బళ్లారి టౌన్ : నగరంలో రూ.100కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు సోమవారం సీఎం సిద్దరామయ్య చేతుల మీదుగా నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పీటీ. పరమేశ్వర నాయక్ తెలిపారు. ఆయన శనివారం జిల్లాధికారి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీఎంసీలో పలు అభివృద్ధి పనులు, కొత్త బస్టాండ్ రోడ్డు, స్పోర్ట్ క్రీడాంగణం, డిగ్రీ కళాశాల హాస్టల్ భవనం వంటి వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఉప ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం వివిధ శాఖలకు చెందిన 10-12 మంది మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లా అభివృద్ధిపై సమీక్షలు జరిపి నివేదిక తయారు చేస్తారన్నారు. అంతేగాక ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించినందున ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా కోటి నాలుగు లక్షల మంది బీపీఎల్ కార్డు కుటుంబాలకు జాతీయ బీమా పథకానికి స్మార్ట్ కార్టులు ఇచ్చే చర్యలు 3 నెలలలో ముఖ్యమంత్రి చేపటనున్నారన్నారు.
ఈ పథకానికి రూ.131,28,59,016లు ప్రీమియాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు. ప్రతి కార్డుదారుడి కుటుంబంలో గరిష్టంగా ఐదుగురికి ఏడాదికి రూ. 30 వేల వైద్య ఖర్చులను ఇన్సూరెన్స్‌ను కంపెనీ చెల్లిస్తుందన్నారు. అనారోగ్య బాధితులు స్మార్ట్ కార్డు తీసికెళ్లి ఎంపిక చేసిన ఆస్పత్రిలో చూపించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాధికారి సమీర్ శుక్ల, రూరల్ ఎమ్మెల్యే గోపాలకృష్ణ పాల్గొన్నారు.
రూ.100కోట్ల పనులకు రేపు సీఎం శంకుస్థాపనలు
Published Sun, Sep 28 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM
Advertisement
Advertisement