womens medical college
-
త్వరలో మెక్లారిన్ మహిళా వైద్య కళాశాల
కాకినాడ: వందేళ్ల చరిత్ర కలిగిన కాకినాడ మెక్లారి¯ŒS హైస్కూల్ ఆవరణలో రూ.645 కోట్లతో మహిళా వైద్య కళాశాలను ఏర్పాటు చేయనున్నట్టు సీబీసీఎ¯ŒSసీ అధ్యక్షుడు డాక్టర్ ముత్తాబత్తుల రత్నకుమార్ చెప్పారు. ఉత్తర సర్కార్ జిల్లాల బాప్టిస్టు సంఘాల మహాసభలు శుక్రవారం కాకినాడ సీబీఎం ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో డాక్టర్ రత్నకుమార్ మాట్లాడుతూ మహిళా వైద్య కళాశాల ఏర్పాటుకు ఇప్పటికే మెడికల్ కౌన్సిల్ ఆమోదం లభించిందని, త్వరలోనే భవన నిర్మాణం చేపడతామన్నారు. కళాశాల స్థాపనకు కెనడియ¯ŒS ఓవర్సిస్ మిష¯ŒS ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపారు. సీబీసీఎ¯ŒSసీ ఆధ్వర్యంలో త్వరలో మరో ఏడు మహిళా కళాశాలలు, న్యాయవిద్య కళాశాలలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీబీసీఎ¯ŒSసీ ఆధ్వర్యంలో ఇప్పటికే 245 పాఠశాలల ద్వారా ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు. ఈ మహాసభల్లో ఆల్ ఇండియా క్రిస్టియ¯ŒS కౌన్సిల్ అధ్యక్షుడు జార్జి, సీవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు మూర్తిరాజు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ కోరా జయరాజు, గోదావరి అసోసియేష¯ŒS డైరెక్టర్ ఎజ్రా రమేష్, రాజమహేంద్రవరం అసోసియేష¯ŒS అధ్యక్షుడు రమేష్‌కుమార్, కోటనందూరు అసోసియేష¯ŒS అధ్యక్షుడు బి.శామ్యూల్ తదితరులు ప్రసంగించారు. ‘ప్రేమామయుడు’ క్రైస్తవ భక్తిగీతాల ఆడియో సీడీని ఆవిష్కరించారు. -
మహిళా వైద్య కళాశాలకు ఝలక్
300 పడకల భవనంలో మెటర్నిటీ సేవలు ప్రారంభం మెటర్నిటీ అధికారులకు కార్మిక సంఘాల మద్దతు తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో ప్రారంభించాలనుకుంటున్న శ్రీపద్మావతీ మహిళా వైద్య కళాశాల నిర్వహణకు మెటర్నిటీ అధికారులు ఝలక్ ఇచ్చారు. మెడికల్ కళాశాలకు కేటాయించాలనుకున్న 300 పడకల ఆస్పత్రి భవనంలోకి శుక్రవారం మెటర్నిటీ అధికారులు, వైద్యులు అనధికారికంగా గృహ ప్రవేశం చేసి వైద్య సేవలను ప్రారంభించారు. వైద్య కళాశాల ఏర్పాటుకు సంబంధించి మౌలిక వసతులను పరిశీలించేందుకు స్వయాన మెడికల్ కౌన్సిల్(ఎంసీఐ) బృందం తిరుపతిలో పర్యటిస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం అటు స్విమ్స్ వర్గాల్లో, ఇటు ఎంసీఐ బృందంలో చర్చనీయాంశమైంది. 15 రోజుల క్రితం వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా జారీ అయిన జీవో మేరకు మెటర్నిటీ ఆస్పత్రి విస్తరణలో భాగంగా గర్భిణుల కోసం నిర్మించిన 300 పడకల భవనాన్ని స్విమ్స్ మహిళా వైద్య కళాశాలకు కేటాయించాల్సి ఉంది. ఆ జీవో జారీ అయిన మరుసటి రోజే భవనాన్ని స్విమ్స్‌కు కేటాయించకూడదంటూ ఎస్వీ మెడికల్ కాలేజీ అభివృద్ధి కమిటీ, మెటర్నిటీ అధికారుల సంఘం నుంచి ప్రభుత్వానికి విజ్ఞాపనలు వెళ్లాయి. వారి విజ్ఞాపనలకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానమూ రాలేదు. అయినప్పటికీ స్విమ్స్ వర్గాలు, వైద్యశాఖ ఉన్నతాధికారులు మాత్రం వైద్య కళాశాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు. ఆ దిశగా ఎంసీఐ బృందాన్ని తక్షణం తిరుపతికి రప్పించి స్విమ్స్ పరిధిలోని కొన్ని కాలేజీ భవనాలతోపాటు 300 పడకల భవనాన్ని మెడికల్ కళాశాలకు ఓకే చేయించుకోవాలనుకున్నారు. మూడు రోజులుగా పూర్తి విషయాలను పరిశీలిస్తూ వచ్చిన మెటర్నిటీ అధికారులు, వైద్యులు తమకు చెందిన భవనాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఉపక్రమించారు. శుక్రవారం ఉదయం ఆ భవనంలో ఓపీ, మందుల పంపిణీ, వార్డుల్లో గర్భిణుల అడ్మిట్ తదితర వైద్య సేవలను చేపట్టారు. రాజకీయ ఒత్తిడి పెంచిన మెటర్నిటీ అధికారి? మెటర్నిటీ ఆస్పత్రికి అనుబంధంగా నిర్మించిన 300 పడకల భవనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్విమ్స్ వైద్య కళాశాలకు కేటాయించకుండా చేసేందుకు మెటర్నిటీకి చెందిన ఓ అధికారి రాజకీయ ఒత్తిడులు పెంచుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో రాష్ర్టపతి పాలన అమలులో ఉండగా స్విమ్స్‌కు 300 పడకల భవనాన్ని కేటాయిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. మరో వారం రోజుల్లో అధికారంలోకి రానున్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ముఖ్య నేతతో మెటర్నిటీ అధికారి కాబోయే సీఎం స్థాయికి ఒత్తిడి పెంచారు. స్విమ్స్ అధికారులు, పాలకవర్గం కూడా ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ ప్రారంభించారు. శుక్రవారం మెటర్నిటీ అధికారులు, వైద్యులు చేసిన కార్యక్రమాలకు సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు చిన్నం పెంచలయ్య, మురళి సంపూర్ణ మద్దతు పలికారు. -
వేగంగా మెడికల్ కళాశాల పనులు
తిరుపతి, న్యూస్‌లైన్: స్విమ్స్‌కు అనుబంధంగా శ్రీపద్మావతి అమ్మవారి పేరుతో ఏర్పాటు అవుతున్న తొలి మహిళా మెడికల్ కళాశాల పనులు వేగంగా సాగుతున్నాయి. 2014-15 విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించే లక్ష్యం తో పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. స్విమ్స్‌కు అనుబంధంగా రేణిగుంట విమానాశ్రయం వద్ద ప్రభుత్వ స్థలంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు గతంలో చర్యలు చేపట్టారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేణిగుంట విమానాశ్రయం వద్ద మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం మార్కెట్ ధరకు 150 ఎకరాల ప్రభుత్వ భూమిని స్విమ్స్‌కు కేటాయిం చారు. అక్కడ టీటీడీ సహకారంతో మెడికల్ కళాశాల, ఫార్మసీ కళాశాల, స్విమ్స్ పరిపాలన భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. స్విమ్స్ నిధులతో ప్రభుత్వం కేటాయించిన భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి కళాశాల కోసం నిర్మాణాలు ప్రారంభించారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించేందుకు టీటీడీ గతంలో ఇచ్చిన హామీని విరమించుకుంది. దాంతో పద్మావతి మెడికల్ కళాశాల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వైఎస్సార్ మరణం తర్వాత కళాశాల ఏర్పాటుకు సహకరించేందుకు కంచి మఠం ముందుకు వచ్చింది. స్విమ్స్ అధికారులు కంచి మఠం ప్రతినిధులు సమావేశమై ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. అయితే ఆ ఒప్పందం కూడా అటకెక్కింది. మెడికల్ కళాశాలను తామే సొంతంగా ఏర్పాటు చేస్తామంటూ కంచిమఠం నిర్వాహకులు అడ్డం తిరిగారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు సహకరించేందుకు టీటీడీ వెనక్కు తగ్గడంతో కంచిమఠం ఆధ్వర్యంలో కళాశాల ఏర్పాటుకు అప్పటి రోశయ్య ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.అయితే అది కూడా వివాదాస్పదమై వ్యవహారం కోర్టుకు చేరింది. తిరుపతిలోనే మెడికల్ కళాశాల ఈ నేపథ్యంలో తిరుపతిలోని భారతీయ విద్యా భవన్ ఏరియాలో మహిళలకోసం మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.దాంతో పనులు ప్రారంభించి, వచ్చే విద్యాసంవత్సరానికల్లా పూర్తిచేసి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేసిన అధికారులు ఎస్వీ మెడికల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్, గతంలో స్విమ్స్ జనరల్ సర్జన్‌గా పనిచేసిన డాక్టర్ పీవీ రామసుబ్బారెడ్డిని డీన్‌గా నియమించారు. కళాశాల అడ్మినిస్ట్రేషన్, అడ్మిషన్లు తదితర వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు. కశాళాల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టనున్నారు. అంతవరకు స్విమ్స్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న వారికి బాధ్యతలు అప్పజెప్పారు. -
