బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్ చడ్డా'. కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్రలో నటించారు. అద్వెత్ చందన్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.
తాజాగా ఈ వ్యవహారంపై కరీనా కపూర్ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో లాల్ సింగ్ చడ్డా ఓపెనింగ్స్‌పై ఆమె మాట్లాడుతూ.. 'కొందరు కావాలనే ఈ సినిమాను టార్గెట్ చేశారని ఆరోపించింది. కేవలం ఒక్కశాతం ప్రేక్షకులే ఇలా చేస్తున్నారు. విడుదలకు ముందే ‘బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్దా’ అంటూ దుష్ప్రచారం చేశారు. ఆ వ్యతిరేక ప్రచారం వల్లే ఓపెనింగ్స్ తగ్గాయి.
ఈ సినిమాను బహిష్కరిస్తే మంచి సినిమాను దూరం చేసినవారవుతారు. మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. దయచేసి మా సినిమాను బహిష్కరించకండి' అంటూ కరీనా విఙ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment