Openings
-
కావాలనే టార్గెట్ చేశారు.. అందుకే ఓపెనింగ్స్ తగ్గాయి: కరీనా కపూర్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్ చడ్డా'. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్రలో నటించారు. అద్వెత్ చందన్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. తాజాగా ఈ వ్యవహారంపై కరీనా కపూర్ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో లాల్ సింగ్ చడ్డా ఓపెనింగ్స్‌పై ఆమె మాట్లాడుతూ.. 'కొందరు కావాలనే ఈ సినిమాను టార్గెట్ చేశారని ఆరోపించింది. కేవలం ఒక్కశాతం ప్రేక్షకులే ఇలా చేస్తున్నారు. విడుదలకు ముందే ‘బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్దా’ అంటూ దుష్ప్రచారం చేశారు. ఆ వ్యతిరేక ప్రచారం వల్లే ఓపెనింగ్స్ తగ్గాయి. ఈ సినిమాను బహిష్కరిస్తే మంచి సినిమాను దూరం చేసినవారవుతారు. మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. దయచేసి మా సినిమాను బహిష్కరించకండి' అంటూ కరీనా విఙ్ఞప్తి చేసింది. -
మా జిల్లా వాసులందరు పరవశించి పోతున్నారు : కేటీఆర్
-
కొత్త ఆవిష్కరణకు నాంది పలకండి
ఏఎన్‌యూ వీసీ ఎ.రాజేంద్రప్రసాద్ తెనాలిఅర్బన్ : కొత్త ఆవిష్కరణలకు విద్యార్థులు నాంది పలకాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎ.రాజేంద్రప్రసాద్ సూచించారు. జేఎంజే కళశాలలో స్మార్ట్ మెటీరియల్స్ అనే అంశంపై బుధవారం ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రసాంకేతిక విజ్ఞానం పై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. నాగరికతకు తగినట్లుగా మేధస్సును పెంపొందించుకోవాలని తెలిపారు. నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.వీరయ్య మాట్లాడుతూ మనం ఉపయోగించే వస్తువులలో ఎక్కువ భాగం నానోటెక్నాలజీ కలిగి ఉంటున్నాయని తెలిపారు. సైన్స్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు మార్పు చెందాలన్నారు. రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్రం చిల్లర నోట్లను వెంటనే ప్రజలకు అందుబాటులో తీసుకోరావాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన పెద్దనోట్ల స్థానంలో కొత్తవాటిని విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో కేంద్రంపై ప్రత్యక్ష యుద్ధం చేసేందుకు తాను సిద్ధమని హెచ్చరించారు. అనంతరం స్మార్ట్ మెటీరియల్ బుక్‌ను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ సిస్టర్ స్టెల్లా మారీసు, ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైనీ, వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ అమూల్‌మేరి, సదస్సు కన్వీనర్, భౌతికశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ సరస్వతీదేవి, అనిత, పి.సతీష్‌కుమార్, కె.అరుణోదయ, తదితరులు పాల్గొన్నారు. -
రూ.100కోట్ల పనులకు రేపు సీఎం శంకుస్థాపనలు
బళ్లారి టౌన్ : నగరంలో రూ.100కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు సోమవారం సీఎం సిద్దరామయ్య చేతుల మీదుగా నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి పీటీ. పరమేశ్వర నాయక్ తెలిపారు. ఆయన శనివారం జిల్లాధికారి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీఎంసీలో పలు అభివృద్ధి పనులు, కొత్త బస్టాండ్ రోడ్డు, స్పోర్ట్ క్రీడాంగణం, డిగ్రీ కళాశాల హాస్టల్ భవనం వంటి వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉప ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం వివిధ శాఖలకు చెందిన 10-12 మంది మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లా అభివృద్ధిపై సమీక్షలు జరిపి నివేదిక తయారు చేస్తారన్నారు. అంతేగాక ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించినందున ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా కోటి నాలుగు లక్షల మంది బీపీఎల్ కార్డు కుటుంబాలకు జాతీయ బీమా పథకానికి స్మార్ట్ కార్టులు ఇచ్చే చర్యలు 3 నెలలలో ముఖ్యమంత్రి చేపటనున్నారన్నారు. ఈ పథకానికి రూ.131,28,59,016లు ప్రీమియాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు. ప్రతి కార్డుదారుడి కుటుంబంలో గరిష్టంగా ఐదుగురికి ఏడాదికి రూ. 30 వేల వైద్య ఖర్చులను ఇన్సూరెన్స్‌ను కంపెనీ చెల్లిస్తుందన్నారు. అనారోగ్య బాధితులు స్మార్ట్ కార్డు తీసికెళ్లి ఎంపిక చేసిన ఆస్పత్రిలో చూపించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాధికారి సమీర్ శుక్ల, రూరల్ ఎమ్మెల్యే గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
సినిమా దేవుళ్లు!
