సాక్షి ప్రతినిధి, తిరుపతి: సమైక్య ఉద్యమం తీవ్రరూపం దాల్చిన కారణంగా సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలోనే పర్యటించలేని ప రిస్థితి ఏర్పడింది. శని, ఆదివారాల్లో తిరుపతి, తిరుమలలో సీఎం పర్యటనలో ఖరారైన 90 శాతం కార్యక్రమాలను సమైక్య ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని అధికారులు రద్దు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శనివారం రాత్రి శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.
పెద్దశేష వాహన సేవలో పాల్గొని ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. వందల కోట్ల రూపాయల విలువచేసే పలు పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఆయన చేతులు మీదుగా జరగాల్సి ఉంది. సీఎం పర్యటన ఖరారైన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నోట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం, అందుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండడం తో వీటిని రద్దు చేశారు.
చిత్తూరు జిల్లా మంచినీటి పథకం, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ఎస్‌వీ విశ్వవిద్యాలయం సైన్స్ బ్లాక్-2, పద్మావతి మహిళా వైద్య కళాశాల శంకుస్థాపనలు, ఫార్మసీ భవన ప్రారంభోత్సవం రద్దు అయిన కార్యక్రమాల్లో ఉన్నాయి. ఆదివారం ఉదయం తిరుమలలో రూ.70 కోట్లతో చేపట్టనున్న శ్రీవారి సేవాసదనం, రూ.20 కోట్లలో చేపట్టే ఓఆర్‌ఆర్ మూడో దశ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా అధికారులు వాటినీ వాయిదా వేశారు.
మారిన కార్యక్రమాల కారణంగా మధ్యాహ్నం 1.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చే ముఖ్యమంత్రి 2.40కి తిరుమలకు చేరుకుంటారు. రాత్రి 7.20 గంటల వరకూ ఖాళీగా అక్కడే ఉంటారు. 7.30 గంటలకు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం తిరుమల నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకొని 8.55 గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళతారని జిల్లా కలెక్టర్ రాంగోపాల్ తెలిపారు.
చింతామోహన్ ఇంట్లో చీక టి
సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా ఇవ్వని, మాటైనా మాట్లాడని తిరుపతి ఎంపీ చింతామోహన్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యుత్ జేఏసీ నేతలు తిరుపతిలోని చింతామోహన్ ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేసి నిరసన తెలిపారు. రూ.మూడున్నర లక్షల వరకూ విద్యుత్ బిల్లులు బకాయి ఉన్నందున సరఫరాను పునరుద్ధరించాల్సిన అవసరం లేదని విద్యుత్ జేఏసీ నేతలు చెబుతున్నారు. తిరుపతిలో పలుచోట్ల సమైక్య ఉద్యమకారులు చింతామోహన్ దిష్టిబొమ్మలను, ఫొటోలను దహనం చేశారు.
నేడు తిరుమలకు రానున్న సీఎం
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం తిరుమల రానున్నారు. ఈ మేరకు కలెక్టర్ రాంగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశా రు. శనివారం మధ్యాహ్నం 1.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుం టారు. అక్కడ 1.50 గంట లకు బయలుదేరి రోడ్డుమార్గాన 2.40 గంటలకు తిరుమలలోని శ్రీపద్మావతి అతి థి గృహానికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి 7.30 గంటలకు శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో పాలొ ్గని రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి, పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటారు. రాత్రి 9.10 గంటలకు పద్మావతి అతిథి గృహానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం 7.40 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి 8.25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అల్పాహారం అనంతరం 8.55 గంటలకు బయలుదేరి హైదరాబాద్ వెళతారు.