
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ 57 ఏళ్ల వయసులో లీడ్ రోల్‌లో నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ బెబో కరీనా కపూర్ హీరోయిన్‌గా అలరించనున్న ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ప్రీమియర్ షోలు రన్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ప్రీమియర్ షోకు అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావుతోపాటు కరీనా కపూర్ కూడా హాజరైంది.
అయితే లాల్ సింగ్ చద్దా సినిమాను అమీర్ ఖాన్, కిరణ్ రావు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంటే కరీనా కపూర్ మాత్రం నిద్రపోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలో అమీర్ ఖాన్ మధ్యలో కూర్చోగా, ఆయన ఎడమ వైపు కిరణ్ రావు, కుడివైపు కరీనా కపూర్ కూర్చొని ఉన్నారు. ఈ పిక్‌లోనే కరీనా కపూర్ నిద్రపోవడం చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 'లాల్ సింగ్ చద్ధా చిత్రం చాలా బోరింగ్‌గా ఉన్నట్లుంది. అందుకే కరీనా నిద్రపోతోంది', 'ఫారెస్ట్ గంప్ సినిమాను అమీర్ చూడలేదేమో.. అందుకే బాగా ఎమోషనల్ అవుతున్నాడు' అంటూ ట్రోల్ చేస్తున్నారు.
చదవండి: నూలుపోగు లేకుండా రణ్‌వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు
శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ
and kareena kapoor slept because of her own screentime in the film
— Saharsh (@whysaharsh) July 21, 2022