ఫిలింనగర్‌లోని దైవసన్నిధానంలో కొలువైన దేవుళ్లకు సినిమా క్లాప్‌లు నిత్య కృత్యమయ్యాయి. ముహూర్తాల పూజలు, అర్చనలు, సినిమా హిట్ కావాలని ప్రత్యేక పూజలు ఇక్కడ సాధారణం. ఈ సన్నిధానంలో 17 మంది దేవతలు కొలువుదీరారు. వారంలో నాలుగు రోజుల పాటు తప్పని సరిగా ఏదో ఒక సినిమాకు సంబంధించి ప్రారంభోత్సవాలు, పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రముఖ హీరోలకు దైవసన్నిధానం కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. బంజారాహిల్స్: దైవసన్నిధానం సకల దేవతామూర్తుల ఆస్థానం. సినిమా వాళ్లకు ఇక్కడి దేవుళ్లు కోరిన కోర్కెలు తీచ్చే సర్వమంగళ స్వరూపులయ్యారు. ఇక్కడ క్లాప్ కొడితే సినిమా హిట్టే అని సినీ హీరోల నమ్మకం. 2002 సెప్టెంబర్ 3న ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. 2004 జూన్ 2న విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామీజీ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట - మహాకుంభాభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముహూర్త బలం - స్థల ప్రభావంతో అప్పటి నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడి దేవతామూర్తులను దర్శించి వారి కోరికలు నెరవేర్చుకొని ఆనందంతో తరిస్తున్నారు. సినిమా సెట్టింగులను తలపించేలా... దైవ సన్నిధానంలో దేవతామూర్తులను ప్రతిష్టించిన తీరు ఒక సినిమా సెట్టింగ్‌ను తలపిస్తున్నది. లోనికి వెళ్లగానే ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవుని దర్శనం కూడా అంతే ప్రశాంతంగా జరుగుతుంది. దేవతామూర్తులందరూ ఒకే చోట కొలువైన తీరు నగరంలో మరెక్కడా లేదు. ఇక్కడ శ్రీ మహావిష్ణు విశ్వరూపం ఒక అద్భుత దృశ్యంగా భక్తులకు కనిపిస్తున్నది. ఇక్కడ సినిమా తీస్తే అది సూపర్ హిట్ అనే టాక్ కూడా ఉంది. దీంతో నిర్మాతలు, హీరోలు ఇక్కడే తమ సినిమాల ముహూర్తాలను నిర్ణయించుకుంటున్నారు. ఇప్పటి వరకు దైవసన్నిధానంలో 150 సినిమాల వరకు పూజా కార్యక్రమాలు, షూటింగ్‌లు జరుపుకొన్నాయి. చాలా మంది నిర్మాతలు తమ సినిమాలు చిన్న దృశ్యమైనా ఇక్కడ చిత్రీకరించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా షూటింగ్‌లకు కూడా ఇక్కడి వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుండటంతో చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. సినిమాల్లో ఆలయాల దృశ్యాలను చూపేందుకు దైవసన్నిధానం ఎంతో అనుకూలంగా ఉందని దృశ్యాలు కూడా పండుతాయని పలువురు నిర్మాతలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలతో పాటు యువ హీరోలందరి సినిమాలు ఏదో ఒక దృశ్యాన్ని ఇక్కడ చిత్రీకరించుకున్నవే. ఇటీవల రామ్‌చరణ్‌తేజ్ సినిమా కూడా ముహూర్త షాట్లు ఇక్కడే చిత్రీకరించుకోవడం కొసమెరుపు. -
బికినీ షాట్‌తో మంచి ఓపెనింగ్స్ వస్తాయట!!
-
రేపు మేడారంలో మంత్రుల పర్యటన
=రూ. 100 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు =అక్కడే ఏర్పాట్లపై సమీక్ష =జిల్లా కలెక్టర్ కిషన్ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో రూ.100 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను శనివారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జాతర అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడారంలో పర్యటిస్తారని తెలిపారు. అదేవిధంగా వివిధ శాఖలు చేపడుతున్న అభివృద్ధి పనులను సమీక్షిస్తారని వివరించారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకుంటారని కలెక్టర్ అన్నారు. పస్రా నుంచి తాడ్వాయి వరకు సైడ్‌బర్మ్‌ల పనులు జనవరి 31నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గోవిందరావుపేట మండ లం బుస్సాపురం నుంచిలక్నవరం సరస్సు వరకు రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపా రు. ఈ పనులు వేగంగా పూర్తి చేయాలని ఐటీడీఏ అధికారులకు సూచించారు. ఊరట్టం నుంచి మల్యాల రోడ్డును మరమ్మతు చేయాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు చేయాలన్నారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి నుంచి దొడ్ల వరకు ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్డు పనులను పీఆర్‌కు అప్పగించాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా సైడ్‌బర్మ్‌లు పటిష్టంగా నిర్మించాలని రూరల్ ఎస్సీ లేళ్ల కాళిదాసు సూచించారు. జేసీ పౌసుమిబసు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, ఏజేసీ సంజీవయ్య, ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్వో సురేంద్రరణ్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, డ్వామా పీడీ హైమావతి, ట్రాన్స్‌కో ఎస్ఈ మోహన్‌రావు, ఈఓ రాజేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు సమైక్య సెగ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సమైక్య ఉద్యమం తీవ్రరూపం దాల్చిన కారణంగా సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలోనే పర్యటించలేని ప రిస్థితి ఏర్పడింది. శని, ఆదివారాల్లో తిరుపతి, తిరుమలలో సీఎం పర్యటనలో ఖరారైన 90 శాతం కార్యక్రమాలను సమైక్య ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని అధికారులు రద్దు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శనివారం రాత్రి శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. పెద్దశేష వాహన సేవలో పాల్గొని ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. వందల కోట్ల రూపాయల విలువచేసే పలు పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఆయన చేతులు మీదుగా జరగాల్సి ఉంది. సీఎం పర్యటన ఖరారైన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నోట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం, అందుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండడం తో వీటిని రద్దు చేశారు. చిత్తూరు జిల్లా మంచినీటి పథకం, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ఎస్వీ విశ్వవిద్యాలయం సైన్స్ బ్లాక్-2, పద్మావతి మహిళా వైద్య కళాశాల శంకుస్థాపనలు, ఫార్మసీ భవన ప్రారంభోత్సవం రద్దు అయిన కార్యక్రమాల్లో ఉన్నాయి. ఆదివారం ఉదయం తిరుమలలో రూ.70 కోట్లతో చేపట్టనున్న శ్రీవారి సేవాసదనం, రూ.20 కోట్లలో చేపట్టే ఓఆర్ఆర్ మూడో దశ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా అధికారులు వాటినీ వాయిదా వేశారు. మారిన కార్యక్రమాల కారణంగా మధ్యాహ్నం 1.