కొత్త ఆవిష్కరణకు నాంది పలకండి
-
ఏఎన్‌యూ వీసీ ఎ.రాజేంద్రప్రసాద్
తెనాలిఅర్బన్ : కొత్త ఆవిష్కరణలకు విద్యార్థులు నాంది పలకాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎ.రాజేంద్రప్రసాద్ సూచించారు. జేఎంజే కళశాలలో స్మార్ట్ మెటీరియల్స్ అనే అంశంపై బుధవారం ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రసాంకేతిక విజ్ఞానం పై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. నాగరికతకు తగినట్లుగా మేధస్సును పెంపొందించుకోవాలని తెలిపారు. నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.వీరయ్య మాట్లాడుతూ మనం ఉపయోగించే వస్తువులలో ఎక్కువ భాగం నానోటెక్నాలజీ కలిగి ఉంటున్నాయని తెలిపారు. సైన్స్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు మార్పు చెందాలన్నారు. రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్రం చిల్లర నోట్లను వెంటనే ప్రజలకు అందుబాటులో తీసుకోరావాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన పెద్దనోట్ల స్థానంలో కొత్తవాటిని విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో కేంద్రంపై ప్రత్యక్ష యుద్ధం చేసేందుకు తాను సిద్ధమని హెచ్చరించారు. అనంతరం స్మార్ట్ మెటీరియల్ బుక్‌ను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ సిస్టర్ స్టెల్లా మారీసు, ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైనీ, వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ అమూల్‌మేరి, సదస్సు కన్వీనర్, భౌతికశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ సరస్వతీదేవి, అనిత, పి.సతీష్‌కుమార్, కె.అరుణోదయ, తదితరులు పాల్గొన్నారు.