సీఎం పర్యటనకు సమైక్య సెగ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సమైక్య ఉద్యమం తీవ్రరూపం దాల్చిన కారణంగా సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలోనే పర్యటించలేని ప రిస్థితి ఏర్పడింది. శని, ఆదివారాల్లో తిరుపతి, తిరుమలలో సీఎం పర్యటనలో ఖరారైన 90 శాతం కార్యక్రమాలను సమైక్య ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని అధికారులు రద్దు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శనివారం రాత్రి శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. పెద్దశేష వాహన సేవలో పాల్గొని ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. వందల కోట్ల రూపాయల విలువచేసే పలు పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఆయన చేతులు మీదుగా జరగాల్సి ఉంది. సీఎం పర్యటన ఖరారైన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నోట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం, అందుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండడం తో వీటిని రద్దు చేశారు. చిత్తూరు జిల్లా మంచినీటి పథకం, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ఎస్వీ విశ్వవిద్యాలయం సైన్స్ బ్లాక్-2, పద్మావతి మహిళా వైద్య కళాశాల శంకుస్థాపనలు, ఫార్మసీ భవన ప్రారంభోత్సవం రద్దు అయిన కార్యక్రమాల్లో ఉన్నాయి. ఆదివారం ఉదయం తిరుమలలో రూ.70 కోట్లతో చేపట్టనున్న శ్రీవారి సేవాసదనం, రూ.20 కోట్లలో చేపట్టే ఓఆర్ఆర్ మూడో దశ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా అధికారులు వాటినీ వాయిదా వేశారు. మారిన కార్యక్రమాల కారణంగా మధ్యాహ్నం 1.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చే ముఖ్యమంత్రి 2.40కి తిరుమలకు చేరుకుంటారు. రాత్రి 7.20 గంటల వరకూ ఖాళీగా అక్కడే ఉంటారు. 7.30 గంటలకు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం తిరుమల నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకొని 8.55 గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళతారని జిల్లా కలెక్టర్ రాంగోపాల్ తెలిపారు. చింతామోహన్ ఇంట్లో చీక టి సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా ఇవ్వని, మాటైనా మాట్లాడని తిరుపతి ఎంపీ చింతామోహన్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యుత్ జేఏసీ నేతలు తిరుపతిలోని చింతామోహన్ ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేసి నిరసన తెలిపారు. రూ.మూడున్నర లక్షల వరకూ విద్యుత్ బిల్లులు బకాయి ఉన్నందున సరఫరాను పునరుద్ధరించాల్సిన అవసరం లేదని విద్యుత్ జేఏసీ నేతలు చెబుతున్నారు. తిరుపతిలో పలుచోట్ల సమైక్య ఉద్యమకారులు చింతామోహన్ దిష్టిబొమ్మలను, ఫొటోలను దహనం చేశారు. నేడు తిరుమలకు రానున్న సీఎం చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం తిరుమల రానున్నారు. ఈ మేరకు కలెక్టర్ రాంగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశా రు. శనివారం మధ్యాహ్నం 1.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుం టారు. అక్కడ 1.50 గంట లకు బయలుదేరి రోడ్డుమార్గాన 2.40 గంటలకు తిరుమలలోని శ్రీపద్మావతి అతి థి గృహానికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి 7.30 గంటలకు శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో పాలొ ్గని రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి, పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటారు. రాత్రి 9.10 గంటలకు పద్మావతి అతిథి గృహానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం 7.40 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి 8.25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అల్పాహారం అనంతరం 8.55 గంటలకు బయలుదేరి హైదరాబాద్ వెళతారు.