2022 Round Up: List Of Flopped Remake Movies In This Year - Sakshi
Sakshi News home page

Year End 2022: అక్కడ హిట్‌.. ఇక్కడ ఫట్‌.. ఫ్లాప్‌ రీమేక్‌ చిత్రాలివే

Published Thu, Dec 29 2022 8:35 AM | Last Updated on Thu, Dec 29 2022 9:58 AM

2022 Roundup: List Of Flopped Remake Movies In This Year - Sakshi

విదేశీ తెరపై హిట్టయిన సినిమా ఇక్కడ కూడా హిట్టవుతుందా? అంటే  ‘గ్యారంటీ’ ఇవ్వలేం. అందుకు ఉదాహరణ ఈ ఏడాది విడుదలైన దాదాపు అరడజను చిత్రాలు. అక్కడ హిట్టయిన చిత్రాలు రీమేక్‌ రూపంలో వచ్చి, ఇక్కడ ఫట్‌ అయ్యాయి. ఆ రీమేక్‌ చిత్రాలను రౌండప్‌ చేద్దాం. 

అరడజను ఆస్కార్‌ అవార్డ్స్‌ సాధించిన హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘ది ఫారెస్ట్‌గంప్‌’ (1994) హిందీలో ‘లాల్‌సింగ్‌ చడ్డా’గా రీమేక్‌ అయింది. టైటిల్‌ రోల్‌ను ఆమిర్‌ ఖాన్‌ చేయగా, అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీ రోల్‌ చేశారు. హిందీలో చైతూకు ఇదే తొలి చిత్రం. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజైన ఈ ఎమోషనల్‌ కామెడీ డ్రామా ఫిల్మ్‌కు బాక్సాఫీస్‌ వద్ద నిరాశే ఎదురైంది. లాల్‌సింగ్‌ చడ్డా జీవితంలో ఎలాంటి ఘటనలు జరిగాయి? దేశవ్యాప్తంగా జరిగిన ఘటనల వల్ల అతని జీవితం ఎలా ప్రభావితం అయింది? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. 

ఇక ఈ ఏడాది అరడజను సినిమాలతో (హిందీలో ‘లూప్‌ లపేట’, ‘శభాష్‌ మిథు’, ‘దోబార’, ‘తడ్కా’, ‘బ్లర్‌’ తెలుగులో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌) ఎంటర్‌టైన్‌ చేసే ప్రయత్నం చేశారు తాప్సీ. ఈ ఆరులో మూడు సినిమాలు ‘లూప్‌ లపేట, దోబార, బ్లర్‌’ విదేశీ చిత్రాలకు రీమేక్‌. 1988లో వచ్చిన జపాన్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘రన్‌ లోలా రన్‌’కు హిందీ రీమేక్‌గా ‘లూప్‌ లపేట’ తెరకెక్కింది. ఆకాష్‌ భాటియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న రిలీజైంది. యజమాని డబ్బును పోగొట్టి, చిక్కుల్లో పడ్డ తన ప్రియుడి కోసం గాయపడ్డ ఓ రన్నింగ్‌ అథ్లెట్‌ ఎలాంటి సాహసాలు చేసింది? ఆమెకు ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి? ఎలా ఎదుర్కొంది? అన్నదే ‘లూప్‌ లపేట’ కథాంశం. 

ఇక స్పానిష్‌ చిత్రాలైన సైన్స్‌ ఫిక్షన్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ‘మిరాజ్‌’  (2018) ఆధారంగా ‘దోబార (2:12)’, స్పానిస్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘లాస్‌ ఓజోస్‌ దే జూలియా (2010) ఆధారంగా ‘బ్లర్‌’ చిత్రాలు రూపొందాయి. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించిన ‘దోబార’ ఆగస్టు 19న రిలీజైంది. పాతికేళ్ల క్రితం ఓ అమ్మాయి చూస్తుండగానే పిడుగు పాటుతో ఒకరు మరణిస్తారు. ఆ అమ్మాయి పెద్దయ్యాక ఆ పరిస్థితులే పునరావృతమై ఓ పన్నెండేళ్ల బాలుడు చిక్కుల్లో పడతాడు. ఓ టీవీ సెట్‌ ఆధారంగా ఆ  బాలుడిని ఈ యువతి ఎలా కాపాడగలిగింది? అన్నదే ‘దోబార’ కథనం.

 ఇక ‘బ్లర్‌’ విషయానికి వస్తే... అజయ్‌ భాల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాప్సీ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 9 నుంచి జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ చిత్రకథ విషయానికి వస్తే.. గాయత్రి, గౌతమి కవలలు. కానీ ఇద్దరూ దృష్టి లోపంతో బాధపడుతుంటారు. అయితే హఠాత్తుగా గౌతమి మరణిస్తుంది. గౌతమి మరణానికి దారితీసిన పరిస్థితులను గాయత్రి తెలుసుకోవాలనుకుంటుంది? ఈ ప్రయత్నంలో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ‘బ్లర్‌’ చిత్రం సాగుతుంది. విదేశీ కథలతో తాప్సీ చేసిన ఈ మూడు చిత్రాలూ ఆశించిన ఫలితాన్నివ్వలేదు.

ఇక ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలైన తెలుగు చిత్రం ‘శాకినీ డాకినీ’ బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రెజీనా, నివేదా థామస్‌ టైటిల్‌ రోల్స్‌ చేసిన ఈ సినిమాకు సుధీర్‌ వర్మ దర్శకుడు. 2017లో వచ్చిన సౌత్‌ కొరియన్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’కు రీమేక్‌గా ‘శాకినీ డాకినీ’ తెరకెక్కింది. అక్రమాలకు ΄ాల్పడే ఓ ముఠా ఆటను ఇద్దరు ట్రైనీ ΄ోలీసాఫీసర్లు ఎలా అడ్డుకున్నారు? అన్నదే ఈ చిత్రకథాంశం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement