Aamir Khan's Laal Singh Chaddha Movie Trailer Released In IPL 2022 T20 Final Match - Sakshi
Sakshi News home page

Aamir Khan-Naga Chaitanya: ఐపీఎల్‌ టీ20 ఫైనల్‌ మ్యాచ్‌లో 'లాల్ సింగ్ చద్దా' ట్రైలర్‌..

Published Mon, May 30 2022 7:54 AM | Last Updated on Mon, May 30 2022 9:46 AM

Aamir Khan Naga Chaitanya Laal Singh Chaddha Trailer Released In T20 Final Match - Sakshi

Aamir Khan's Laal Singh Chaddha Trailer: ఆమిర్‌ఖాన్‌ హీరోగా అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. కరీనా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటించారు. ‘ఎక్స్‌పీరియన్స్‌ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ఏ సింపుల్‌మేన్‌’ అంటూ ‘లాల్‌ సింగ్‌ చద్దా’ హిందీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇప్పటికే పోస్టర్లు, పాటలతో సినిమా ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్‌ ఉత్కంఠంగా సాగుతున్న టీ20 ఫైనల్‌ మ్యాచ్‌లో ఈ ట్రైలర్‌ను ప్రదర్శించింది.  అనంతరం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. 

ఆద్యంతం ఆసక్తింగా సాగిన ఈ ట్రైలర్‌లో ఆమీర్‌ ఖాన్, నాగ చైతన్య లుక్‌ కొత్తగా ఉంది. ఈ సినిమాలో అభిమానులకు కోరుకున్నట్లు అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ హిందీతోపాటు దక్షిణాది భాషల్లో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌, వయాకామ్‌ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌గంప్‌’కు హిందీ రీమేక్‌గా రూపొందింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement