బాలీవుడ్ టైం బాగోలేదో లేదంటే ఇప్పుడు వస్తున్న కథల్లో క్వాలిటీ లేదో గానీ అక్కడ బడా హీరోల సినిమాలు అస్సలు వర్కవుట్ కావడం లేదు. అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్', ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', రణ్‌బీర్ కపూర్ 'షంషేరా'.. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందాయి. ఇప్పటికే షంషేరా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతుండగా రక్షా బంధన్ కూడా త్వరలో జీ5లో ప్రసారం కానుందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా లాల్‌సింగ్ చడ్డా కూడా ఓటీటీలోకి వచ్చేస్తోందట!
ఆగస్టు 11న విడుదలైన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ గిరీశ్ జోహార్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. లాల్‌సింగ్ చడ్డా నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 20 నుంచి స్ట్రీమ్ కానుందని ప్రకటించాడు. నిజానికి ఆమిర్ ఖాన్ ఈ సినిమా రిలీజైన ఆరు నెలల తర్వాతే ఓటీటీలోకి తెస్తామని మొదట ప్రకటించాడు. కానీ సినిమా ఫలితం తారుమారు కావడంతో నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే!
As per trade buzz... to minimise losses .. the OTT premiere of #LaalSinghChaddha will be on 20th Oct on #Netflix instead of the post 6months theatrical release, as announced by #AamirKhan earlier ! @AKPPL_Official pic.twitter.com/iyWHg5mlCt
— Girish Johar (@girishjohar) September 6, 2022
చదవండి: బిగ్‌బాస్‌కు వెళ్తానంటే ఆపేందుకు ప్రయత్నించారు: చలాకీ చంటి
సుష్మిత: ఓ వైపు బ్రేకప్ రూమర్స్.. మరోవైపు మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో పార్టీలో ఎంజాయ్
Comments
Please login to add a commentAdd a comment