హాంకాంగ్: సాధారణంగా పక్షులు దారి తప్పి వచ్చి బస్సులు, రైళ్లలో చిక్కుకున్న సందర్భాలను చూశాం. మరికొన్ని చోట్ల కోతులు సైతం రైళ్లలోకి దూకి అల్లరి చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ అడవి పంది రైళులోకి వచ్చి.. బోగీ మొత్తం అటూ ఇటూ పరుగులు తీసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హాంకాంగ్ ద్వీపంలోని క్వారీ బే స్టేషన్‌లో టికెట్ కౌంటర్ వద్ద ఓ పంది పిల్ల జారి పడిపోయి ఓ ట్రైన్‌లోకి చేరుకుంది. దానికి బయటకు ఎలా వెల్లాలో తెలియక ట్రైన్ బోగీలో అటూ ఇటూ పరుగులు తీసింది. దీంతో రైలు ప్రయాణికుల ద్వారా సమాచారం అందుకున్న ట్రైన్ సిబ్బంది ఆ చిన్న అడవి పందిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ, ఆ పంది వేగంగా వారికి చిక్కకుండా పరుగు తీసింది. ఇక కొన్ని స్టాప్‌ల తర్వాత పంది పిల్ల మరో రైలులోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు.
ఇక ఆ ట్రైన్ డిపో చేరుకున్న తర్వాత సిబ్బంది జంతు పరిరక్షణ అధికారుల సాయంతో పంది పిల్లను పట్టుకొని అడవిలోకి వదిలేశారు. పలు ఆకాశహర్మ్యాలు ఉండే హాంకాంగ్‌లో కూడా పర్యతాలు, ఉద్యానవనాలు అధికంగానే ఉన్నాయి. అయితే వాటిలో ఈ అడవి పందులు సంచరిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ వీడియోను హాంకాంగ్ వైల్డ్ బోర్ కాన్సెర్న్ అనే ఫేస్‌బుక్ ఖాతా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇప్పటివరకు రైళ్లలో పక్షులు రావడామే చూశాం. ఇప్పడు అడవి పంది కూడా!!’, ‘వావ్..! రైలులో ఆ అడవి పంది భళే పరుగులు తీస్తుందే!’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: బెంగాల్ టైగర్: అటు కాదురా బాబూ.. ఇటూ..
Comments
Please login to add a commentAdd a comment