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చే ముఖ్యమంత్రి 2.40కి తిరుమలకు చేరుకుంటారు. రాత్రి 7.20 గంటల వరకూ ఖాళీగా అక్కడే ఉంటారు. 7.30 గంటలకు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం తిరుమల నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకొని 8.55 గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళతారని జిల్లా కలెక్టర్ రాంగోపాల్ తెలిపారు. చింతామోహన్ ఇంట్లో చీక టి సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా ఇవ్వని, మాటైనా మాట్లాడని తిరుపతి ఎంపీ చింతామోహన్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యుత్ జేఏసీ నేతలు తిరుపతిలోని చింతామోహన్ ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేసి నిరసన తెలిపారు. రూ.మూడున్నర లక్షల వరకూ విద్యుత్ బిల్లులు బకాయి ఉన్నందున సరఫరాను పునరుద్ధరించాల్సిన అవసరం లేదని విద్యుత్ జేఏసీ నేతలు చెబుతున్నారు. తిరుపతిలో పలుచోట్ల సమైక్య ఉద్యమకారులు చింతామోహన్ దిష్టిబొమ్మలను, ఫొటోలను దహనం చేశారు. నేడు తిరుమలకు రానున్న సీఎం చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం తిరుమల రానున్నారు. ఈ మేరకు కలెక్టర్ రాంగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశా రు. శనివారం మధ్యాహ్నం 1.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుం టారు. అక్కడ 1.50 గంట లకు బయలుదేరి రోడ్డుమార్గాన 2.40 గంటలకు తిరుమలలోని శ్రీపద్మావతి అతి థి గృహానికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి 7.30 గంటలకు శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో పాలొ ్గని రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి, పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటారు. రాత్రి 9.10 గంటలకు పద్మావతి అతిథి గృహానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం 7.40 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి 8.25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అల్పాహారం అనంతరం 8.55 గంటలకు బయలుదేరి హైదరాబాద్ వెళతారు. -
డబుల్ ధమాకా!
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: ఒకే కార్యాలయం.. ఒకే రోజు.. రెండు ప్రారంభోత్సవాలు.. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? శనివారం పలుచోట్ల చోటు చేసుకున్న ఈ ఘటనలు మన ప్రజాప్రతినిధుల ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందని చెప్పేందుకు నిదర్శనాలు. లాలాగూడ రైల్వే వర్క్‌షాపు సమీపంలోని పురాతన తపాలా కార్యాలయాన్ని ఇటీవల ఆధునికీకరించారు. శనివారం 11 గంటలకు ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించిన అధికారులు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. అయితే, అరగంట ముందే అక్కడికి చేరుకున్న ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్.. ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగేది లేదని, రిబ్బన్ కట్ చేసి వెళ్లిపోయారు. 11.30 గంటల సమయంలో ఎమ్మెల్యే జయసుధ అక్కడికి చేరుకున్నారు. ఏం చేయాలో పాలుపోని అధికారులు అంజన్ రిబ్బన్ కట్ చేసిన ప్రవేశ్ ద్వారానికే మరో రిబ్బన్ ఏర్పాటు చేసి ఆమెతో కట్ చేయించారు. ఇలా ఒకే తపాలా కార్యాలయానికి గంట వ్యవధిలో రెండుసార్లు ప్రారంభోత్సవాలు జరిగాయి. అటు, బోయిన్‌పల్లిలో కేంద్ర మంత్రి, ఎంపీ సర్వే సత్యనారాయణ కంటే ముందే ‘ప్రాజెక్ట్ యారో పోస్టాఫీసు’ను ఎమ్మెల్యే శంకర్రావు ప్రారంభించి వెళ్లిపోయారు. ఆ తర్వాత వచ్చిన సర్వే మరోమారు రిబ్బన్ కట్ చేశారు. బొల్లారంలోనూ దాదాపు ఇదే సీన్ రిపీట్ అయింది.