహాన్ని థియేటర్ బయట పడవేశారు. దీంతో తన కొడుకు ఎలా చనిపోయాడో ఏం జరిగిందో తేల్చాలని రాజబాబు తండ్రి రాములు, చిన్నాన్న నక్కా తాతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో ఓ వ్యక్తి తమకు ఫోన్ చేసి రాజబాబు ఉండి సూర్యా థియేటర్లో సినిమా చూస్తూ చనిపోయాడని, సినిమాహాలు సిబ్బంది అతని మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చి పారవేశారని చెప్పినట్లు వారు వెల్లడించారు. రాజబాబు మృతి అనుమానాస్పదంగా ఉండడంతో కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.రవివర్మ తెలిపారు.