సికింద్రాబాద్, న్యూస్‌లైన్: ఒకే కార్యాలయం.. ఒకే రోజు.. రెండు ప్రారంభోత్సవాలు.. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? శనివారం పలుచోట్ల చోటు చేసుకున్న ఈ ఘటనలు మన ప్రజాప్రతినిధుల ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందని చెప్పేందుకు నిదర్శనాలు. లాలాగూడ రైల్వే వర్క్‌షాపు సమీపంలోని పురాతన తపాలా కార్యాలయాన్ని ఇటీవల ఆధునికీకరించారు. శనివారం 11 గంటలకు ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించిన అధికారులు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. అయితే, అరగంట ముందే అక్కడికి చేరుకున్న ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్.. ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగేది లేదని, రిబ్బన్ కట్ చేసి వెళ్లిపోయారు. 11.30 గంటల సమయంలో ఎమ్మెల్యే జయసుధ అక్కడికి చేరుకున్నారు.
ఏం చేయాలో పాలుపోని అధికారులు అంజన్ రిబ్బన్ కట్ చేసిన ప్రవేశ్ ద్వారానికే మరో రిబ్బన్ ఏర్పాటు చేసి ఆమెతో కట్ చేయించారు. ఇలా ఒకే తపాలా కార్యాలయానికి గంట వ్యవధిలో రెండుసార్లు ప్రారంభోత్సవాలు జరిగాయి. అటు, బోయిన్‌పల్లిలో కేంద్ర మంత్రి, ఎంపీ సర్వే సత్యనారాయణ కంటే ముందే ‘ప్రాజెక్ట్ యారో పోస్టాఫీసు’ను ఎమ్మెల్యే శంకర్రావు ప్రారంభించి వెళ్లిపోయారు. ఆ తర్వాత వచ్చిన సర్వే మరోమారు రిబ్బన్ కట్ చేశారు. బొల్లారంలోనూ దాదాపు ఇదే సీన్ రిపీట్ అయింది.
డబుల్ ధమాకా!
Published Sun, Aug 11 2013 1:21 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement
Advertisement