
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు బ్రిడ్డిపైన ఉన్న డివైడర్ని ఢీకొట్టి కిందపడ్డారు. ఈ ఘటనలో బ్రిడ్జిపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓవర్ స్పీడ్తో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోహిత్, జాబ్ సెర్చింగ్‌లో ఉన్న బాలప్రసన్న మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ బైక్‌పై అతివేగంగా బైక్ నడపడటంతో డివైడర్‌ను ఢీకొని వంతెనపై నుంచి కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకొని గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment